Gemini Suresh
-
షూటింగ్ లో మంచు లక్ష్మి ఎంత కష్టపడ్డారంటే ?
-
పొట్టకూటి కోసం పొగడ్తలు
‘‘ప్యారాషూట్ లేకుండా మనిషిని గాల్లో తేలగలిగేలా చేసేది పొగడ్త. దానికి పడని వాళ్లు ఉండరు. అలాంటి పొగడ్తనే ప్రవృత్తిగా పెట్టుకున్న ఒక కుటుంబానికి సంబంధించిన కథే మా ‘భజన బ్యాచ్’ సిరీస్. ప్రేక్షకులను కడుపుబ్బా నవ్విస్తుంది’’ అన్నారు దర్శకుడు చిన్నికృష్ణ. దర్శకుడు మారుతి ఇచ్చిన కాన్సెప్ట్ ఆధారంగా చిన్నికృష్ణ రూపొందించిన వెబ్‌సిరీస్ ‘భజన బ్యాచ్’. పోసాని కృష్ణమురళి, గెటప్ శ్రీను, జెమిని సురేశ్ ముఖ్య పాత్రల్లో నటించారు. చిన్నా వాసుదేవ రెడ్డి నిర్మించారు. ఈ వెబ్ సిరీస్ ప్రస్తుతం సోనీ లైవ్‌లో ప్రసారం అవుతోంది. ఈ సందర్భంగా చిన్నికృష్ణ మాట్లాడుతూ– ‘‘ఈ సిరీస్‌ను 12 ఎపిసోడ్లుగా, ఒక్కో ఎపిసోడ్ 20 నిమిషాల నిడివితో రూపొందించాం. పొగడ్తల ద్వారా జీవితం సాగిస్తారు పోసాని. వాళ్ల పిల్లలను కూడా ఇదే వృత్తిని కొనసాగించమనడంతో తన పిల్లలు కూడా భజన చేయడం మొదలుపెడతారు. ఒక్కో ఎపిసోడ్లో ఒక్కొక్కరి చుట్టూ చేరి భజన చేస్తారు. ఈ మధ్య సోషల్ మీడియాలో పాపులారిటీ పొందిన వాళ్లను స్ఫూప్ చేశాం. విషం తీసుకుంటాను కానీ పొగడ్తలను తీసుకోను అనే మనస్తత్వం ఉన్న అజయ్ ఘోష్ వీళ్ల ఆటలు కట్టించాలనుకుంటాడు. ముందుగా సినిమాలా చేసి వెబ్ సిరీస్ స్టయిల్లో కట్ చేశాం. నాకు జంధ్యాలగారు, ఈవీవీగారు అంటే చాలా అభిమానం. వాళ్ల స్టయిల్ కామెడీ ఇందులో ఉంటుంది. నాటకరంగంలో నటుడిగా నాలుగు స్టేట్ అవార్డులు అందుకున్నాను. వినాయక్గారిని నటుడిగా అవకాశం అడిగితే రైటింగ్ టీమ్‌లోకి తీసుకున్నారు. ఆయన వద్ద ‘కృష్ణ, అదుర్స్’ సినిమాలకు వర్క్ చేశాను. ‘వీడు తేడా, బ్రదర్ ఆఫ్ బొమ్మాళి, లండన్ బాబులు’ సినిమాలకు దర్శకత్వం వహించాను. ‘కొత్తబంగారు లోకం, ఖైదీ నంబర్ 150’ వంటి సినిమాల్లో చిన్న పాత్రల్లో కనిపించాను. దర్శకులకు సినిమా సినిమాకు చిన్న గ్యాప్ రావడం సహజం. ఇకపై ఆ గ్యాప్‌లో వెబ్ సిరీస్‌లు చేయాలనుకుంటున్నాను. ప్రస్తుతం నేను తెరకెక్కించిన ‘అక్షర’ సినిమాని ఈ నెలాఖరులో విడుదల చేయానున్నాం’’ అన్నారు. -
నువ్వు మాస్‌రా...
