పాతకరెన్సీ మార్పిడి చేస్తున్న ముఠా అరెస్టు
1.35 కోట్ల పాత కరెన్సీ స్వాధీనం
హైదరాబాద్: పాతనోట్లు మార్పిడి చేస్తున్న ముఠాను హైదరాబాద్ సంతోష్‌నగర్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఆదివారం సాయంత్రం డీఆర్డీఓ మిత్రా వైన్స్ సమీపంలో ఓ ముఠా నోట్లు మారుస్తున్నట్లు తెలుసుకున్న పోలీసులు దాడిచేసి పట్టుకున్నారు. ఈ దాడిలో రూ.1.35 కోట్ల పాత కరెన్సీతోపాటు రెండు కార్లు, ముగ్గురు నిందితులను అదుపులోకి తీసుకున్నారు.
నిందితుల్లో కొత్తపేట్‌కు చెందిన రియల్ ఎస్టేట్ వ్యాపారి ఉప్పల శ్రీధర్, సీసీఎస్ కానిస్టేబుల్ ఎండీ నజీర్‌హుస్సేన్, డబీర్‌పురాకు చెందిన ఆభరణాల వ్యాపారి మహ్మద్ నజీబుల్లా ఉన్నట్లు ఇన్స్పెక్టర్ ఎం.శంకర్ తెలిపారు. మరో ముగ్గురు పరారీలో ఉన్నారని చెప్పారు.