Gautama buddha statue
-
హుస్సేన్ సాగర్‌లోని బుద్ధ విగ్రహం వద్ద ఘనంగా బుద్ధ పూర్ణిమ ఉత్సవాలు (ఫొటోలు)
-
పాలమూరులో 13వ శతాబ్దం నాటి బుద్ధుడి విగ్రహం
సాక్షి, హైదరాబాద్: బుద్ధుడు బతికుండగానే ఆయన స్ఫూర్తి తెలంగాణలో అడుగిడింది. ఆయన బోధనల ప్రచారం మొదలై ఇక్కడి నుంచి కొన్ని ఆగ్నేయాసియా దేశాలకు విస్తరించింది. శాతవాహనుల కాలం నుంచి తెలంగాణ వ్యాప్తంగా బౌద్ధం విలసిల్లింది. ఎన్నో అద్భుత నిర్మాణాలు, మందిరాలు రూపుదిద్దుకున్నాయి. కాకతీయుల కాలంలో కూడా కొన్ని ప్రాంతాల్లో బుద్ధుడి విగ్రహాలు కొలువుదీరాయి. అందుకే తెలంగాణవ్యాప్తంగా చాలా ప్రాం తాల్లో బుద్ధుడి ప్రతిమలు, శిల్పాలు వెలుగుచూస్తూ ఉంటాయి. అయితే ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలో మాత్రం బుద్ధుడి విగ్రహాలు ఇంతవరకు బయటపడలేదు. చరిత్రకారుల అన్వేషణలోనూ బుద్ధుడి జాడలేదు. కానీ, ఇంతకాలం తర్వాత తొలి సారి ఉమ్మడి పాలమూరులో 4 అడుగుల మూడం గుళాల ఎత్తున్న బుద్ధుడి శిల్పం వెలుగుచూసింది. ఇది తవ్వకాల్లో బయటపడింది కాదు.. ఓ పల్లెటూర్లోని చిన్న ఆలయంలో దేవతామూర్తిగా పూజలందుకుంటోంది. దీంతో మహబూబ్‌నగర్ జిల్లాలో తొలిసారి బుద్ధుడి శిల్పం రికార్డుల్లో నమోదైనట్టయింది. మశమ్మ ఆలయంలో నిలువెల్లా బొట్లతో.. చాలా ఊళ్లలో గ్రామ దేవతగా భావిస్తూ ఎన్నో విగ్రహాలను పూజిస్తుంటారు. అందులో వీరగల్లులు కూడా ఉన్నాయి. కొన్ని ప్రాంతాల్లో వీరుల శిల్పాలు ఆంజనేయ స్వామి విగ్రహంగా పూజలందుకుంటుంటాయి. అదే కోవలో.. నాగర్‌కర్నూలు జిల్లాలోని తిమ్మాజిపేట గ్రామంలో స్థానికులు మశమ్మ విగ్రహానికి ఆలయం నిర్మించి పూజిస్తున్నారు. ఇందులో రెండు ప్రధాన విగ్రహాలున్నాయి. వీటికి నిలువెల్లా పసుపు, కుంకుమ బొట్లు పెట్టి పూజిస్తుంటారు. ఇటీవల స్థానికుడు శ్రీనివాస బహదూర్‌తో కలసి బుద్ధిస్ట్ సొసైటీ ఆఫ్ ఇండియా ప్రతినిధి తోకల సంజీవరెడ్డి వేరే పనిమీద వెళ్తూ ఆ దేవాలయాన్ని పరిశీలించారు. ఆయనకు అందులో మశమ్మ విగ్రహం పక్కనున్న మరో విగ్రహంపై అనుమానాలు కలిగాయి. ఈ విషయాన్ని పురావస్తు విశ్రాంత అధికారి, చరిత్ర పరిశోధకుడు, కల్చరల్ సెంటర్ ఆఫ్ విజయవాడ, అమరావతి సీఈఓ ఈమని శివనాగిరెడ్డి దృష్టికి తీసుకెళ్లారు. ఆయన మరో చరిత్ర పరిశోధకుడు ఎం.ఏ.శ్రీనివాసన్‌తో వచ్చి ఆ విగ్రహాన్ని పరిశీలించి అది బుద్ధుడి విగ్రహంగా తేల్చారు. 