ఆ గే రిఫరీ హర్టయ్యాడు
మాడ్రిడ్: తొలిసారి స్పానిష్ ఫుట్ బాల్ రిఫరీగా ఎంపికైన స్వలింగ సంపర్కుడు(గే) జీసస్ టొమిలెరో తన బాధ్యతల నుంచి తప్పుకున్నాడు. వరుసగా అవమానాలు ఎదురవుతుండటంతో రెండు నెలల్లోనే ఆ ఉద్యోగానికి బైబై చెప్పేశారు. క్రీడాకారుల నుంచి మద్దతుదారుల నుంచి వరుసగా వేధింపులు, అవమానాలు ఎదురవ్వడం వల్లే తాను తప్పుకుంటున్నట్లు ఈ సందర్భంగా జీసస్ చెప్పారు.
అండల్సియాన్ లో పోర్చుగీస్ వర్సెస్ శాన్ ఫెర్నార్డో ఇస్లెనో మధ్య జరిగిన అండర్-19 మ్యాచ్ లో ఓ క్రీడాకారుడికి తాను పెనాల్టీ విధించిన తర్వాత కొంతమంది దారుణంగా తిట్టి అవమానించారని.. చుట్టూ ఉన్నవారంతా నవ్వారని, అది తనను తీవ్రంగా ఇబ్బంది పెట్టి బాధ్యతల నుంచి తప్పుకుంటున్నట్లు చెప్పాడు. 11 ఏళ్ల నుంచి రిఫరీగా పనిచేస్తున్న జీసస్ టొమిలెరో.. కొద్ది నెలల కిందటే తాను గేనని బహిరంగంగా చెప్పాడు. అప్పటి నుంచి తీవ్ర అవమానాలు ప్రారంభం కావడంతో విధులకు గుడ్ బై చెప్పాడు.