‘లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్’ ఫేమ్ సుధాకర్ కోమాకుల హీరోగా నటించిన చిత్రం ‘నువ్వు తోపురా’. హరినాథ్ బాబు.బి దర్శకత్వంలో బేబి జాహ్నవి సమర్పణలో యునైటెడ్ ఫిలింస్ బ్యానర్‌పై ఎస్.జె.కె.ప్రొడక్షన్స్ (యు.ఎస్.ఎ) వారి సహకారంతో డి.శ్రీకాంత్ నిర్మించారు. గీతా ఆర్ట్స్ ఫిలిం డిస్ట్రిబ్యూటర్స్ ద్వారా ఈ సినిమా ఏప్రిల్ 26న విడుదల కానుంది. బి.హరినాథ్ మాట్లాడుతూ– ‘‘మాస్, థ్రిల్లర్ కంటెంట్‌తో తెరకెక్కిన చిత్రమిది. అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది’’ అన్నారు. ‘‘మా చిత్రం గీతా ఆర్ట్స్, జి3 ఫిల్మ్స్ డిస్ట్రిబ్యూటర్ ద్వారా విడుదలవుతుండం ఆనందంగా ఉంది. ఇందుకు అల్లు అరవింద్‌గారికి, ‘బన్ని’ వాసుగారికి థ్యాంక్స్’’ అన్నారు శ్రీకాంత్. ‘‘అమెరికాలోని అత్యంత అందమైన ప్రదేశాలైన సాల్ట్ లేక్ సిటీ, ప్రొవో తదితర ప్రాంతాల్లో షూటింగ్ జరుపుకున్న చిత్రమిది. మంచి నిర్మాణ విలువలతో ఎక్కడా రాజీ పడకుండా నిర్మించాం’’ అని చిత్ర సహ నిర్మాత డా.జేమ్స్ వాట్ కొమ్ము(యు.ఎస్.ఎ) అన్నారు. నిత్యాశెట్టి, నిరోషా, రవివర్మ, శ్రీధరన్, దివ్యా రెడ్డి, ‘జెమిని’ సురేష్, దువ్వాసి మోహన్ తదితరులు నటించిన ఈ చిత్రానికి అసోసియేట్ ప్రొడ్యూసర్: రితేష్ కుమార్, కెమెరా: ప్రశాష్ వేళాయుధన్, వెంకట్ సి.దిలీప్, సంగీతం: సురేష్ బొబ్బలి, ఆమెరికా లైన్ ప్రొడ్యూసర్: స్టెపెనీ ఒల్లర్టన్, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: రవివర్మ దంతులూరి. -
మా సొంతూరు బూరుగుపల్లి
కొవ్వూరు : జెమిని టెలివిజన్‌లో క్రియేటివ్ డెరైక్టర్‌గా 2003లో చేరిన పాలకొల్లు సమీపంలోని బూరుగుపల్లికి చెందిన నటుడు జెమిని సురేష్‌గా బుల్లి తెరతో పాటు వెండి తెరలో రాణిస్తున్నాడు. కుమారదేవంలో టైటానిక్ షూటింగ్లో పాల్గొనేందుకు వచ్చిన సురేష్ విలేకరులతో ముచ్చటించారు. ప్ర : మీ స్వగ్రామం జవాబు : పాలకొల్లు సమీపంలో బూరుగుపల్లి ప్ర : నట ప్రస్థానం ఎలా మొదలైంది జవాబు : 2003లో జెమిని టీవీలో క్రియేటివ్ డెరైక్టర్‌గా చేరి 24 ఫ్రేమ్స్ పేరుతో సుమారు 1,600 మందిని ఇంటర్వ్యూ చేశా. ఇది సౌత్ ఇండియూలో లిమ్కా బుక్ ఆఫ్ రికార్డ్ సాధించింది. ప్ర : సినీ రంగ ప్రవేశం జవాబు : 2004లో నటుడు శ్రీహరి ప్రోద్బలంతో శ్రీ మహా లక్ష్మి చిత్రంతో వెండి తెరకు పరిచయమయ్యూ ప్ర : పేరు తెచ్చిన సినిమాలు జవాబు : రెడీ, వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్, ఆగడు ప్ర : మీ చదువు, కుటుంబ ప్రోత్సాహం జవాబు : ఎంబీఏ చదివాను. అమ్మ సుబ్బలక్ష్మి నన్నెంతగానో ప్రోత్సహించారు ప్ర : మీ లక్ష్యం జవాబు : మంచి నటుడిగా గుర్తింపు పొందాలని ప్ర :ప్రస్తుతం మీరు నటిస్తున్న సినిమాలు జవాబు : సాయిధరమ్ తేజ హీరోగా సుప్రీమ్, బాలకృష్ణ హీరోగా నటిస్తున్న డిక్టేటర్, కళ్యాణ వైభోగమే, సినిమా హాల్, టైటానిక్ చిత్రాల్లో నటిస్తున్నా.