
100 థియేటర్లలో ట్రైలర్ లాంచ్
నటసింహ నందమూరి బాలకృష్ణ హీరోగా ఫస్ట్ ఫ్రేమ్స్ ఎంటర్‌టైన్మెంట్ ప్రై.లి.బ్యానర్‌పై నేషనల్ అవార్డ్ విన్నింగ్ డైరెక్టర్ క్రిష్ దర్శకత్వంలో వై.రాజీవ్‌రెడ్డి, జాగర్లమూడి సాయిబాబు నిర్మిస్తున్న ప్రెస్టీజియస్ మూవీ గౌతమిపుత్ర శాతకర్ణి. నందమూరి బాలకృష్ణ నటిస్తున్న 100వ చిత్రం కావడం, తెలుగు చక్రవర్తి గౌతమిపుత్ర శాతకర్ణి ఆధారంగా రూపొందుతోన్న సినిమా కావడంతో సినిమా ప్రారంభం నుండే భారీ అంచనాలు నెలకొన్నాయి.
ఈ అంచనాలకు తగ్గట్టు దర్శకుడు క్రిష్, నిర్మాతలు వై.రాజీవ్‌రెడ్డి, జాగర్లమూడి సాయిబాబులు సినిమా గ్రాండ్‌గా తెరకెక్కిస్తున్నారు. సినిమా ఫస్ట్‌లుక్, టీజర్‌లకు మంచి రెస్పాన్స్ వచ్చింది. ఈ సినిమా టీజర్‌కు 26 లక్షలకు పైగా వ్యూస్ రావటం విశేషం. ఇప్పుడు థియేట్రికల్ ట్రైలర్‌ను విడుదల చేయడానికి భారీ ఎత్తున్న సన్నాహాలు జరుగుతున్నాయి.
గౌతమిపుత్ర శాతకర్ణి బాలకృష్ణ నటించిన 100వ చిత్రం కావడంతో సినిమా థియేట్రికల్ ట్రైలర్‌ను యు.ఎస్., యు.కె. సహా ప్రపంచ వ్యాప్తంగా వంద లోకేషన్స్‌లో ఒకేసారి విడులయ్యేలా ప్లాన్ చేస్తున్నారు. డిసెంబర్ మొదటివారంలో ఈ వేడుకను భారీగా పలువురు సినీ ప్రముఖుల సమక్షంలో నిర్వహించనున్నారు.
నటసింహ నందమూరి బాలకృష్ణ టైటిల్ పాత్ర పోషిస్తున్న ఈ చిత్రంలో హేమామాలిని, శ్రేయ, కబీర్ బేడి తదితరలు నటిస్తున్నారు. ఈ చిత్రానికి సమర్పణ: బిబో శ్రీనివాస్, సినిమాటోగ్రాఫర్: జ్ఞాన శేఖర్, ఆర్ట్: భూపేష్ భూపతి, సంగీతంః చిరంతన్ భట్, సాహిత్యం: సీతారామశాస్త్రి, మాటలు: సాయిమాధవ్ బుర్రా, ఫైట్స్: రామ్ లక్ష్మణ్, సహ నిర్మాత: కొమ్మినేని వెంకటేశ్వరరావు, నిర్మాతలు: వై.రాజీవ్ రెడ్డి, జాగర్లమూడి సాయిబాబు, దర్శకత్వం: క్రిష్.