విక్రమ్‌ప్రభుకు ఇద్దరు
యువ నటుడు విక్రమ్‌ప్రభు ఇప్పటి వరకూ తన చిత్రాలలో ఒక హీరోయిన్‌తోనే డ్యూయెట్స్ పాడుతూ వచ్చారు. ఇప్పుడు తొలిసారిగా ఇద్దరు ముద్దుగుమ్మలతో రొమాన్స్ చెయడానికి సిద్ధం అయ్యారు. అదేవిధంగా తొలి చిత్రం కుంకీలో మావటివాడుగా నటించి మెప్పించిన ఈయన ఇప్పు డు గ్రామీణ యువకుడిగా కనిపించనున్నారు. ఇదు ఎన్న మా యం చిత్రం తరువాద విక్రమ్‌ప్రభు చిత్రం ఏదీ విడుదల కాలేదు. అయితే ప్రస్తుతం ఆయన నటిస్తున్న రెండు చిత్రాలు నిర్మాణంలో ఉన్నాయి.
అందులో ఒకటి వాగా.జీఎన్ఆర్.కుమారవేల్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం షూటింగ్ చివరి దశకు చేరుకుంది. దీనితో పాటు వీరశివాజీ అనే చిత్రంలో నటిస్తున్నారు. నటి షామిలి హీరోయిన్గా నటిస్తున్న ఈ చిత్రానికి గణేశ్ వినాయక్ దర్శకత్వం వహిస్తున్నారు. కాగా తాజాగా మరో చిత్రానికి విక్రమ్‌ప్రభు పచ్చజెండా ఊపారు. ఇంతకు ముందు సుందరపాండియన్, ఇదు కధిరవేలన్ కాదల్ చిత్రాల దర్శకుడు ఎస్ఆర్.ప్రభాకరన్ తెరకెక్కించనున్న ఈ చిత్రంలో విక్రమ్‌ప్రభు సరసన ఇద్దరు ముద్దుగుమ్మలు నటించనున్నారు. అందులో నటి ఐశ్వర్య దత్ ఇప్పటికే ఎంపికయ్యారు.
ఈమె తమిళుక్కు ఎన్1ఐ అళుత్తవుమ్, ఆరాదుసినమ్ చిత్రాలలో నటించారన్నది గమనార్హం. కాగా మరో హీరోయిన్ కోసం గాలిస్తున్న చిత్ర యూనిట్‌కు నటి మంజిమా మోహన్ కంట పడింది. మలయాళంలో ప్రేమమ్ చిత్రంతో అందరి దృష్టిని ఆకర్షించిన ఈ కేరళా కుట్టికి ఇందులో ప్రధాన పాత్ర అట. అందువల్ల ఇకపై మాతృభాషలో తక్కువ చిత్రాలు చేస్తూ తమిళ చిత్రాలను అధిక శ్రద్ధ చూపాలని నిర్ణయించుకున్నానంటోంది.
మరో విషయం ఏమిటంటే మలయాళంలో హోమ్లీ పాత్రలకే పరిమితం అయిన మంజిమా మోహన్ కోలీవుడ్‌లో గ్లామర్ విషయంలో కాస్త దారాళం చూపాలని నిర్ణయించుకుందట. ఈ అమ్మడు ఇప్పటికే తమిళంలో శింబుకు జంటగా గౌతమ్‌మీనన్ దర్శకత్వంలో అచ్చంయంబదు మడమయడా చిత్రంలో నటిస్తోంది.