గంటాతో ప్రైవేట్ కాలేజీల నిర్వాహకులు భేటీ | private colleges owners meeting with Ganta Srinivasa rao in gateway hotel | Sakshi
Sakshi News home page

గంటాతో ప్రైవేట్ కాలేజీల నిర్వాహకులు భేటీ

Published Tue, Jan 26 2016 1:22 PM | Last Updated on Sat, Mar 23 2019 8:59 PM

private colleges owners meeting with Ganta Srinivasa rao in gateway hotel

విజయవాడ : ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖ మంత్రి గంటా శ్రీనివాసరావుతో రాష్ట్రంలోని ఇంటర్ ప్రైవేట్ కాలేజీల నిర్వాహకులు మంగళవారం హోటల్ గేట్వేలో భేటీ అయ్యారు. ఇంటర్ ప్రాక్టికల్ పరీక్షల్లో జంబ్లింగ్ విధానాన్ని రద్దు చేయాలని వారు ఈ సందర్భంగా గంటాను కోరారు. ఈ అంశంపై ముఖ్యమంత్రి చంద్రబాబుతో చర్చించి... ఓ నిర్ణయం తీసుకుంటామని ఈ సందర్భంగా ఇంటర్ ప్రైవేట్ కాలేజీ నిర్వాహకులకు గంటా హామీ ఇచ్చారు.

జంబ్లింగ్ విధానాన్ని అమలు చేస్తామని మంత్రి గంటా శ్రీనివాసరావు ఇటీవలే ప్రకటించిన సంగతి తెలిసిందే.  అయితే ఈ విధానం వద్దని కార్పొరేట్ కాలేజీల నిర్వాహకులు గత కొంత కాలంగా ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తున్నారు. దీంతో ఇంటర్ జంబ్లింగ్ విధానంపై ఏపీ ప్రభుత్వం పునరాలోచనలో పడింది. కార్పొరేట్ కాలేజీల ఒత్తిడితోనే జంబ్లింగ్ను గంటా పెండింగ్లో పెట్టినట్లు సమాచారం. ఆ క్రమంలో ఈ అంశంపై ప్రభుత్వం త్వరలో ఓ నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement