Ganga fair
-
నేడే తిరుపతి గంగ జాతర ముగింపు
తిరుపతి కల్చరల్: వారం రోజులుగా వైభవంగా జరుగుతున్న తిరుపతి తాతయ్య గుంట గంగమ్మ జాతర మంగళవారంతో పరిసమాప్తం కానుంది. ఈ నెల 14వ తేదీన ప్రారంభమైన జాతరలో భక్తులు రోజుకో వేషం వేసుకుని వచ్చి అమ్మవారిని దర్శించుకున్నారు. వివిధ పౌరాణిక, జానపద వేషాలు వేసుకొని డప్పుల దరువుల నడుమ చిందులు వేస్తూ అమ్మవారికి మొక్కులు తీర్చుకున్నారు. అందుకే తిరుపతి గంగజాతరను ‘వేషాల వేడుక’ అని కూడా పిలుస్తారు.జాతర మహోత్సవంలో చివరి రోజయిన మంగళవారం రాత్రి శ్రీతాతయ్యగుంట గంగమ్మ ఆలయంలో విశ్వరూప ప్రతిమ కొలువు తీరనుంది. ఆలయ ఆవరణలోని అమ్మవారి విశ్వరూప కొడిస్తంబంపై ఈ అమ్మవారి విశ్వరూప ప్రతిమ రూపుదిద్దుకుంటుంది. సోమవారం చంద్రగిరి నియోజకవర్గ ప్రజల తరఫున చంద్రగిరి ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి కుటుంబ సభ్యులు తుమ్మలగుంట నుంచి ఊరేగింపుగా సారెను తీసుకువచ్చి గంగమ్మకు సమర్పించారు. -
జాతరపై టీడీపీ రాజకీయం
అక్రమ వసూళ్లకు పాల్పడినట్లు ఆరోపణలు నగరిలో టీడీపీ నాయకుల ఇష్టారాజ్యం అంతర్మధనంలో పలువురు సీనియర్లు కక్ష సాధింపుతోనే ఎమ్మెల్యే రోజా, మున్సిపల్ చైర్పర్సన్ కుటుంబంపై కేసులు చిత్తూరు : నగరిలో ఏటా ఘనంగా నిర్వహించుకునే గంగ జాతరలోను తెలుగుదేశం పార్టీ రాజకీయం చేసి వర్గ వైషమ్యాలకు ఆజ్యం పోస్తోంది. పార్టీలకు అతీతంగా ఐదేళ్ల నుంచి జాతర నిర్వహిస్తున్న కమిటీని ఈ సారి పూర్తిగా టీడీపీ నేతలు హస్తగతం చేసుకుని ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు. జాతర పేరుతో పెద్ద ఎత్తున అక్రమ వసూళ్లకు తెరతీశారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. కొందరు స్థానిక పోలీసులకు ఫిర్యాదులు చేసినట్లు సమాచారం. దీనిపై స్పందించిన సంబంధిత అధికారి ఒకరు అక్రమ వసూళ్లకు పాల్పడరాదంటూ పత్రికా ప్రకటనలు చేసిన విషయం విదితమే. గతేడాది జరిగిన జాతరలో ఎమ్మెల్యే రోజాపై టీడీపీ వర్గీయులు దాడికి పాల్పడిన సంఘటనకు సంబంధించి ఎమ్మెల్యే ఫిర్యాదు చేసినా పోలీసులు పట్టించుకున్న దాఖలాలు లేవు. రోజా ఎమ్మెల్యేకాక ముందు నుంచే ప్రతి ఏటా జాతరలో భాగంగా శుక్రవారం జరిగే అమ్మవారి హారతికి హాజరుకావడం తెలిసిందే. ఆమెకు అప్పట్లో జాతర నిర్వాహక కమిటీ సభ్యులంతా స్వాగతం పలికిన సందర్భాలు కూడా ఉన్నాయి. అయితే ఎమ్మెల్యేగా గెలిచిన తొలిసారి జరిగిన జాతర (గతేడాది)లో హారతి రోజున టీడీపీ నేతలు చేసిన దాడిలో గాయపడినా ఆమె సహనంతో ఉన్నారు. శాంతిభద్రతల సమస్య తలెత్తకుండా సహకరించారు. గాలి ముద్దుకృష్ణమనాయుడు