అద్దె షట్టర్లపై రాజకీయరంగు
నేతల పైరవీలతో అధికారులపై ఒత్తిడి
ముకరంపుర: జిల్లా కేంద్రంలోని గంజ్ హైస్కూల్ షట్టర్ల లీజు వ్యవహారంలో రాజకీయ రంగు పులుముకుంది. లీజు గడువు ముగిసి ఎనిమిదేళ్లు గడిచినా మార్కెట్ విలువను పరిగణలోకి తీసుకోకుండా తక్కువ అద్దెతో యజమానులుగా చెలామణి అవుతున్న వ్యాపారులకు అధికార పార్టీ నేతలు సహకరిస్తున్నారనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. లోపాయికారీ ఒప్పందాలతో సర్కార్ ఆదాయానికి భారీగా గండుకొడుతున్నా అధికారులు పట్టించుకోవడం లేదు. ఈ వ్యవహారంపై సెప్టెంబర్ 30న సాక్షిలో ‘కదలరు.. వదలరు’ శీర్షికన కథనం ప్రచురించిన విషయం తెలిసిందే. దీంతో అప్రమత్తమైన వ్యాపారులు అధికార పార్టీ నేతలను ఆశ్రయించి అధికారులపై ఒత్తిడి పెంచుతున్నట్లు సమాచారం.