వరదల్లో ఇద్దరు గల్లంతు
చిత్తూరు: సోమల మండలంలోని అన్నెమ్మగారిపల్లి వద్ద గార్గేయనది వరదల్లో ఇద్దరు వ్యక్తులు గల్లంతయ్యారు. ఈ సంఘటనలో అన్నెమగారిపల్లి పంచాయతీ చిన్నతోపు గ్రామానికి చెందిన రజిత(15), సుబ్రహ్మణ్యం(60) అనే ఇద్దరు గల్లంతైనట్లు తెలిసింది.
గల్లంతైన వారి కోసం అధికారలు, గ్రామస్థులు గాలింపు చర్యలు చేపట్టారు. గల్లంతైన ఇద్దరూ తండ్రీకూతుళ్లు. వరదలతో సోమల మండలంలోని 24 గ్రామాలు జలదిగ్బంధమయ్యాయి.