కందిచేనులో గంజాయి సాగు
మెదక్: జహీరాబాద్ మండలంలోని సజ్జారావుపేట తండాలో అక్రమంగా సాగు చేస్తున్న గంజాయి పంటను అధికారులు దహనం చేశారు. తండాకు చెందిన ఓ రైతు కందిచేను మధ్యలో గంజాయి మొక్కలను పెంచుతున్నట్లు అధికారులకు సమాచారం అందింది. దీంతో హూటా హుటిని అక్కడికి చేరుకున్న అధికారులు కంది చేనులో ఉన్న గంజాయి మొక్కలను గుర్తించారు.
దాదాపు 200 గంజాయి మొక్కలను పెరికేసిన ఇరు శాఖల సిబ్బంది వాటిని తగులబెట్టారు. అనంతరం చేను యజమాని లాలూను అదుపులోకి తీసుకుని పోలీసు స్టేషన్ కు తరలించారు.