కిరాణ దుకాణంలో అగ్నిప్రమాదం
హైదరాబాద్: నగరంలోని బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ పరిధిలోని కృష్ణా నగర్ లోని ఓ దుకాణంలో గురువారం అగ్నిప్రమాదం సంభవించింది. సంతోషి ట్రేడర్స్ కిరాణ దుకాణంలో షార్ట్ సర్క్యూట్ కారణంగా మంటలు చెలరేగాయి. వేగంగా మంటలు వ్యాపించడంతో దుకాణంలో సామాగ్రి కాలిబూడిదైంది. స్థానికుల సమాచారం మేరకు అక్కడికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటను అదుపులోకి తీసుకువచ్చారు. లక్షల్లో ఆస్తి నష్టం వాటిల్లినట్టు భావిస్తున్నారు.