ప్రతీకాత్మక చిత్రం
కట్టెల పొయ్యిలు క్రమేపీ కనుమరుగయ్యాయి. ఇప్పుడు దాదాపు ప్రతి ఇంటాగ్యాస్ స్టౌలే ఉన్నాయి. గ్రామీణ ప్రాంతాల్లోని మహిళలు కూడా గ్యాస్ స్టౌలనేఎక్కువగా వినియోగిస్తున్నారు. ప్రభుత్వం ఆ దిశగా ప్రోత్సహిస్తోంది. అయితే గ్యాస్ స్టౌల వినియోగంపై మాత్రం వినియోగదారులకు సరైన అవగాహన ఉండడం లేదు. దీంతో తరచూ అనేక ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి. గ్యాస్ స్టౌల వినియోగంలో జర జాగ్రత్తగా ఉండకపోతే పెను ప్రమాదాలు సంభవించే అవకాశాలూ ఉన్నాయి. దీనిపై గ్యాస్ కంపెనీలు అవగాహన కార్యక్రమాలు అరకొరగానే నిర్వహిస్తున్నాయి. ప్రస్తుతం వేసవిలోకి ప్రవేశించడంతో ఎండలు మండుతున్నాయి. ఈ సమయంలోగ్యాస్ స్టౌల వినియోగంలో జరజాగ్రత్తగా ఉండాలని నిపుణులు సూచిస్తున్నారు.
పశ్చిమగోదావరి, ఏలూరు (వన్‌టౌన్) : ఇళ్లలో వాడే ఎల్‌పీజీని ఏ మాత్రం నిర్లక్ష్యం చేసినా ప్రాణాపాయాన్ని కొనితెచ్చుకున్నట్లేనని నిపుణులు హెచ్చరిస్తున్నారు. సిలిండర్ ఆఫ్ చేయకుండా వెళ్లినా గ్యాస్‌లో ఏదైనా ఇబ్బందులు తలెత్తినా సకాలంలో గుర్తించకపోతే క్షణాల్లో గ్యాస్ గది నిండా వ్యాపించి మంటలు చెలరేగే ప్రమాదం ఉంది. జిల్లాలోని పలు గ్రామాల్లో, పట్టణాల్లో ప్రధాన వీధులన్నీ ఒకదానికి ఒకటి అనుకుని ఉండటంతో గ్యాస్ ప్రమాదాలు జరిగినప్పుడు భారీ నష్టం సంభవించే అవకాశం ఉందని పలువురు హెచ్చరిస్తున్నారు.
భద్రత లేని హోటళ్లు
జిల్లాలోని పలు పట్టణాల్లో, గ్రామాల్లో, హోటళ్లు, ఇరుకు గదుల్లోనే ఏ మాత్రం భద్రతా ప్రమాణాలు పాటించకుండా నిర్వహిస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో గ్యాస్ లీకైనా, సిలిండర్ పేలినా పెను ప్రమాదం సంభవించే అవకాశం ఉంటుంది. దీంతో జనం ప్రాణాలు కోల్పోయే ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు
గ్యాస్ వాసన వస్తే..
♦ గ్యాస్ వాసన వచ్చినట్లు అనిపిస్తే తక్షణమే రెగ్యులేటర్‌ను ఆఫ్ చేయాలి.
♦ మొదట ఇంట్లోకి గాలి వచ్చే విధంగా కిటికీలు, తలుపులు తెరవాలి
♦ అగర్‌బత్తీలు, దీపాలతో సహా నిప్పులేకుండా చూడాలి
♦ గ్యాస్ లీకైతే రెగ్యులేటర్‌ను సిలిండర్‌తో వేరు చేసి, సిలిండర్‌కు సేఫ్టీ కప్‌ను బిగించాలి.
♦ దగ్గరలోని ఎల్‌పీజీ డీలర్ అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించాలి
♦ వంట గదిలో తగినంత గాలి, వెలుతురు వచ్చేలా కిటికీల ఏర్పాటు, ముఖ్యంగా గ్యాస్‌తో పాటు కిరోసిన్, ఇతర మండే స్వభావం గల పదార్థాలు ఉంచరాదు.
♦ వంట చేసేటప్పుడు వేడివేడి ఆహార పదార్థాలు, స్టవ్ క్యూబ్ మీద పడకుండా చూసుకోవాలి.
♦ స్టవ్ పైభాగంలో అలమారాలు ఉండరాదు.
♦ సిలిండర్ల వద్దకు పిల్లలు రాకుండా జాగ్రత్త పడాలి.
♦ వంట పూర్తి చేసేంత వరకు ఒక కంట కనిపెడుతూనే ఉండాలి.
ప్రమాదాల నివారణ ఇలా..
♦ సిలిండర్‌ను ఎప్పుడూ నిలువుగానే ఉంచాలి. పడుకోబెట్టడం పక్కకు వంచి వంట చేయడం లాంటివి చేయరాదు.
♦ వంట పూర్తయిన వెంటనే రెగ్యులేటర్ ఆఫ్ చేయాలి
♦ వంట చేయని సమయంలో సిలిండర్‌కు ప్లాస్టిక్ మూతను బిగించాలి.
♦ సిలిండర్ కన్నా స్టవ్ ఎత్తులో ఉండేటట్టు జాగ్రత్త తీసుకోవాలి.
♦ నాణ్యమైన బ్రాండెడ్ స్టవ్‌లను వినియోగించాలి.
♦ డీలర్లు సిఫార్సు చేసిన ట్యూబ్‌లను రెగ్యులేటర్లనే వినియోగించాలి.
Comments
Please login to add a commentAdd a comment