Gateway Hotel
-
గంటాతో ప్రైవేట్ కాలేజీల నిర్వాహకులు భేటీ
విజయవాడ : ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖ మంత్రి గంటా శ్రీనివాసరావుతో రాష్ట్రంలోని ఇంటర్ ప్రైవేట్ కాలేజీల నిర్వాహకులు మంగళవారం హోటల్ గేట్వేలో భేటీ అయ్యారు. ఇంటర్ ప్రాక్టికల్ పరీక్షల్లో జంబ్లింగ్ విధానాన్ని రద్దు చేయాలని వారు ఈ సందర్భంగా గంటాను కోరారు. ఈ అంశంపై ముఖ్యమంత్రి చంద్రబాబుతో చర్చించి... ఓ నిర్ణయం తీసుకుంటామని ఈ సందర్భంగా ఇంటర్ ప్రైవేట్ కాలేజీ నిర్వాహకులకు గంటా హామీ ఇచ్చారు. జంబ్లింగ్ విధానాన్ని అమలు చేస్తామని మంత్రి గంటా శ్రీనివాసరావు ఇటీవలే ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే ఈ విధానం వద్దని కార్పొరేట్ కాలేజీల నిర్వాహకులు గత కొంత కాలంగా ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తున్నారు. దీంతో ఇంటర్ జంబ్లింగ్ విధానంపై ఏపీ ప్రభుత్వం పునరాలోచనలో పడింది. కార్పొరేట్ కాలేజీల ఒత్తిడితోనే జంబ్లింగ్ను గంటా పెండింగ్లో పెట్టినట్లు సమాచారం. ఆ క్రమంలో ఈ అంశంపై ప్రభుత్వం త్వరలో ఓ నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. -
కలెక్టర్ల సదస్సు రెండో రోజు
విజయవాడలోని గేట్ వే హోటల్ లో రెండో రోజు కలెక్టర్ల సదస్సు ప్రారంభమైంది. జిల్లాల వారీగా ప్రభుత్వ పథకాల అమలు, అభివృద్దిపై కలెక్టర్లు, ఇన్ ఛార్జి మంత్రులు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. అనంతరం జిల్లాల్లో పరిశ్రమల ఏర్పాటు, అనుకూలతలు అంశంపై ముఖ్యమంత్రితో చర్చించనున్నారు. -
విజయవాడలోని ఓ హోటల్లో బాబుగారి డాబు