మంత్రి కార్యాలయం ముట్టడి..
విశాఖ: ఆంధ్రప్రదేశ్లో స్కూల్, కాలేజీ ఫీజుల నియంత్రణలో ప్రభుత్వం వైఫల్యం చెందిందంటూ ఏబీవీపీ కార్యకర్తలు ఆరోపించారు. ఆదివారం ఉదయం విశాఖలోని మంత్రి గంటా క్యాంప్ కార్యాలయాన్ని విద్యార్థి సంఘ నాయకులు ముట్టడించారు.
తమిళనాడు తరహాలో రెగ్యులేటరీ విధానాన్ని అమలు చేయాలని డిమాండ్ చేస్తూ..ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. దీంతో కొద్దిసేపు ఉద్రిక్త వాతావరణం నెలకొంది. పోలీసులు ఏబీవీసీ కార్యకర్తలను అరెస్ట్ చేసి స్టేషన్కు తరలించారు.