గన్నవరం నుంచి ఢిల్లీకి ఏయిరిండియా సర్వీసు
విజయవాడ: విమానయాన సంస్థ ఎయిర్ ఇండియా.. గన్నవరం నుంచి న్యూఢిల్లీకి నూతన సర్వీసు ప్రారంభించింది. ఈ సర్వీసుని ఎంపీలు కేశినేని నాని, కొనకళ్ల నారాయణ తదితరులు గురువారం ఉదయం లాంఛనప్రాయంగా ప్రారంభించారు. మరిన్ని విమాన సర్వీసులు తెచ్చే దిశగా ప్రయత్నిస్తామని ఎంపీలు చెప్పారు.
ఇప్పటికే హైదరాబాద్ మీదుగా ఢిల్లీ-విజయవాడ మధ్య ప్రతిరోజు ఒక సర్వీసు నడుస్తోంది. ఢిల్లీ నుంచి బ్యాంకాక్, బర్మింగ్‌హాం, ఫ్రాంక్ఫర్ట్, ఖాట్మండు, లండన్, మెల్బోర్న్, సిడ్నీ, ప్యారిస్, రోమ్, మిలన్‌లకు వెళ్లే విమానాలకు కనెక్ట్ అయ్యేందుకు కొత్త సర్వీసు దోహదం చేస్తుందని ఎయిర్ ఇండియా తెలిపింది.