కేసీఆర్ ఉద్యమ ఫలితమే తెలంగాణ
భిక్కనూరు, న్యూస్‌లైన్ : సీమాంధ్ర పాలకుల చెర నుంచి విముక్తి పొందేందుకు 60 ఏళ్లుగా తెలంగాణ ప్రజలు చేస్తున్న ఉద్యమానికి, టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కూడా కలిసి ఉద్యమాన్ని ముందుకు నడపడంతోనే కేంద్రప్రభుత్వం తెలంగాణ ఏర్పాటు చేసిందని ఎమ్మెల్యే గంప గోవర్ధన్ అన్నారు. ఆయన గురువారం భిక్కనూరు మండలంలోని బస్వాపూర్, తిప్పాపూర్ గ్రామాల్లో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన, ప్రారంభోత్సవాలు చేశారు. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశాల్లో ఆయన మాట్లాడారు. తెలంగాణ ఏర్పాటు విషయంలో ఏయే పార్టీలు నేతలు ఏ విధంగా మాట్లాడారో, వారు చేసిన ఉద్యమద్రోహ పనులను ప్రజ లు గుర్తుంచుకోవాలన్నారు.
తెలంగాణ అభివృద్ధికి అందరూ కలిసి వచ్చి సహకరిం చాలన్నారు. టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ 14 ఏళ్లుగా చేపట్టిన ఉద్యమం దేశ స్వాతంత్య్ర పోరాటాన్ని తలపించిందన్నారు. రైతు బాగుంటేనే అన్ని రంగాలు బాగుంటాయని, దీన్ని రానున్న తెలంగాణ ప్రభుత్వం గుర్తించి ఆ దిశగా చర్యలు చేపడుతుందన్నారు. కార్యక్రమంలో డీసీఎంఎస్ చైర్మన్ ముజీబొద్దీన్, తిప్పాపూర్ విండో చైర్మన్ వంగేటి చిన్న నర్సారెడ్డి, సర్పంచులు తు డుం పద్మ, తాటిపల్లి జమున, వీడీసీ అధ్యక్షులు ఆకుల రాములు, సాలకేంద్రం మండలాధ్యక్షుడు మామిడి భూ పాల్‌రెడ్డి, తిప్పాపూర్ అధ్యక్షుడు కుంట లక్ష్యరెడ్డి, టీఆర్ఎస్ నేతలు వంగేటి దుర్గారెడ్డి, ఎన్గు వెంకట్‌రెడ్డి, బాల్‌రెడ్డి, కమలాకర్, జూకంటి మోహన్‌రెడ్డి, బుర్రిగోపాల్, కర్నాల మల్లేశం, చిన్న సిద్ధరాములు, బల్వంత్‌రావు, భూమ్‌రావు, విఠల్‌రెడ్డి పాల్గొన్నారు.