డిజైనర్ కేక్స్... యూరోపియన్ డెసర్ట్స్...
వినియోగదారులకు అవసరమైన సందర్భం, సెలబ్రేషన్లను ఆధారం చేసుకుని కేక్స్ అందించడం ప్రత్యేకతగా కేక్ బొటిక్‌లు రూపుదిద్దుకుంటున్నాయి. కేక్స్‌ను ఒక పేషన్‌తో, ఆసక్తికరంగా డిజైన్ చేయడం అనే ట్రెండ్‌కు ఇది మరింత ఊపునిస్తోంది. మ్యాకరాన్స్, చౌక్స్ పేస్ట్రీస్ తదితర యూరోనియన్ డసర్ట్స్ కేక్ లవర్స్‌కు క్రేజీగా మారాయి. అలాగే పారిస్ బ్రెస్ట్, శాండ్ విచ్ కేక్స్‌కు సిటీలో రోజు రోజుకూ ఫ్యాన్ ఫాలోయింగ్ పెరుగుతోంది.
డిజైనర్ కేక్స్‌కు థీమ్స్‌ను జోడించడం ఓ రీసెంట్ ట్రెండ్. తమ వెరైటీ టేస్ట్‌లకు తగ్గట్టుగా కేక్ లవర్స్ థీమ్‌ను ఎంచుకుంటున్నారు. ఉదాహరణకు ఓ బొటిక్‌లో తయారైన త్రీటైర్డ్ అక్వేరియమ్ థీమ్ కేక్. ఇందులో ఫిష్ బౌల్స్, లైట్స్, నిజమైన ఫిష్, జ్యుయెలరీ చెస్ట్... వీటిలో అలాగే గార్డెన్ థీమ్ కేక్ కూడా. ఫ్లవర్ బాస్కెట్స్ తరహాలో రూపొందే ఈ కేక్‌లో షాంపేన్ ఫిల్డ్ ఫ్లూట్స్... ఇంకా ఎన్నో మిళితమై ఉంటాయి. వెడ్డింగ్స్, బర్త్‌డే వంటి సందర్భాలకు మాకరాన్ గిఫ్ట్ బాక్స్‌లు చాలా ఫేమస్ బేకరీ ఉత్పత్తుల సంస్థగా ఇంగ్లండ్‌లో ఊపిరి పోసుకున్న కొంకు... తర్వాత ఒక కాన్సెప్ట్‌గా విస్తరించింది. జూబ్లీహిల్స్‌లో సాహిల్ తనేజా, స్వాతి ఉపాధ్యాయ దంపతులు దీన్ని ప్రారంభించారు.
ఆరేళ్ల క్రితం బయోటెక్ డిజైనర్ సాహిల్ తనేజా... ఇంగ్లండ్‌కు వెళ్లిన అనంతర కాలంలో చెఫ్‌గా మారారు. అక్కడ బేకింగ్‌కు సంబంధించిన ఆర్ట్‌ను నేర్చుకున్నారు. పంచదార, బట్టర్, ఎగ్స్, ఫ్లేవర్ల వంటి ముడిసరుకులను ఉపయోగించి కళాత్మక కేక్స్‌ను రూపొందించడం తెలుసుకున్నారు. ‘హామర్స్మిత్ ఈలింగ్ అండ్ వెస్ట్ లండన్ కాలేజ్‌లో పోస్ట్ గ్రాడ్యుయేట్ డిప్లొమా పొందారు. ‘‘ మా దగ్గర మాకరాన్స్, ఎక్లయిర్స్, తిరామిసు, కప్‌కేక్స్, వూపీ పైస్... బాగా పాప్యులర్. మాది డిజైసర్ కేక్స్‌కు సంబంధించి ఒక ఎక్స్‌క్లూజివ్ బొటిక్’’ అంటున్నారీ కొంకు నిర్వాహకులు.
టేస్ట్ స్పెషలిస్ట్
సంకల్ప్