gauthami putra satakarni
-
101వ సినిమా ఎవరితో..?
నందమూరి బాలకృష్ణ వందో సినిమాగా తెరకెక్కుతున్న భారీ చిత్రం గౌతమీపుత్ర శాతకర్ణి. అంఖడ భారతాన్ని పరిపాలించిన తెలుగు చక్రవర్తి శాతకర్ణి జీవిత కథ ఆధారంగా ఈ సినిమా తెరకెక్కింది. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా సంక్రాంతి కానుకగా రిలీజ్ అవుతోంది. ఇంతటి ప్రతిష్టాత్మక చిత్రం తరువాత బాలకృష్ణ చేయబోయే సినిమా ఏంటి..? అన్న చర్చ చాలా రోజులుగా జరుగుతోంది. బాలయ్య 101వ సినిమాగా కృష్ణవంశీ దర్శకత్వంలో రైతు అనే సందేశాత్మక చిత్రం చేస్తాడని భావించారు. అదే సమయంలో యువ దర్శకుడు అనీల్ రావిపూడితో రామారావు గారు అనే సినిమా కూడా ప్రధానంగా వినిపించింది. తాజాగా మరో షాకింగ్ అప్డేట్ టాలీవుడ్ సర్కిల్స్‌లో వినిపిస్తోంది. చాలా ఏళ్ల కిందట బాలయ్యతో 'టాప్‌హీరో' లాంటి ఫ్లాప్ సినిమా తీసిన ఎస్ వీ కృష్ణారెడ్డి దర్శకత్వంలో బాలకృష్ణ.. ఓ సినిమా చేయబోతున్నాడట. ప్రస్తుతానికి ఎలాంటి అఫీషియల్ ఎనౌన్స్మెంట్ లేకపోయినా.. వారాహి చలనచిత్ర బ్యానర్లో ఈ ప్రాజెక్ట్ కు సంబంధించి ప్రీ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయన్న టాక్ వినిపిస్తోంది. -
గౌతమీపుత్ర శాతకర్ణి ఆడియో ఎప్పుడంటే.?
సీనియర్ హీరోలందరూ ఆచితూచి అడుగులు వేస్తుంటే నందమూరి బాలకృష్ణ మాత్రం ఫుల్ ఫాంలో దూసుకుపోతున్నాడు. తన వందో సినిమాగా ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న చారిత్రక చిత్రం గౌతమీపుత్ర శాతకర్ణి సినిమాను కేవలం 80 రోజుల్లో పూర్తి చేసి రికార్డ్ సృష్టించాడు. అదే జోరులో సినిమాకు సంబంధించిన ఇతర కార్యక్రమాలను కూడా పూర్తి చేసుకున్నాడు. ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించిన పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు శరవేగంగా జరుగుతున్నాయి. గౌతమీపుత్ర శాతకర్ణి సినిమాను సంక్రాంతి కానుకగా ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ చేయనున్నారు. ఈలోగా ఆడియో ఫంక్షన్‌ను కనీవినీ ఎరుగని రీతిలో భారీగా నిర్వహించేందుకు ప్లాన్ చేస్తున్నారు. భారీ చారిత్రాత్మక చిత్రం కావటంతో పాటు బాలయ్య వందో సినిమా కూడా కావటంతో ఆడియో రిలీజ్ కోసం భారీ ఏర్పాట్లు చేస్తున్నారు. డిసెంబర్ 16న ఈ చిత్ర ఆడియోను రిలీజ్ చేసేందుకు డేట్ ఫిక్స్ చేశారు. త్వరలోనే వేదికతో పాటు కార్యక్రమంలో పాల్గొనబోయే ప్రముఖుల వివరాలు తెలిసే అవకాశం ఉంది. -
100 థియేటర్లలో ట్రైలర్ లాంచ్
నటసింహ నందమూరి బాలకృష్ణ హీరోగా ఫస్ట్ ఫ్రేమ్స్ ఎంటర్టైన్మెంట్ ప్రై.లి.బ్యానర్‌పై నేషనల్ అవార్డ్ విన్నింగ్ డైరెక్టర్ క్రిష్ దర్శకత్వంలో వై.రాజీవ్‌రెడ్డి, జాగర్లమూడి సాయిబాబు నిర్మిస్తున్న ప్రెస్టీజియస్ మూవీ గౌతమిపుత్ర శాతకర్ణి. నందమూరి బాలకృష్ణ నటిస్తున్న 100వ చిత్రం కావడం, తెలుగు చక్రవర్తి గౌతమిపుత్ర శాతకర్ణి ఆధారంగా రూపొందుతోన్న సినిమా కావడంతో సినిమా ప్రారంభం నుండే భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ అంచనాలకు తగ్గట్టు దర్శకుడు క్రిష్, నిర్మాతలు వై.రాజీవ్‌రెడ్డి, జాగర్లమూడి సాయిబాబులు సినిమా గ్రాండ్‌గా తెరకెక్కిస్తున్నారు. సినిమా ఫస్ట్‌లుక్, టీజర్లకు మంచి రెస్పాన్స్ వచ్చింది. ఈ సినిమా టీజర్‌కు 26 లక్షలకు పైగా వ్యూస్ రావటం విశేషం. ఇప్పుడు థియేట్రికల్ ట్రైలర్‌ను విడుదల చేయడానికి భారీ ఎత్తున్న సన్నాహాలు జరుగుతున్నాయి. గౌతమిపుత్ర శాతకర్ణి బాలకృష్ణ నటించిన 100వ చిత్రం కావడంతో సినిమా థియేట్రికల్ ట్రైలర్‌ను యు.ఎస్., యు.కె. సహా ప్రపంచ వ్యాప్తంగా వంద లోకేషన్స్‌లో ఒకేసారి విడులయ్యేలా ప్లాన్ చేస్తున్నారు. డిసెంబర్ మొదటివారంలో ఈ వేడుకను భారీగా పలువురు సినీ ప్రముఖుల సమక్షంలో నిర్వహించనున్నారు. నటసింహ నందమూరి బాలకృష్ణ టైటిల్ పాత్ర పోషిస్తున్న ఈ చిత్రంలో హేమామాలిని, శ్రేయ, కబీర్ బేడి తదితరలు నటిస్తున్నారు. ఈ చిత్రానికి సమర్పణ: బిబో శ్రీనివాస్, సినిమాటోగ్రాఫర్: జ్ఞాన శేఖర్, ఆర్ట్: భూపేష్ భూపతి, సంగీతంః చిరంతన్ భట్, సాహిత్యం: సీతారామశాస్త్రి, మాటలు: సాయిమాధవ్ బుర్రా, ఫైట్స్: రామ్ లక్ష్మణ్, సహ నిర్మాత: కొమ్మినేని వెంకటేశ్వరరావు, నిర్మాతలు: వై.రాజీవ్ రెడ్డి, జాగర్లమూడి సాయిబాబు, దర్శకత్వం: క్రిష్.