13వ శతాబ్దం నాటికి.. ఆ తర్వాత మార్పులు.. ఈ విగ్రహం ఎక్కడిదో, ఎవరు రూపొందించారో స్థానికులకు సమాచారం లేదు. ఎక్కడి నుంచో దాన్ని తెచ్చి ఆలయంలో ఉంచి దేవతామూర్తిగా పూజిస్తున్నారని శివనాగిరెడ్డి పేర్కొన్నారు. దీని ఆకృతిని బట్టి 13వ శతాబ్దిలో రూపొందించినట్లు గుర్తించారు. కానీ, మళ్లీ 18వ శతాబ్దంలో దాని రూపాన్ని కొంత మార్చినట్లు తేల్చారు. అంతగా అనుభవం లేని శిల్పి ఎవరో విగ్రహం మొహం, చేతులు, కాళ్ల భాగాల్లో మార్పులు చేసినట్లు తెలుస్తోందని వారు పేర్కొన్నారు. ధ్యానముద్రలో ఉన్న బుద్ధుడి శరీరంపై పలుచటి వస్త్రం ఉన్నట్టుగా చెక్కారని, కుడివైపున ఉపాసిక ప్రతిమను కూడా తీర్చిదిద్దారని తెలిపారు. మధ్యయుగంలో తిమ్మాజిపేట ప్రాంతం బౌద్ధస్థావరమని సమీపంలోనే అలనాటి వర్ధమానపురం ఉంటుందని చెప్పారు. గోన వంశానికి చెందిన గోన బుద్ధారెడ్డి పాలనకు ఇది రాజధాని. బుద్ధసముద్రం, గోనె బుద్ధారెడ్డి కూతురు కుప్పాంబిక నిర్మించిన ప్రస్తుతం భూత్పూర్గా పేర్కొంటున్న బుద్ధపురంలు కాకతీయుల కాలంలో బౌద్ధానికి ఈ ప్రాంతంలో ఆదరణను తెచ్చాయని వారు వివరించారు. చదవండి: ప్రభుత్వ ధరలకే కోవిడ్ చికిత్స -
కొత్త ఏడాదిలో తెలంగాణ
సిద్దిపేట జోన్/ సిద్దిపేట మున్సిపాలిటీ, న్యూస్‌లైన్: కొన్ని దశాబ్ధాల తెలంగాణ ప్రజల చిరకాల స్వప్నం సాకారం కాబోతోందనీ, కొత్త ఏడాదిలో కొత్త రాష్ట్రం తప్పకుండా ఏర్పడి తీరుతుందని భారీ పరిశ్రమల శాఖ మంత్రి జే.గీతారెడ్డి స్పష్టం చేశారు. అసెంబ్లీకి వచ్చే తెలంగాణ బిల్లుపై చర్చ మాత్రమే జరుగుతుందని ఆమె వెల్లడించారు. సిద్దిపేట అంబేద్కర్‌నగర్‌లో రూ.20 లక్షల ఎస్సీ, ఎస్టీ సబ్‌ప్లాన్ నిధులతో నిర్మించనున్న అంబేద్కర్ కమ్యూనిటీ భవనానికి శంఖుస్థాపన చేసిన ఆమె, అనంతరం చైతన్యపురి కాలనీలో గౌతమ బుద్ధుని విగ్రహాన్ని ఆవిష్కరించారు. అనంతరం ఏర్పాటు చేసిన సభలో మాట్లాడుతూ, కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియాగాంధీ పట్టుదలతోనే తెలంగాణ బిల్లును రాష్ట్రానికి వచ్చిందన్నారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును అడ్డుకునేందుకు నేటికీ అనేక ప్రయత్నాలు జరుగుతున్నాయన్నారు. అసెంబ్లీలో బిల్లుపై చర్చమాత్రమే జరుగుతుందనీ, అనంతరం తిరిగి రాష్ర్టపతి వద్దకు వెళ్తుందన్నారు. అక్కడి నుంచి తిరిగి పార్లమెంట్లో బిల్లు ప్రవేశ పెట్టడం ద్వారా తెలంగాణ ఏర్పాటు ప్రక్రియ వేగవంతం అవుతుందన్నారు. బిల్లును శాసనసభలో త్వరగా చర్చించి రాష్ట్రపతికి పంపాలని తెలంగాణ ప్రాంత మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు ఇప్పటికే ఏకగ్రీవ తీర్మానం చేశామన్నారు. సోనియా అశీస్సులతో తెలంగాణ రావడం ఖయమన్నారు. తెలంగాణ తేచ్చేది, ఇచ్చేది కేవలం కాంగ్రెస్ పార్టీనేని, ఇతర పార్టీలకు అది సాధ్యం కాదన్నారు. దళిత వర్గాల దేవుడు అంబేద్కర్ రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ అన్ని వర్గాల వారికీ స్ఫూర్తి ప్రదాత అయినప్పటికీ, దళిత వర్గాలకు మాత్రం ఆయన దేవుడని మంత్రి గీతారెడ్డి అన్నారు. తాను అనుభవించిన వివక్ష భావితరాలు అనుభవించకూడదన్న లక్ష్యంతోనే అంబేద్కర్, దళితుల అభివృద్ధికి రాజ్యాగం ద్వారా రిజర్వేషన్లు కల్పించారన్నారు. అయితే 33 సంవత్సరాలుగా దళితులకు కేటాయిస్తున్న నిధులు ఆ వర్గాలకు అందకుండా దారి తప్పాయని ఆవేదన వ్యక్తం చేశారు. సోనియా గాంధీ స్ఫూర్తితో దేశ ప్రధాని సబ్‌ప్లాన్ చట్ట ఆమలుకు చర్యలు తీసుకున్నారన్నారు. దళితుల నిధులు వారికే వినియోగించేలా డిప్యూటీ సీఎంతో పాటు రాష్ర్టంలోని దళిత , గిరిజన ప్రజా ప్రతినిధులు సీఎంపై వత్తిడి తీసుకువచ్చి సబ్‌ప్లాన్ చట్టం అమలయ్యేలా చూశామన్నారు. ఇది సమష్టి విజయమని ఆమె అభివర్ణించారు. బుద్ధ విగ్రహం...దళితుల స్ఫూర్తికి చిహ్నం అంతకుముందు బుద్ధుని విగ్రహాన్ని ఆవిష్కరించిన గీతారెడ్డి మాట్లాడుతూ, బుద్ధుని సిద్దాంతాలకు అనుగుణంగానే అంబేద్కర్ కఠోరంగా శ్రమించి దళితుల అభివృద్ధికి బాటలు వేశారన్నారు. సిద్దిపేటలో బుద్ధుని విగ్రహ ఏర్పాటు దళితుల స్ఫూర్తికి చిహ్నంలాంటిదన్నారు. సిద్దిపేటలోని దళితుల సాగు భూముల సమస్యను జిల్లా కలెక్టర్, ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్తానని ఆమె ఈ సందర్భంగా హామీ ఇచ్చారు. కార్యక్రమంలో ఎమ్మెల్సీ ఫారూఖ్ హుస్సేన్, ఏఎంసీ చైర్మన్ శ్రీనివాస్, పీసీసీ కార్యదర్శులు గంప మహేందర్‌రావు, సుప్రభాతరావు, తెలంగాణ దళిత సంఘాల జేఏసీ కన్వీనర్ బత్తుల చంద్రం, నాయకులు భూంపల్లి మనోహర్, తాడూరి శ్రీనివాస్‌గౌడ్, సాకి అనంద్, సికిందర్, వహీద్‌ఖాన్, ప్రభాకర్‌వర్మ, బొమ్మల యాదగిరి, నర్సింలు, ఐలయ్య, మహేష్, నాగరాజు, బాబురావు, కనకయ్యతో పాటు ఆర్డీవో ముత్యంరెడ్డి, తహశీల్దార్ గిరి, ఇన్చార్జి కమిషనర్ లక్ష్మణ్, ఏఈ ఇంతియాజ్ పాల్గొన్నారు. కూలిన సభావేదిక మంత్రి గీతారెడ్డి, ఎమ్మెల్సీ ఫారూఖ్‌లు బుద్ధుని విగ్రహాన్ని ఆవిష్కరించిన అనంతరం సభావేదికపైకి చేరుకోగా, స్థానిక నేతలంతా ఒక్క సారిగా వేదిక మీదకు వచ్చేశారు. దీంతో సభావేదికలోని ఓ వైపు భాగం అకస్మాత్తుగా కుప్పకూలింది. ఈ ఘటనతో వేదికపైనున్న మంత్రి గీతారెడ్డి కూర్చీతో పాటు తూలిపడ్డారు. అనంతరం మాట్లాడిన గీతారెడ్డి బుద్ధుని దయ, ప్రజల అభిమానంతోనే తనకు ఏమీ కాలేదన్నారు. అయితే వేదిక కూలిన విషయం వివిధ ఛానళ్లల్లో విస్తృతంగా ప్రచారం కావడంతో అభిమానుల పరామర్శల తాకిడి ఎక్కువైందని ఆమె చమత్కరించారు. -
