వారం రోజులుగా వివిధ వేషాల్లో భక్తులు
నేడు అమ్మవారి విశ్వరూప ప్రతిమ
గంగమ్మకు సారె సమర్పించిన ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి
తిరుపతి కల్చరల్: వారం రోజులుగా వైభవంగా జరుగుతున్న తిరుపతి తాతయ్య గుంట గంగమ్మ జాతర మంగళవారంతో పరిసమాప్తం కానుంది. ఈ నెల 14వ తేదీన ప్రారంభమైన జాతరలో భక్తులు రోజుకో వేషం వేసుకుని వచ్చి అమ్మవారిని దర్శించుకున్నారు. వివిధ పౌరాణిక, జానపద వేషాలు వేసుకొని డప్పుల దరువుల నడుమ చిందులు వేస్తూ అమ్మవారికి మొక్కులు తీర్చుకున్నారు. అందుకే తిరుపతి గంగజాతరను ‘వేషాల వేడుక’ అని కూడా పిలుస్తారు.
జాతర మహోత్సవంలో చివరి రోజయిన మంగళవారం రాత్రి శ్రీతాతయ్యగుంట గంగమ్మ ఆలయంలో విశ్వరూప ప్రతిమ కొలువు తీరనుంది. ఆలయ ఆవరణలోని అమ్మవారి విశ్వరూప కొడిస్తంబంపై ఈ అమ్మవారి విశ్వరూప ప్రతిమ రూపుదిద్దుకుంటుంది. సోమవారం చంద్రగిరి నియోజకవర్గ ప్రజల తరఫున చంద్రగిరి ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి కుటుంబ సభ్యులు తుమ్మలగుంట నుంచి ఊరేగింపుగా సారెను తీసుకువచ్చి గంగమ్మకు సమర్పించారు.
Comments
Please login to add a commentAdd a comment