Gangapatnam Sridhar
-
ఆ నిర్మాతకు "ఉడుంబు" తెలుగు రీమేక్ రైట్స్..
Udumbu Telugu Remake Rights Went To Producer Gangapatnam Sridhar: మలయాళంలో మంచి హిట్ సాధించిన చిత్రం "ఉడుంబు". ఈ సినిమా తెలుగు రీమేక్ రైట్స్ ను ప్రముఖ నిర్మాత గంగపట్నం శ్రీధర్ సొంతం చేసుకున్నారు. నిర్మాత శ్రీధర్ ఇంతకుముందు అంజలి టైటిల్ పాత్రలో "చిత్రాంగద", సుమంత్ తో 'ఇదం జగత్" ఛార్మితో మంత్ర-మంగళ" వంటి పలు చిత్రాలతోపాటు.. సుకుమార్ "కుమారి 21ఎఫ్" చిత్రాన్ని కన్నడలో రీమేక్ చేసి విజయం సాధించారు. తాజాగా రమ్యకృష్ణతో కన్నడలో "శివగామి" చిత్రాన్ని నిర్మిస్తున్నారు. "ఉడుంబు" చిత్రాన్ని మలయాళంలో కె.టి.మూవీ హౌస్ పతాకంపై స్వీయ నిర్మాణంలో కె.టి.తమరక్కుళం దర్శకత్వం వహించారు. పెద్దగా అంచనాలు లేకుండా విడుదలైన "ఉడుంబు" మలయాళంలో అనూహ్య విజయం సాధించింది. పలు అగ్రనిర్మాణ సంస్థలు "ఉడుంబు" తెలుగు రీమేక్ రైట్స్ కోసం పోటీపడినప్పటికీ.. ఈ చిత్రం హక్కులు తమకు దక్కడంపై నిర్మాత గంగపట్నం శ్రీధర్ సంతోషం వ్యక్తం చేశారు. ఈ చిత్రం శ్రీవిఘ్నేష్ కార్తీక్ సినిమా పతాకంపై త్వరలోనే సెట్స్ కు వెళ్లనుంది. దర్శకత్వ శాఖలో విశేష అనుభవం కలిగిన యువ ప్రతిభాశాలి "రత్నాకరం అనిల్ రాజు" ఈ చిత్రం ద్వారా పరిచయం కానున్నాడు. ఇంకా టైటిల్ పెట్టని ఈ క్రేజీ చిత్రానికి ప్రస్తుతం స్క్రిప్ట్ పనులతోపాటు నటీనటులు-సాంకేతిక నిపుణుల ఎంపిక జరుగుతోంది. అయితే ఈ "ఉడుంబు" మూవీని ఇప్పటికే హిందీలో జాన్ అబ్రహాం రీమేక్ చేస్తుండగా.. తమిళలంలో ఓ సీనియర్ హీరోయిన్ తనయుడిని కథానాయకుడిగా పరిచయం చేస్తున్నారు. -
'కిరాక్' మూవీ స్టిల్స్
-
అపార్ట్మెంట్లో ప్రేమకథ!
అదో అందమైన అపార్ట్మెంట్. అందులో నివసించేవాళ్లకి కలుపుగోలుతనమూ ఎక్కువే. కలహానికి కాలు దువ్వడమూ ఎక్కువే. అయితే ఆ ఇద్దరికీ మాత్రం ఇవేం పట్టవు. అందరి కళ్లనూ తప్పించుకుని, ప్రేమ ఊసులు చెప్పుకోవడానికి తహతహలాడుతుంటారు. ఈ జంట ప్రేమ ప్రయాణం ఎలా మొదలైంది? ఆ ప్రేమకు శుభం కార్డు పడుతుందా? తదితర అంశాలతో రూపొందిన చిత్రం ‘ఎంత అందంగా ఉన్నావె’. ‘నువ్విలా’ ఫేమ్ అజయ్ మంతెన, జియానా జంటగా ఎస్.ఐ.మహేంద్ర దర్శకత్వంలో శ్రీ విఘ్నేష్ కార్తీక్ సినిమా పతాకంపై గంగపట్నం శ్రీధర్ నిర్మించారు. ఈ నెల 8న ఈ చిత్రం విడుదల కానుంది. నిర్మాత మాట్లాడుతూ-‘‘ఓ అపార్ట్మెంట్లో ఓ యువతీ యువకుడి మధ్య పుట్టిన ప్రేమకథతో ఈ సినిమా తీశాం. కచ్చితంగా యువతరాన్ని, కుటుంబ ప్రేక్షకులనూ ఆకట్టుకుంటుంది’’ అని తెలిపారు. దర్శకుడు ఎస్.ఐ. మహేంద్ర మాట్లాడుతూ -‘‘సిరివెన్నెల సాహిత్యం, యోగీశ్వర శర్మ సంగీతం ఈ సినిమాకు మెయిన్ పిల్లర్స్. అల్లర్లు, అలకలు, తమాషాలు, భావోద్వేగాలతో సినిమా సరదా సరదాగా సాగిపోతుంది’’ అన్నారు. ఈ చిత్రానికి సహనిర్మాతలు: అశోక్ సోని, మహ్మద్ రఫీ, సమర్పణ: తమ్మిరెడ్డి చంద్రశేఖర్రెడ్డి.