ఓటమిని జీర్ణించుకోలేకనే టీడీపీ నేతలు అడ్డదారుల్లో ప్రతీకార చర్యలకు పాల్పడుతున్నారనే ఆరోపణలు ఉన్నాయి. ఇందులో భాగంగా మున్సిపల్ కమిషనర్‌ను అడ్డం పెట్టుకుని పోలీసుల సహకారంతో చైర్పర్సన్ కుటుంబంపై అక్రమ కేసులు పెట్టడం తెలిసిందే. మరోవైపు ఈ నెల 15, 16,17,18 న నగరిలో జరిగే జాతరలో తమ ఆధిపత్యం చూపించుకోవాలనే వ్యూహంతో మున్సిపల్ చైర్పర్సన్ కుటుంబాన్ని ఉద్దేశపూర్వకంగానే జాతరకు దూరం చేశారు. కేసుల్లో జైలుకెళ్లిన మున్సిపల్ మాజీ చైర్మన్ కేజే కుమార్, మరో నలుగురికి బెయిల్ వస్తుందని తెలిసి వారు జాతరకు వారొస్తే గొడవలు జరుగుతాయంటూ పోలీసు అధికారులతో నివేదిక ఇప్పించారనే విమర్శలు వస్తున్నాయి. ఇందు కోసం పార్టీలోకి వలసొచ్చిన ఓ టీడీపీ నేత లక్షలాది రుపాయలు ఖర్చుపెట్టారన్న ప్రచారం ఉంది. అయితే టీడీపీ నేతలపై పలుకేసులు ఉన్నా పోలీసులు ఎటువంటి నివేదికలు ఇవ్వకపోవడం గమనార్హం. -
జాతరమ్మో..జాతర!
తిరుపతి కల్చరల్, న్యూస్‌లైన్: తిరుపతి తాతయ్యగుంట గంగ జాతర మంగళవారం వైభవంగా నిర్వహించనున్నారు. సోమవారం అర్దరాత్రి దాటిన తర్వాత ప్రత్యేక అభిషేకాది పూజలు నిర్వహించారు. అనంతరం సుగంధభరిత పుష్పాలతో అమ్మవారిని సుందరంగా అలంకరించారు. మణిమయ స్వర్ణ మకుటాన్ని ధరింపజేసి భక్తులకు దర్శన భాగ్యం కల్పించారు. సప్పరాల సందడి జాతరలో భాగంగా చివరి రోజైన మంగళవారం నాడు భక్తులు సప్పరాలు మోసుకుంటూ వచ్చి అమ్మవారిని దర్శించుకుని మొక్కులు తీర్చుకుంటారు. వెదురు దబ్బలతో గోపుర ఆకారంలో సప్పరాలు తయారు చేస్తారు. శరీర ఆకృతికి అనుగుణంగా తయారు చేసిన సప్పరాలను నేల వాలకుండా జాగ్రత్తలు తీసుకుంటారు. ఒంటికి ఊతంగా గుచ్చుకుని తలపై ధరిస్తారు. రేపు అమ్మవారి ప్రతిమ చెంప తొలగింపు శ్రీతాతయ్యగుంట గంగ జాతరలో ప్రధాన ఘట్టమైన అమ్మవారి చెంప తొలగింపు కార్యక్రమాన్ని బుధవారం వేకువజామున నిర్వహించనున్నారు. అమ్మవారి విశ్వరూపానికి చెంప తొలగింపు జాతరలో ప్రధాన ఘట్టం. చెంప తొలగింపుతో ఏడు రోజుల పాటు అత్యంత ఘనంగా జరిగిన గంగమ్మ జాతర సమాప్తం కానుంది. విస్తృత ఏర్పాట్లు జాతర సందర్భంగా మంగళవారం ఆలయానికి వచ్చే భక్తులకు విస్తృతమైన ఏర్పాట్లు చేపట్టాం. తాగునీరు, ఉచిత వైద్య శిబిరాలు ఏర్పాటు చేశాం. వాహనాలను తుడా ఇందిరా మైదానం, బీఎస్ఎన్ఎల్ కార్యాలయం పక్కనున్న ఖాళీ స్థలంలో పార్కింగ్ చేసుకోవచ్చు. ఇందిరామైదానం, ఇందిరాప్రియదర్శిని కూరగాయల మార్కెట్ సౌత్‌గేట్ వద్ద పొంగళ్లు పెట్టుకోవచ్చు. భద్రత కోసం పోలీసు అధికారుల సహకారం తీసుకున్నాం. - పీ.సుబ్రమణ్యం, తాతయ్యగుంట గంగమ్మ దేవస్థానం ఈవో