Gas stoves
-
పిల్లల పాలిట శాపంగా మారిన గ్యాస్ స్టవ్‌లు.. బైడెన్ సర్కార్ కీలక నిర్ణయం?
సాక్షి, న్యూఢిల్లీ: ప్రజారోగ్యం దృష్ట్యా గ్యాస్ స్టవ్‌ల వినియోగంపై బైడెన్ సర్కార్ కీలక నిర్ణయం తీసుకునే సూచనలు కనిపిస్తున్నాయి. గ్యాస్ స్టవ్‌ల నుంచి వెలువడే కాలుష్య కారకాలతో తీవ్రమైన ఆరోగ్య సమస్యలు తలెత్తుతున్నాయని కొన్ని నివేదికలు చెప్తున్న నేపథ్యంలో ఈ మేరకు ప్రభుత్వం వాటిపై నిషేధానికి సమాలోచనలు జరుపుతున్నట్టు తెలిసింది. దేశవ్యాప్తంగా 40 శాతానికిపైగా వీటిని వినియోగిస్తున్నారు. మిగతావారు విద్యుత్ పరికరాలు వాడుతున్నారు. (చదవండి: Video: బోరుబావిలో పడ్డ నాలుగేళ్ల చిన్నారి.. 5 గంటలు శ్రమించి..) గ్యాస్ స్టవ్‌లు వినియోగించినప్పుడు ప్రమాదకర నైట్రోజన్ డైఆక్సైడ్, కార్బన్ మోనాక్సైడ్, పార్టికల్స్ విడుదలవుతున్నాయని కొన్ని పరిశోధనల్లో వెల్లడైందని బ్లూమ్‌బర్గ్ పేర్కొంది. ఇవి శ్వాసకోశ, గుండె సంబంధిత వ్యాధులు, కాన్సర్లను కలిగిస్తాయని తెలిపింది. చిన్నపిల్లల ఆస్తమా కేసుల్లో దాదాపు 12 శాతం గ్యాస్ స్టవ్‌ల వాటా ఉందని పేర్కొంది. ఈ మేరకు ప్రపంచ ఆరోగ్య సంస్థ కూడా హెచ్చరికలు చేసింది. గ్యాస్ స్టవ్‌ను ఆఫ్ చేసినప్పటికీ వెలువడే మీథేన్ లీకేజీలు పర్యావరణానికి కీడు చేస్తాయని ఇప్పటివరకు పలు నివేదికలు వెల్లడించగా తాజాగా వాటి వినియోగం ఆరోగ్యాన్ని తీవ్రంగా దెబ్బతీస్తుందని తెలియడం గమనార్హం. దేశవ్యాప్తంగా గ్యాస్ స్టవ్‌ల వినియోగంపై అమెరికా ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకునే అవకాశాలున్నాయి. (చదవండి: స్కూళ్లు, కాలేజీల్లో అమ్మాయిలపై నిషేధంపై తాలిబన్ల కీలక ప్రకటన) -
గ్యాస్ వినియోగంలో జర జాగ్రత్త!
కట్టెల పొయ్యిలు క్రమేపీ కనుమరుగయ్యాయి. ఇప్పుడు దాదాపు ప్రతి ఇంటాగ్యాస్ స్టౌలే ఉన్నాయి. గ్రామీణ ప్రాంతాల్లోని మహిళలు కూడా గ్యాస్ స్టౌలనేఎక్కువగా వినియోగిస్తున్నారు. ప్రభుత్వం ఆ దిశగా ప్రోత్సహిస్తోంది. అయితే గ్యాస్ స్టౌల వినియోగంపై మాత్రం వినియోగదారులకు సరైన అవగాహన ఉండడం లేదు. దీంతో తరచూ అనేక ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి. గ్యాస్ స్టౌల వినియోగంలో జర జాగ్రత్తగా ఉండకపోతే పెను ప్రమాదాలు సంభవించే అవకాశాలూ ఉన్నాయి. దీనిపై గ్యాస్ కంపెనీలు అవగాహన కార్యక్రమాలు అరకొరగానే నిర్వహిస్తున్నాయి. ప్రస్తుతం వేసవిలోకి ప్రవేశించడంతో ఎండలు మండుతున్నాయి. ఈ సమయంలోగ్యాస్ స్టౌల వినియోగంలో జరజాగ్రత్తగా ఉండాలని నిపుణులు సూచిస్తున్నారు. పశ్చిమగోదావరి, ఏలూరు (వన్‌టౌన్) : ఇళ్లలో వాడే ఎల్పీజీని ఏ మాత్రం నిర్లక్ష్యం చేసినా ప్రాణాపాయాన్ని కొనితెచ్చుకున్నట్లేనని నిపుణులు హెచ్చరిస్తున్నారు. సిలిండర్ ఆఫ్ చేయకుండా వెళ్లినా గ్యాస్‌లో ఏదైనా ఇబ్బందులు తలెత్తినా సకాలంలో గుర్తించకపోతే క్షణాల్లో గ్యాస్ గది నిండా వ్యాపించి మంటలు చెలరేగే ప్రమాదం ఉంది. జిల్లాలోని పలు గ్రామాల్లో, పట్టణాల్లో ప్రధాన వీధులన్నీ ఒకదానికి ఒకటి అనుకుని ఉండటంతో గ్యాస్ ప్రమాదాలు జరిగినప్పుడు భారీ నష్టం సంభవించే అవకాశం ఉందని పలువురు హెచ్చరిస్తున్నారు. భద్రత లేని హోటళ్లు జిల్లాలోని పలు పట్టణాల్లో, గ్రామాల్లో, హోటళ్లు, ఇరుకు గదుల్లోనే ఏ మాత్రం భద్రతా ప్రమాణాలు పాటించకుండా నిర్వహిస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో గ్యాస్ లీకైనా, సిలిండర్ పేలినా పెను ప్రమాదం సంభవించే అవకాశం ఉంటుంది. దీంతో జనం ప్రాణాలు కోల్పోయే ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు గ్యాస్ వాసన వస్తే.. ♦ గ్యాస్ వాసన వచ్చినట్లు అనిపిస్తే తక్షణమే రెగ్యులేటర్‌ను ఆఫ్ చేయాలి. ♦ మొదట ఇంట్లోకి గాలి వచ్చే విధంగా కిటికీలు, తలుపులు తెరవాలి ♦ అగర్బత్తీలు, దీపాలతో సహా నిప్పులేకుండా చూడాలి ♦ గ్యాస్ లీకైతే రెగ్యులేటర్‌ను సిలిండర్‌తో వేరు చేసి, సిలిండర్‌కు సేఫ్టీ కప్‌ను బిగించాలి. ♦ దగ్గరలోని ఎల్పీజీ డీలర్ అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించాలి ♦ వంట గదిలో తగినంత గాలి, వెలుతురు వచ్చేలా కిటికీల ఏర్పాటు, ముఖ్యంగా గ్యాస్‌తో పాటు కిరోసిన్, ఇతర మండే స్వభావం గల పదార్థాలు ఉంచరాదు. ♦ వంట చేసేటప్పుడు వేడివేడి ఆహార పదార్థాలు, స్టవ్ క్యూబ్ మీద పడకుండా చూసుకోవాలి. ♦ స్టవ్ పైభాగంలో అలమారాలు ఉండరాదు. ♦ సిలిండర్ల వద్దకు పిల్లలు రాకుండా జాగ్రత్త పడాలి. ♦ వంట