Gas crisis
-
వంట... వనరులు
‘గ్యాస్ మామ రావే...జాబిల్లి రావే’ అని పిల్లలు పాడుకుంటున్నారట! ఈ సరదా సరదా పాటల సంగతి ఎలా ఉన్నా, ఎల్పీజీ గ్యాస్ అనే మాట బాంబులా భయపెడుతూనే ఉంది. గ్యాస్ సంక్షోభం వచ్చినప్పుడల్లా... ‘అయ్యో!’ అనుకోవడం కాకుండా...కాస్త ముందు చూపుతో ప్రత్యామ్నాయ ఇంధన వనరులు ఏర్పాటు చేసుకుంటే సమస్యే ఉండదు కదా! ‘స్మార్ట్ ప్లానింగ్ ఉంటే శాశ్వత పరిష్కారం మన సొంతం’ అని నిరూపించింది ప్రభాత్ స్కూల్...మహారాష్ట్ర అకోలాలోని ‘ప్రభాత్ డే అండ్ బోర్డింగ్ స్కూల్’లో వ్యవసాయ వ్యర్థాలతో పనిచేసే ‘ఫ్లేమ్ లెస్ సిస్టమ్’ను ఉపయోగించి రోజుకు పదిహేను వందల మంది విద్యార్థులకు వంటవార్పు చేస్తున్నారు. స్మార్ట్ ప్లానింగ్ శాశ్వత పరిష్కారాలకు ఎలా ఉపయోగపడుతుందో ‘ప్రభాత్ స్కూల్’ నిరూపించింది.మంట లేకుండా వంటప్రభాత్ స్కూల్ కిచెన్‌లో ‘మంట లేకుండా వంట’ అనేది నిన్నా మొన్నటి కాన్సెప్ట్ కాదు. దశాబ్ద కాలం క్రితమే వచ్చిన దీర్ఘకాలిక ఆలోచన. సంప్రదాయ ఇంధనాలపై ఆధారపడడాన్ని తగ్గించడానికి చేసిన ప్రయత్నం. ఆ దూరదృష్టి ఊరకే పోలేదు. ఎంతోమంది కి స్ఫూర్తి ఇస్తోంది.స్కూల్ వంటగదిలో సంప్రదాయ వంటగ్యాస్‌కు బదులు థర్మిక్ ఫ్లూయిడ్ హీటింగ్ సిస్టమ్‌ను ఉపయోగిస్తారు. సరళంగా చె΄్పాలంటే ఆయిల్ పైపుల ద్వారా వేడి సర్క్యులేట్ అవుతుంది.. మంట లేకుండా స్థిరమైన వేడి వంట పాత్రలకు చేరుతుంది. వ్యవసాయ వ్యర్థాల నుండి తయారైన బయోమాస్– ఆధారిత ఇంధన గుళికలు(ఫ్యూయెల్ పిల్లెట్స్) ద్వారా ఈ వ్యవస్థ పనిచేస్తుంది. పెద్ద వంట గదిలోకి అడుగు పెట్టేవారికి గ్యాస్ స్టవ్‌ల నుండి వచ్చే వేడి ఎంత ఉంటుందో తెలుసు. ముఖ్యంగా వేసవిలో ఆ వేడి మరింత తీవ్రంగా ఉంటుంది. అయితే ఈ మంట రహిత వంట గదిలో అధిక వేడితో ఇబ్బంది పడడం అనేది ఉండదు.బయోగ్యాస్ బాటలో...