Gashimov Memorial Super Grandmasters Chess Tournament
-
ఆనంద్ గేమ్ డ్రా
షంకిర్ (అజర్బైజాన్): భారత దిగ్గజ గ్రాండ్‌మాస్టర్ విశ్వనాథన్ ఆనంద్‌కు మళ్లీ ‘డ్రా’ ఫలితమే ఎదురైంది. వుగర్ గషిమోవ్ మెమోరియల్ చెస్ టోర్నమెంట్లో సోమవారం తైముర్ రద్జబొవ్ (అజర్బైజాన్)తో జరిగిన ఎనిమిదో రౌండ్ గేమ్‌ను ఆనంద్ డ్రా చేసుకున్నాడు. నల్లపావులతో బరిలోకి దిగిన భారత ఆటగాడు గెలుపుకోసం చేసిన ఎత్తులేవీ ఫలించలేదు. దీంతో 33 ఎత్తుల వరకు సాగిన ఈ గేమ్ చివరకు డ్రాగా ముగిసింది. తాజా ఫలితంతో ఆనంద్ 4 పాయింట్లతో తైముర్తో పాటు ఉమ్మడిగా నాలుగో స్థానంలో కొనసాగుతున్నాడు. నార్వే సూపర్ గ్రాండ్‌మాస్టర్ మాగ్నస్ కార్ల్సన్ టైటిల్ వేటలో మళ్లీ విజయవంతమయ్యాడు. సెర్గీ కర్యాకిన్ (రష్యా 4.5)తో జరిగిన గేమ్‌లో గెలుపొందిన కార్ల్సన్ 6 పాయింట్లతో ఒక్కడే అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు. గ్రిస్చుక్ (రష్యా; 4.5)... డేవిడ్ నవర (చెక్ రిపబ్లిక్; 3.5)పై నెగ్గగా, అనిశ్ గిరి (నెదర్లాండ్స్; 2.5)... షకిరియార్ (అజర్బైజాన్; 3)తో జరిగిన గేమ్‌ను డ్రా చేసుకున్నాడు. -
హరికృష్ణ ఓటమి
షామ్‌కిర్ (అజర్బైజాన్): గషిమోవ్ స్మారక సూపర్ గ్రాండ్‌మాస్టర్స్ చెస్ టోర్నమెంట్లో భారత గ్రాండ్‌మాస్టర్ పెంటేల హరికృష్ణ తొలి పరాజయాన్ని చవిచూశాడు. పావెల్ ఎల్జానోవ్ (ఉక్రెయిన్)తో శనివారం జరిగిన రెండో రౌండ్ గేమ్‌లో తెల్లపావులతో ఆడిన హరికృష్ణ 54 ఎత్తుల్లో ఓడిపోయాడు. పది మంది సూపర్ గ్రాండ్‌మాస్టర్ల మధ్య జరుగుతున్న ఈ టోర్నీలో రెండో రౌండ్ తర్వాత హరికృష్ణ అర పాయింట్‌తో 9వ స్థానంలో ఉన్నాడు. రన్నరప్ సెంథిల్ చెన్నై: దక్షిణాఫ్రికాలో ముగిసిన వెస్ట్ రాండ్ ఓపెన్ స్క్వాష్ టోర్నీలో భారత ప్లేయర్ సెంథిల్ కుమార్ రన్నరప్‌గా నిలిచాడు. ఫైనల్లో సెంథిల్ 8–11, 3–11, 8–11తో ఎల్షిర్బిని (ఈజిప్ట్) చేతిలో ఓడిపోయాడు. గతవారం సెంథిల్ పార్క్‌వ్యూ ఓపెన్ ఫైనల్లోనూ ఎల్షిర్బిని చేతిలోనే ఖంగుతిన్నాడు.