gay activists
-
‘గే’లి చేస్తే.. గల్లా పడతాం..
సాక్షి, సిటీబ్యూరో :‘గే’లి చేస్తే.. గల్లా పడతాం.. అంటోంది బ్లూడ్ అనే గే సోషల్ నెట్వర్కింగ్ యాప్. ఇంటా, బయటా, సోషల్ మీడియాలో స్వలింగ సంపర్కలను అవహేళన చేస్తూ, అసభ్యంగా, అశ్లీల కామెంట్లు చేస్తే ఊరుకోబోమంటూ హెచ్చరిస్తోంది. కొంతకాలంగా స్వలింగ సంపర్కులకు చెందిన ఎల్జిటిబిక్యు కమ్యూనిటీకి మద్దతుగా పనిచేస్తోంది. తాజాగా సిటీలోని సదరు కమ్యూనిటీ సభ్యులకు శుభవార్త చెప్పింది. స్వలింగ సంపర్కుల హక్కులపై అందరిలో అవగాహన కల్పించేందుకు యాంటి సైబర్ బుల్లీయింగ్ క్యాంపెయిన్ను ప్రారంభిస్తున్నట్లు సంస్థ కంట్రీ మేనేజర్ యుజున్ తెలిపారు. దీని కోసం తమ సంస్థ క్వీరిథిమ్, యా డాట్ ఆల్ సంస్థలతో చేతులు కలిపిందని వివరించారు. దీనిలో భాగంగా పలు వీడియోల ఆధారంగా స్వలింగ సంపర్కులపై వేధింపులు, వారి వ్యథలు కూడా చూపించడం కూడా జరుగుతుందన్నారు. అంతేగాకుండా దీంతో పాటు ఇటీవలి కాలంలో బాగా పెరిగిన ఆన్లైన్ డేటింగ్ యాప్స్ వాటి కార్యకలాపాలపై కూడా అవగాహన పెంచుతామన్నారు. దీనిపై అదనపు సమాచారం కోసం తమ హెల్ప్లైన్ నంబర్లు 97.4554.5559, 60.0903.2883లో సంప్రదించాలన్నారు. -
జైలు నుంచి గే కార్యకర్తల విడుదల
బెంగాలీల కొత్త సంవత్సరం వేడుకల సందర్భంగా ఇంద్రధనస్సు రంగులతో ప్రదర్శన చేసిన గే హక్కుల కార్యకర్తలను బంగ్లాదేశీ పోలీసులు అరెస్టు చేసి.. విడుదల చేశారు. వారిని పది గంటల పాటు పోలీసు స్టేషన్లోనే ఉంచి విచారించారని, ఆ తర్వాతే విడుదల చేశారని ఎల్జీబీటీ హక్కుల సంఘం రూప్బాన్ సభ్యుడు ఒకరు తెలిపారు. అరెస్టయిన నలుగురి బంధువులు పోలీసు స్టేషన్కు వెళ్లగా, అక్కడ వీళ్లు స్వలింగ సంపర్కులని, వాళ్ల సమస్య పరిష్కరించుకోవాలని సలహా ఇచ్చి విడుదల చేసినట్లు తెలుస్తోంది. ఇంతకుముందు 2014, 2015 సంవత్సరాలలో కూడా రూప్బాన్ సంస్థ ఫేస్బుక్ ప్రచారంతో బంగ్లాదేశ్లో ఇలాంటి ప్రదర్శనలే నిర్వహించింది. ఇది వరుసగా మూడోసారి. భద్రతా కారణాల రీత్యా ఈసారి ప్రదర్శనకు తాము అనుమతి ఇవ్వలేదని పోలీసులు చెబుతున్నారు. ఈ గ్రూపునకు సంబంధించిన ఫేస్బుక్ పేజీలో వాళ్లను చంపేస్తామని హెచ్చరిస్తూ కామెంట్లు వెల్లువెత్తినట్లు తెలిపారు. బంగ్లాదేశ్లో సెక్షన్ 377 ప్రకారం స్వలింగ సంపర్కం నేరం.