వంటగది వ్యర్థాలు... ఆవు పేడతో తయారయ్యే ఇంధన అద్భుతం... బయోగ్యాస్. తాజా ఎల్పీజీ సంక్షోభం నేపథ్యంలో బయోగ్యాస్ మళ్లీ తెర మీదికి వచ్చింది. బయోగ్యాస్ అనేది మీథేన్, కార్బన్ డయాక్సైడ్ల మిశ్రమం. ఆక్సిజన్ లేని వాతావరణంలో సేంద్రియ పదార్థాన్ని విచ్ఛిన్నం చేసినప్పుడు ఉత్పత్తి అవుతుంది. బయోగ్యాస్‌ను వంట కోసమే కాకుండా లైట్లు, జనరేటర్లకు కూడా ఉపయోగించవచ్చు. గృహ అవసరాలు, బడ్జెట్‌ను బట్టి తమకు అనుకూలమైన బయోగ్యాస్ ప్లాంట్లను నిర్మించుకోవచ్చు. వాటిలో కొన్ని... 1. ఫిక్స్డ్ డోమ్ డైజెస్టర్: ఫిక్స్డ్ గ్యాస్ స్పేస్‌తో నిర్మించే అండర్‌గ్రౌండ్ చాంబర్. ∙మెయింటెనెన్స్‌కు తక్కువ శ్రమతో మెయింటెనెన్స్ ∙లీక్–ప్రూఫ్ కోసం నిపుణుల సలహాలు తీసుకోవాలి.2. ఫ్లోటింగ్ డ్రమ్ డైజెస్టర్: గ్యాస్ వాల్యూమ్‌తో కదిలే ఫ్లోటింగ్ గ్యాస్ హోల్డర్ ∙పర్యవేక్షించడం సులభం, తక్కువ శ్రమ.3. ఫ్లెక్సీ–బ్యాగ్/ ప్లాస్టిక్ డైజెస్టర్: పీవీసీ టార్పాలిన్‌తో తయారు చేస్తారు కాబట్టి కొత్తగా ప్రారంభించే వారికి, అద్దె ఇంటిలో నివసించేవారికి అనుకూలమైనది.లైఫ్ స్పాన్: 1. íఫిక్స్డ్ డోమ్ డైజెస్టర్: 15–20 సంవత్సరాలు 2. ఫ్లోటింగ్ డ్రమ్ డైజెస్టర్: 8–10 సంవత్సరాలు...‘శతకోటి దరిద్రాలకు అనంతకోటి ఉ పాయాలు’ అన్నట్లు వంటగ్యాస్ ఎంత భయపెడితే మాత్రం ఏం? దాని నుంచి బయటపడడానికి, పర్యావరణ అనుకూల ఇంధన వనరులను అన్వేషించడానికి బోలెడు ఉ పాయాలు. మీదే ఆలస్యం!ఆదా–ఆదాయం⇒ గ్రామీణ ప్రాంతాలలోనే కాదు, సేంద్రియ వంటగది వ్యర్థాలు సులభంగా అందుబాటులో ఉండే పట్టణ ప్రాంతాలలో కూడా బయోగ్యాస్ ప్లాంట్ సమర్థంగా పనిచేస్తుంది⇒ బయోగ్యాస్ ద్వారా డబ్బు ఆదా చేసుకోవచ్చు, ఆదాయం పొందవచ్చు. బయోగ్యాస్ ప్లాంట్ నుండి వచ్చే ‘లిక్విడ్ స్లర్రీ’ సేంద్రియ ఎరువుగా పనికొస్తుంది.⇒ ప్రస్తుతం దేశీయ బయోగ్యాస్ మార్కెట్ 20 శాతానికి పైగా వార్షిక వృద్ధితో దూసుకుపోతోంది⇒ కేంద్రప్రభుత్వం జాతీయ జీవశక్తి కార్యక్రమం కింద గృహ బయోగ్యాస్ ప్లాంట్లకు ఆర్థిక సహాయం అందిస్తోంది. -
గ్యాస్ కష్టాలు.. ఆఫీసుకు రాకండి!
