చాద్ రాయబారిగా భారతీయ అమెరికన్ మహిళ
వాషింగ్టన్: సెంట్రల్ ఆఫ్రికా దేశం చాద్‌లో తమ తదుపరి దౌత్యవేత్తగా భారత సంతతికి చెందిన గీతా పసిని అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా నామినేట్ చేశారు. ఆమె ప్రస్తుతం ఆఫీస్ ఆఫ్ కెరీర్ డెవలప్మెంట్ డెరైక్టర్‌గా వ్యవహరిస్తున్నారు. 2011-14 మధ్యకాలంలో జిబౌటి దేశంలో అమెరికా రాయబారిగా ఆమె సేవలందించారు. అంతకుముందు రెండేళ్లు తూర్పు ఆఫ్రికా వ్యవహారాల కార్యాలయ డెరైక్టర్‌గా పనిచేశారు.
అమెరికా విదేశీ వ్యవహారాల విభాగంలో 1988లో చేరిన గీత భారత్‌తో పాటు కామెరూన్, ఘనా, రొమేనియాల్లోనూ పనిచేశారు. చాద్ దౌత్యవేత్తతో పాటు పలు కీలక పదవులకు అధికారులను ఒబామా నామినేట్ చేసినట్లు వైట్‌హౌస్ బుధవారం ఓ ప్రకటనలో పేర్కొంది.