
గౌతమీపుత్ర శాతకర్ణి ఆడియో ఎప్పుడంటే.?
సీనియర్ హీరోలందరూ ఆచితూచి అడుగులు వేస్తుంటే నందమూరి బాలకృష్ణ మాత్రం ఫుల్ ఫాంలో దూసుకుపోతున్నాడు. తన వందో సినిమాగా ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న చారిత్రక చిత్రం గౌతమీపుత్ర శాతకర్ణి సినిమాను కేవలం 80 రోజుల్లో పూర్తి చేసి రికార్డ్ సృష్టించాడు. అదే జోరులో సినిమాకు సంబంధించిన ఇతర కార్యక్రమాలను కూడా పూర్తి చేసుకున్నాడు. ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించిన పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు శరవేగంగా జరుగుతున్నాయి.
గౌతమీపుత్ర శాతకర్ణి సినిమాను సంక్రాంతి కానుకగా ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ చేయనున్నారు. ఈలోగా ఆడియో ఫంక్షన్ను కనీవినీ ఎరుగని రీతిలో భారీగా నిర్వహించేందుకు ప్లాన్ చేస్తున్నారు. భారీ చారిత్రాత్మక చిత్రం కావటంతో పాటు బాలయ్య వందో సినిమా కూడా కావటంతో ఆడియో రిలీజ్ కోసం భారీ ఏర్పాట్లు చేస్తున్నారు. డిసెంబర్ 16న ఈ చిత్ర ఆడియోను రిలీజ్ చేసేందుకు డేట్ ఫిక్స్ చేశారు. త్వరలోనే వేదికతో పాటు కార్యక్రమంలో పాల్గొనబోయే ప్రముఖుల వివరాలు తెలిసే అవకాశం ఉంది.