150 గుడిసెల కూల్చివేత
సాక్షి, ముంబై: తూర్పు భాండూప్‌లోని శ్యామ్నగర్లో మిగిలిన గుడిసెలపై బీఎంసీ సిబ్బంది మరోసారి బుల్డోజర్ను నడిపించారు. పెద్ద సంఖ్యలో పోలీసు బలగాలతో వచ్చిన సంబంధిత అధికారులు సోమవారం సుమారు 150 గుడిసెలను నేలమట్టం చేశారు. అక్కడి బౌద్ధవిహార్ను కూల్చడమేకాకుండా అందులోని గౌతమ బుద్ధుడి విగ్రహాన్ని తీసుకెళ్లారు. ఈ ఘటన స్థానికులను తీవ్ర ఆగ్రహానికి గురిచేసింది. దీంతో భద్రతా విధులు నిర్వర్తించేందుకు వచ్చిన పోలీసులను వారంతా పక్కకునెట్టి లోపలికి వెళ్లేందుకు ప్రయత్నించారు. పోలీసులు లాఠీచార్జి చేయబోగా ఎదురుతిరిగారు. రాళ్లతో వారిపై దాడి చేశారు. దీంతో ఆ పరిసరాల్లో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. ఆ తర్వాత పోలీసులు వెనక్కి తగ్గడంతో స్థానికులు శాంతి ంచారు. కాగా గడచిన 30 ఏళ్లుగా ఇక్కడే నివసిస్తున్నవారిలో మహబూబ్‌నగర్ జిల్లావాసులతోపాటు మరాఠీ, గుజరాతి, తమిళం, కన్నడ భాషీయులు కూడా ఉన్నారు. శ్యామ్నగర్లో మొత్తం సుమారు 500 గుడిసెలుండగా వీటిలో 350 గుడిసెలను ఈ నెల 12వ తేదీన నేలమట్టం చేసిన సంగతి విదితమే. మిగిలిన 150 గుడిసెలను సోమవారం నేలమట్టం చేశారు. దీంతో అగ్రహించిన స్థానిక ప్రజలు ఉప్పు (సాల్ట్) ఉత్పత్తి విభాగానికి చెందిన అధికారులు, పోలీసులు, బీఎంసీ అధికారులత తీరుపై నిరసన వ్యక్తం చేస్తూ ర్యాలీ నిర్వహించారు. శ్యామ్‌నగర్ నుంచి భాండూప్‌లోని ఉప్పు విభాగం కార్యాలయందాకా ర్యాలీగా వెళ్లి అక్కడ ధర్నా చేశారు. అదేవిధంగా రాస్తారోకో కూడా నిర్వహించారు. బిక్కుబిక్కుమంటూ బతుకుతున్నాం ఈ విషయమై కొందరు స్థానికులు మాట్లాడుతూ మూడు దశాబ్దాలుగా శ్యామ్నగర్లో నివసిస్తున్నామన్నారు. వారం రోజుల నుంచి బిక్కుబిక్కుమంటూ కాలం వెళ్లదీస్తున్నామన్నారు. పిల్లాపాపలను వదిలి పనులకు వెళ్లలేకపోతున్నామని చెప్పా రు. పునరావాసం కల్పించకపోతే ఇక్కడి నుంచి కదలబోన్నారు. కానరాని తెలుగు సంఘాలు ఒకటి రెండు సంఘాలు మినహా మహబూబ్‌నగర్ జిల్లా వాసులను ఆదుకునేందుకు తెలుగు సంఘాలేవీ పెద్దగా ముందుకురాలేదు. తెలంగాణ సంఘీభావ వేదిక సభ్యులతోపాటు ముంబై తెలంగాణ జాయింట్ యాక్షన్ కమిటీ సభ్యులు వచ్చారని బాధితులు తెలిపారు. అయితే అనేకసార్లు తెలుగు వారికి అండగా ఉంటామని చెప్పుకునే తెలుగు సంఘాలు పలకరించడానికి కూడా రాకపోవడంపై బాధితులు అసంతృప్తి వ్యక్తం చేశారు.