పూర్తి చేసేంత వరకు ఒక కంట కనిపెడుతూనే ఉండాలి. ప్రమాదాల నివారణ ఇలా.. ♦ సిలిండర్‌ను ఎప్పుడూ నిలువుగానే ఉంచాలి. పడుకోబెట్టడం పక్కకు వంచి వంట చేయడం లాంటివి చేయరాదు. ♦ వంట పూర్తయిన వెంటనే రెగ్యులేటర్ ఆఫ్ చేయాలి ♦ వంట చేయని సమయంలో సిలిండర్‌కు ప్లాస్టిక్ మూతను బిగించాలి. ♦ సిలిండర్ కన్నా స్టవ్ ఎత్తులో ఉండేటట్టు జాగ్రత్త తీసుకోవాలి. ♦ నాణ్యమైన బ్రాండెడ్ స్టవ్‌లను వినియోగించాలి. ♦ డీలర్లు సిఫార్సు చేసిన ట్యూబ్‌లను రెగ్యులేటర్లనే వినియోగించాలి. -
భలే హోటల్
చింతామణి: కొలిమిపొయ్యి, బొగ్గుల పొయ్యి, కట్టెలపొయ్యి, పొట్టు పొయ్యి... ఇలాంటివి వినడమే తప్ప నేటి తరం చూడడం లేదు. కరెంటు, గ్యాస్, ఇండక్షన్ స్టౌలు వచ్చాక వీటికి కాలం చెల్లిపోయింది. కట్టెలపొయ్యి మీద చేసిన వంట రుచి అద్భుతం, అలాంటి రుచి గ్యాస్ పొయ్యి వంటకు రాదు.. అని పెద్దలు, పల్లెవాసులు చెబుతుంటారు. విషయమేమిటంటే... కొలిమి పొయ్యి మీద కాఫీ, టీ తాగాలనే కోరిక ఉన్నవారికి ఇది శుభవార్త. చింతామణి సమీపంలో ఇలాంటి సౌలభ్యం అందుబాటులో ఉంది. మాజీ డ్రైవర్ ఒకాయన రోడ్డు పక్కన టెంటు వేసుకొని కొలిమి పెట్టి బొగ్గులతో కాఫీ, టీ, టిఫిన్ హోటల్ నడుపుతున్నారు. తాలుకాలోని శింగనపల్లి క్రాస్ దగ్గర ఈ టెంట్ ఉంది. రుచి, ఆరోగ్యమని మంచి స్పందన శింగనపల్లి గ్రామానికి చెందిన రాఘవేంద్ర పేద బ్రాహ్మణ కుటుంబానికి చెందినవారు. చాలా ఏళ్ల పాటు వ్యాన్, లారీ డ్రైవర్‌గా పనిచేశారు. అయితే కొన్ని నెలల నుండి డ్రైవర్ డ్యూటీలు దొరక్క, జీవనోపాధి కోస రోడ్డు పక్కన టిఫిన్ సెంటర్‌ను పెట్టారు. రాఘవేంద్ర వినూత్నంగా ఆలోచించి బొగ్గులతో కొలిమి పెట్టి కాఫీ, టీలతో పాటు ఇడ్లీ, దోసె తదితర టిఫిన్లు తయారు చేస్తారు. ఇలాంటి వంట రుచిగాను, ఆరోగ్యంగానూ ఉంటుందని ఎంతోమంది ఈ హోటల్‌ను సందర్శిస్తుంటారు. రాఘవేంద్రకు తోడుగా భార్య విజయలక్ష్మీ ఉంటారు. హోటల్ వ్యాపారం బాగా జరుగుతోందని వారు సంతోషం వ్యక్తంచేశారు. -
'ప్రతి ఇంటికి గ్యాస్ స్టవ్‌లు అందిస్తాం'
జైపూర్ (ఆదిలాబాద్ జిల్లా) : ప్రతీ ఇంటికి గ్యాస్ కనెక్షన్లు అందిస్తామని తెలంగాణ రాష్ట్ర అటవీ శాఖ మంత్రి జోగు రామన్న అన్నారు. సోమవారం ఆదిలాబాద్ జిల్లాలోని జైపూర్ మండలంలో దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి, ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్యతో కలిసి ఆయన దీపం పథకాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గతంలో ఎన్నడూ లేని విధంగా ప్రతి నియోజకవర్గానికి 5 వేల గ్యాస్ కనెక్షన్లు అందిస్తామని పేర్కొన్నారు. అనంతరం లబ్ధిదారులకు గ్యాస్ స్టవ్‌లు పంపిణీ చేశారు.