దేశంలో గ్యాస్ కొరత మొదలైపోయింది. దీని ప్రభావం సాధారణ ప్రజలపై మాత్రమే కాకుండా.. టెక్ కంపెనీలపై కూడా పడింది. దీంతో ఉద్యోగులకు మళ్లీ వర్క్ ఫ్రమ్ హోమ్ సదుపాయం కల్పించారు. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు ఈ కథనంలో వివరంగా తెలుసుకుందాం.హెచ్‌సీఎల్ కంపెనీ మార్చి 12,13 తేదీలలో చెన్నై కార్యాలయంలోని తన ఉద్యోగులకు వర్క్ ఫ్రమ్ హోమ్ సదుపాయం కల్పించింది. క్యాంటిన్లలో ఆహారం వండటానికి గ్యాస్ అందుబాటులో లేకపోవడం వల్ల ఉద్యోగులకు ఇబ్బంది కలగకుండా సంస్థ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.ఇదే సమస్య ఇన్ఫోసిస్ కంపెనీలో కూడా తలెత్తింది. దీంతో బెంగళూరు, చెన్నైలలోని ఆఫీసుల్లో క్యాఫెటీరియా సేవలను పరిమితం చేశారు. వంటగ్యాస్ కొరత కారణంగా క్యాఫెటీరియాల్లో మెనూ ఐటెమ్స్ తగ్గించారు. లైవ్ ఫుడ్ కౌంటర్లను కూడా తాత్కాలికంగా నిలిపివేశారు. ఉద్యోగులు వీలైతే ఇంటి నుంచి తీసుకువచ్చిన ఆహారాన్ని తినాలని సంస్థ సూచించింది.అమెరికా, ఇజ్రాయెల్ దేశాలు ఇరాన్ మీద దాడులు ప్రారంభించిన తర్వాత ఆ ప్రాంతంలో పరిస్థితులు ఉద్రిక్తంగా మారాయి. దీనివల్ల ఇంధన సరఫరా వ్యవస్థపై ప్రభావం పడింది. ఫలితంగా వంటగ్యాస్ ధరలు కూడా పెరిగాయి. ఇప్పటికే గ్యాస్ కొరత కారణంగా నగరాల్లోని అనేక రెస్టారెంట్లు తమ కార్యకలాపాలను తాత్కాలికంగా నిలిపివేయాల్సి వచ్చింది. -
గ్యాస్ సంక్షోభం
రాష్ట్రంలో గ్యాస్ సంక్షోభం నెలకొనే అవకాశాలు కన్పిస్తున్నాయి. సిలిండర్ల కొరత వినియోగదారుల్లో ఆందోళన రేకెత్తిస్తోంది. పార్లమెంట్ బడ్జెట్‌ను దృష్టిలో ఉంచుకునే కృతిమ కొరతను సృష్టిస్తున్నారన్న ప్రచారం సాగుతోంది. అయితే, కొత్త సిలిండర్ల కారణంగా తాత్కాలికంగా ఈ సంక్షోభం బయలు దేరిందని ఐవోసీ వర్గాలు పేర్కొంటున్నాయి. సాక్షి, చెన్నై: రాష్ట్రంలో కొన్ని నెలలుగా బుక్ చేసిన రెండు, మూడు రోజుల్లో గ్యాస్ సిలిండర్లు వినియోగదారులకు సరఫరా అవుతున్నారుు. గ్యాస్‌కు ఆధార్ కార్డును లింక్ పెట్టి, నగదు బదిలీ పథ కం అమల్లోకి రావడంతో త్వరితగతిన సిలిండర్లు వినియోగదారుల ముగింట వాలాయి. అలాగే, గ్యాస్ సిలిండర్లు సకాలంలో వినియోగదారులకు చేరని పక్షంలో డీలర్ల నడ్డి విరిగేది. అయితే, ఆ విధానం కాస్త కొత్త ప్రభుత్వం రాకతో మరుగున పడింది. ధరల తగ్గింపు నినాదంతో కేంద్రంలో కొత్తగా పగ్గాలు చేపట్టిన ప్రభుత్వం ప్రజల నడ్డి విరిచేందుకు సిద్ధం అయింది. ఇప్పటికే రైలు చార్జీల్ని వడ్డించింది. పెట్రోల్, డీజిల్ మోత ప్రజల నెత్తిన వేసింది. ఇక, గ్యాస్ భారం వేయడానికి రెడీ అవుతున్నారు. దీంతో రాష్ట్రంలో గ్యాస్ సంక్షోభం మొదలైంది. పార్లమెంట్ బడ్జెట్ దాఖలులో గ్యాస్ ధర పెంపు ప్రకటన వెలువడే అవకాశాలు ఉండడంతో కృత్రిమ కొరత సృష్టించే పనిలో డీలర్లు పడ్డారు. అదే సమయంలో చమురు సంస్థలు డిమాండ్‌కు తగ్గట్టుగా సిలిండర్లను సరఫరా చేయడం లేదన్న ఆరోపణలు డీలర్ల వైపు నుంచి వస్తున్నాయి. ఎదురుచూపులు: పది రోజులుగా రాజధాని నగరంలో సిలిండర్ల కొరత నెలకొంది. ఇది వరకు బుక్ చేసిన రెండు మూడు రోజుల్లో వచ్చే సిలిండర్లు ప్రస్తుతం పది రోజులైనా రాక పోవడంతో వినియోగదారుల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. సిలిండర్ ఎప్పుడొస్తుందని డీలర్లకు ఫోన్లు చేయలేని పరిస్థితి. ఇందుకు కారణం సిలిండర్ల బుకింగ్‌కు ప్రత్యేక ఎస్ఎంఎస్ విధానం అమల్లో ఉండటమే. దీంతో సిలిండర్లు ఎప్పుడెప్పుడు వస్తాయా? అని ఎదురు చూడాల్సిన పరిస్థితి. కొన్ని చోట్ల గత నెల బుక్ చేసిన సిలిండర్లు ఇంకా రాలేదంటూ వినియోగ దారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఆందోళన బాట: కృత్రిమ కొరత సృష్టిస్తున్నారంటూ ఓ వైపు ప్రచారం సాగుతుంటే, మరో వైపు మీంజూర్‌లో ఐవోసీ గ్యాస్ ఫిల్లింగ్ కేంద్రంలో సిబ్బంది ఆం దోళనబాట పట్టడంతో ఫిల్లింగ్‌కు ఆటం కం ఏర్పడి ఉంది. సిబ్బంది తమ ఆందోళనను ఉధృతం చేసినదృష్ట్యా, బుధవారం నుంచి పూర్తిగా ఆ కేంద్రంలో గ్యాస్ ఫిల్లింగ్ ఆగినట్లు సంకేతాలు వెలువడుతున్నాయి. ఇక్కడ ఫిల్లింగ్ సిలిండర్ల సంఖ్యను సైతం తగ్గించడం బట్టి చూస్తే, ధర పెరగనుండడాన్ని పరిగణనలోకి తీసుకుని సంక్షోభాన్ని సృష్టిస్తున్నట్టుగా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అయితే, ఐవోసీ అధికారులు దీన్ని ఖండిస్తున్నారు. ఇక్కడి నుంచి రోజుకు 120 లోడ్లు డీలర్లకు సరఫరా అవుతున్నాయని వివరిస్తున్నారు. అయితే, పదేళ్ల పాటు వినియోగంలో ఉన్న సిలిండర్లను వెనక్కు పంపించి, వాటి స్థానంలో కొత్త సిలిండర్లను తెప్పిస్తున్నామని పేర్కొంటున్నారు. కొత్త సిలిండర్ల రాకలో జాప్యం నెలకొన్నందున, ఇక్కడ కాంట్రాక్టు సిబ్బందిని కుదించినట్లు వివరించారు. ప్రస్తుతం 60 లోడ్ల మేరకు సిలిండర్ల ఫిల్లింగ్ మాత్రం చేయాల్సి ఉందని, దీన్ని అర్థం చేసుకోని సిబ్బంది ఆందోళన బాట పట్టారని చెబుతున్నారు. వీరి ఆందోళన కారణంగా ఫిల్లింగ్‌కు ఆటంకం ఏర్పడిందని, మరో రెండు మూడు రోజుల్లో కొత్త సిలిండర్లు రాగానే, సిలిండర్ల కొరత సమసి పోవడం ఖాయం అని స్పష్టం చేస్తున్నారు. అంతలోపు సిలిండర్ల ధర పెరిగిన పక్షంలో చమురు సంస్థలకు లాభం, వినియోగ దారుడి నెత్తిన భారం ఖాయం.


