gangula kamalakrao
-
కరీంనగర్ పేరు చెబితే.. ప్రతిపక్షాల గుండెఝల్లు
సాక్షిప్రతినిధి, కరీంనగర్: ఉద్యమకాలం నుంచి ‘కరీంనగర్ పేరు చెబితే ఝల్లు మనాలే’ అని పాటలు పాడుకున్నామని, ఇప్పుడు ఇక్కడ జరుగుతున్న అభివృద్ధిని చూసి ప్రతిపక్షాలకు గుండెఝల్లు మంటోందని మున్సిపల్ మంత్రి కె.తారకరామారావు అన్నారు. కరీంనగర్‌లోని మానేరు నదిపై నిర్మించిన తీగల వంతెనను మంత్రి గంగుల కమలాకర్, ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బి.వినోద్ కుమార్‌లతో కలిసి బుధవారం ప్రారంభించారు. అనంతరం మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ.. కరీంనగర్లో రూ.220 కోట్లతో తీగల వంతెన, రూ.410 కోట్లతో మానేరు రివర్‌ఫ్రంట్ వంటి ప్రాజెక్టులతో నగరం అభివృద్ధి చెందుతోందన్నారు. మానేరు నది మొత్తం 180 కి.మీల పొడవునా సుజల దృశ్యంగా మార్చాలన్న పట్టుదలతో పనిచేస్తున్నామన్నారు. ఉద్యమకాలంలో జలదృశ్యంలో మొదలై.. రాబోయే దసరా నాటికి మానేరు సుజల దృశ్యంగా ఆవిష్కారం కాబోతుందని ప్రకటించారు. ‘నా తెలంగాణ కోటి రతనాల వీణ’ అని కాళోజీ అన్నట్లుగా.. ‘నా తెలంగాణ కోటి మాగాణం’గా చేస్తున్నామన్నారు. కాళేశ్వరం, పాలమూరు–రంగారెడ్డి ఎత్తిపోతలతో గోదావరి–కృష్ణా నీటిని ఒడిసి తెలంగాణ బీడుభూములను సస్యశ్యామలం చేశామన్నారు. పనిచేసే వారికి పట్టం కట్టండి.. కరీంనగర్ అభివృద్ధిలో మంత్రి గంగుల కమలాకర్ సంకల్పాన్ని కేటీఆర్ ప్రశంసించారు. సీఎం ముద్దుగా ‘కరీంనగర్ భీముడు’ అని పిలుచుకునే గంగుల కమలాకర్ చొరవతోనే అందమైన జంక్షన్లు, రోడ్లతో నగరం సర్వాంగ సుందరంగా మారిందన్నారు. వచ్చే ఎన్నికల్లో ఆయన్ను వెన్నుదట్టి మరోసారి ప్రోత్సహించాలని ప్రజలను కోరారు. అదే సమయంలో ప్రణాళికా సంఘం బోర్డు ఉపాధ్యక్షుడు బి.వినోద్‌కుమార్‌ను ఎంపీగా కోల్పోయామని వాపోయారు. ఇపుడున్న ఎంపీ ఏం మాట్లాడుతడో ఆయనకే తెలియదని విమర్శించారు. నగరంలో పదెకరాల్లో తిరుమల తిరుపతి దేవస్థానం వారి ఆధ్వర్యంలో గుడి కట్టిన నాయకుడు ఉన్నాడా? అని ప్రశ్నించారు. రాష్ట్రంలో పల్లెప్రగతి నుంచి పట్టణప్రగతి వరకు దేశంలో మనమే నెంబర్ వన్‌గా ఉన్నామన్నారు. వ్యవసాయ, పారిశ్రామిక, సంక్షేమ రంగాల్లో సీఎం కేసీఆర్ నేతృత్వంలో తెలంగాణ దూసుకుపోతోందని, అందులో కరీంనగర్ తెలంగాణలోనే అగ్రభాగంలోనే ఉందని తెలిపారు. అందుకే, పనిచేసేవారిని ప్రోత్సహించాలని కోరారు. పనిచేయని వారిన చెత్తబుట్టలో వేయాల్సిన బాధ్యత మీదేనని ప్రజలకు పిలుపునిచ్చారు. తమ ప్రభుత్వానికి అభివృద్ధి, సంక్షేమం రెండు కళ్లని.. అభివృద్ధే తమ కులమని.. జనహితమే తమ మతం అని ముగించారు. ప్రాజెక్టులతో కరీంనగర్‌కు ప్రపంచస్థాయి గుర్తింపు : గంగుల అంతకుముందు మంత్రి గంగుల కమలాకర్ మాట్లాడుతూ.. ఉద్యమకాలం నుంచి కరీంనగర్ అంటే సీఎం కేసీఆర్‌కు ప్రత్యేక అభిమానమని గుర్తుచేశారు. కేబుల్ వంతెన, మానేరు రివర్‌ఫ్రంట్ ఆగస్టు 15 నాటికి మొదటి దశ ప్రారంభిస్తామన్నారు. ప్రపంచంలోనే మూడో అతిపెద్ద వాటర్ ఫౌంటేన్ ప్రారంభమవుతుందని, ఈ ప్రాజెక్టులతో నగరానికి ప్రపంచస్థాయి గుర్తింపు వస్తుందని ధీమా వ్యక్తం చేశారు. ఇన్ని అవకాశాలు కల్పించిన సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్‌కు కృతజ్ఞతలు తెలిపారు. ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు బి. వినోద్ మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్ గతంలో చెప్పినట్లుగా కరీంనగర్‌ను లండన్ తరహాలో తీర్చిదిద్దుతున్నారన్నారు. రాష్ట్రం ఇస్తే ఏం చేస్తారన్న వెక్కిరింపులను దాటి.. నదులను ఎత్తి కోటి ఎకరాలకు నీళ్లు తెచ్చామని, నిరంతర కరెంటు ఇస్తున్నామని చెప్పారు. -
మంత్రి గంగుల కమలాకర్‌కు తృటిలో తప్పిన ప్రమాదం
సాక్షి, కరీంనగర్: తెలంగాణ మంత్రి గంగుల కమలాకర్‌కు తృటిలో పెను ప్రమాదం తప్పింది. జిల్లాలో పర్యటన సందర్భంగా అపశ్రుతి చోటుచేసుకుంది. ఈ ఘటనలో మంత్రి కాలికి స్వల్ప గాయమైంది. వివరాల ప్రకారం.. కరీంనగర్ జిల్లాలోని చర్ల బూత్కూరులో మంత్రి గంగుల కమలాకర్ కార్యక్రమానికి హాజరయ్యారు. ధాన్యం కొనుగోలు కేంద్రం ప్రారంభోత్సవ వేదికపై నుంచి గంగుల కింద పడిపోయారు. ఎక్కువ మంది రావడం వల్ల సభా వేదిక ఒక్కసారిగా కుప్పకూలింది. ఈ ఘటనలో మంత్రి సహా పలువురికి స్వల్ప గాయాలయ్యాయి. గాయపడిన ఓ జడ్పీటీసీ సభ్యుడిని ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై మంత్రి కమలాకర్ మీడియాతో మాట్లాడారు. సభావేదిక కూలిన ఘటనలో స్వల్ప గాయాలయ్యాయని, డాక్టర్లు చికిత్స చేశారని, విశ్రాంతి తీసుకోవాలని చెప్పారని వెల్లడించారు. అనంతరం.. మంత్రి గంగుల కమలాకర్‌ను ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు వినోద్ కుమార్‌తోపాటు మేయర్ సునీల్ రావు పరామర్శించారు. -
తెలంగాణ మంత్రి గంగుల వ్యాఖ్యలు సరికావు : మంత్రి చెల్లుబోయిన వేణు
-
రంగంలోకి హరీష్ రావు
-
కేసీఆర్,టీఆర్ఎస్ పార్టీకి రుణపడి ఉంటా
-
‘టీఆర్ఎస్తోనే అన్నివర్గాల అభ్యున్నతి’
సాక్షి,కొత్తపల్లి: టీఆర్ఎస్ ప్రభుత్వం అన్ని వర్గాల ప్రజల అభ్యున్నతికి కృషి చేసిందని కరీంనగర్ టీఆర్ఎస్ అభ్యర్థి, మాజీ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ తెలిపారు. కొత్తపల్లి మండలం రేకుర్తిలోని సాలెహ్నగర్, హనుమాన్‌నగర్, ద్వారకానగర్, గౌడ కాలనీ, షేకాబీకాలనీల్లో మాజీ సర్పంచ్ నందెల్లి ప్రకాష్, మాజీ ఉపసర్పంచ్ సుదగోని కృష్ణ కుమార్ గౌడ్ల ఆధ్వర్యంలో శుక్రవారం కమలాకర్‌కు డప్పు చప్పుళ్లు, మంగళహారతులు, పూలతో స్వాగతం పలికారు. ప్రచారంలో భాగంగా ఇంటింటికీ తిరుగుతూ పలు మసీదుల్లో ముస్లింను కలిసి ఓట్లు అభ్యర్థించారు. ఆయా కాలనీల్లో ఏర్పాటు చేసిన సభల్లో గంగుల మాట్లాడుతూ ఐదేళ్లుగా కనిపించని కాంగ్రెస్, బీజేపీ అభ్యర్థులను ఎందుకు పట్టించుకోలేదో నిలదీయాలని కోరారు. మహాకూటమి రూపంలో చంద్రబాబు తెలంగాణ గడ్డపై విషం చిమ్మే ప్రయత్నం చేస్తోందని అన్నారు. తెచ్చుకున్న తెలంగాణలో ఆంధ్రా దొంగలు పడేందుకు చేస్తున్న కుట్రలను తిప్పికొట్టాలని అన్నారు. ప్రభుత్వ అభివృద్ధి, సంక్షేమ కొనసాగాలంటే ఇంటిపార్టీ టీఆర్ఎస్ను గెలిపించాలని కోరారు. మాజీ ఎమ్మెల్యే కోడూరి సత్యనారాయణగౌడ్, ఎంపీపీ వాసాల రమేష్, జెడ్పీటీసీ ఎడ్ల శ్రీనివాస్, జెడ్పీ కోఆప్షన్ జమీలొద్దీన్, ఎంపీటీసీ శేఖర్, టీఆర్ఎస్వీ నాయకుడు పొన్నం అనీల్‌గౌడ్, మాజీ వార్డుసభ్యులు ఎస్.నారాయణగౌడ్, మాజీద్, రహీం, రాచకొండ నరేశ్, పొన్నాల తిరుపతి, అస్తపురం నర్సయ పాల్గొన్నారు. పలువురి చేరిక రేకుర్తికి చెందిన కాంగ్రెస్, టీడీపీ సీనియర్ సీనియ ర్ నాయకులు అస్తపురం అంజయ్య, నెల్లి చంద్ర య్య, విశ్వబ్రాహ్మణ సంఘం అధ్యక్షుడు రవీందర్‌లు గంగుల సమక్షంలో టీఆర్ఎస్లో చేరారు. -
‘తెలంగాణ’లో అందరికీ సమన్యాయం
కరీంనగర్‌కల్చరల్, న్యూస్‌లైన్ : ఆత్మగౌరవం, సమానత్వం, సమన్యాయం అజెం డాతోనే తెలంగాణ రాష్ట్రం ఏర్పడుతుందని టీఆర్ఎస్ శాసనసభపక్ష ఉపనేత టి.హరీష్‌రావు అన్నారు. నగరంలోని ప్రభుత్వ పురాతన పాఠశాల మైదానంలో తె లంగాణ క్రిస్టియన్ ఫోరం ఆవిర్భావసభ, క్రిస్మస్ వేడుకలు ఆదివారం జరిగాయి. ముఖ్య అతిథిగా పాల్గొన్న ఆయన మట్లాడుతూ తెలంగాణ ఉద్యమానికి కులం, మతం లేదని, నాలుగు కోట్ల ప్రజల ఆరాటం, గుండె చప్పుడని అన్నారు. తెలంగాణ విషయంలో కేంద్రం అసెంబ్లీ తీర్మానం అడగడం లేదని, కేవలం అభిప్రాయం మాత్రమే అడుగుతుందని అన్నారు. అయినా అసెంబ్లీలో తీర్మానాన్ని అడ్డుకుంటామని సీఎం అనడం ఆయన అజ్ఞానానికి నిదర్శనమన్నారు. క్రైస్తవులంతా ఐకమత్యంగా ఉండాలని, అప్పుడే హక్కులు సాధించగలరని సూచించారు. గత ప్రభుత్వాలు క్రైస్తవులకు కనీసం సమాధుల కోసం కూడా స్థలాలు ఇవ్వలేదని ఆవేదన వ్యక్తం చేశారు. తెలంగాణ రాష్ట్రంలో క్రిస్టియన్ల కమ్యూనిటీ హాల్స్, మ్యారేజి హాల్స్, చర్చిలకు విద్యుత్ సబ్సిడీ అందిస్తామన్నారు. ఎమ్మెల్యే గంగుల కమలాకర్ మాట్లాడుతూ క్రైస్తవులకు సంపూర్ణ రక్షణగా టీఆర్ఎస్ ఉంటుందన్నారు. రెవ.డాక్టర్ పాల్సన్రాజ్, రెవ.డాక్టర్ జయప్రకాశ్ మాట్లాడుతూ క్రీస్తు చూపిన మార్గంలో పయనిస్తూ ప్రపంచ శాంతికి కృషిచేయాలని సూచించారు. ఫోరం ఏర్పాటు సందర్భంగా ప్రార్థనలు చేశారు. క్రిస్టియన్ ఫోరం ఫౌండర్, ప్రధాన కార్యదర్శి కె.జోరం, జిల్లా అధ్యక్షుడు బి. సురేశ్‌కుమార్, టీఆర్ఎస్ నాయకులు ఓరుగంటి ఆనంద్, సర్దార్ రవీందర్‌సింగ్, ఆర్టీసీ టీఎంయూ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ థామస్‌రెడ్డి, కె.వినయ్‌కుమార్, జి.కృపాదానం, బందెల సత్యం, వినయసాగర్, సూర్యప్రకాశ్ శాతల్ల సాగర్, ఆనంద్, వినోదమ్మ, ఎలివే, జయరాజ్ తదితరులు పాల్గొన్నారు. ఫోరం గౌరవాధ్యక్షుడిగా హరీష్‌రావును ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.