డీసీఎంను ఢీకొట్టిన వోల్వో: ఇద్దరు మృతి
నల్గొండ : నల్గొండ జిల్లా కోదాడ జాతీయ రహదారిపై మంగళవారం ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. డీసీఎం వ్యాన్‌ను గరుడ వోల్వో బస్సు ఢీకొట్టింది.ఈ ప్రమాదంలో ఇద్దరు వ్యక్తులు అక్కడికక్కడే మరణించారు. స్థానికులు సమాచారం మేరకు పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని... రెండు మృతదేహాలను స్వాధీనం చేసుకున్నారు.
పోస్ట్‌మార్టం నిమిత్తం మృతదేహాలను నల్గొండ ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఈ ప్రమాదంపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మృతులు డీసీఎం వ్యాన్ డ్రైవర్ శ్రీనివాస్, గరుణ బస్సు క్లీనర్ వినయ్‌కుమార్ రెడ్డి అని పోలీసులు చెప్పారు.