Geo tag
-
జగనన్న కాలనీలు ఆధునిక లోగిళ్లు
సాక్షి, అమరావతి: జగనన్న కాలనీల్లో శాశ్వతప్రాతిపదికన అత్యాధునిక మౌలిక సౌకర్యాలు కల్పించి, ఆధునిక లోగిళ్లుగా తీర్చిదిద్దుతున్నామని గృహ నిర్మాణ శాఖ మంత్రి జోగి రమేష్ తెలిపారు. శుక్రవారం శాసనసభ ప్రశ్నోత్తరాల సమయంలో మంత్రి మాట్లాడారు. త్వరలోనే జగనన్న కాలనీలు పూర్తవుతాయని, రాష్ట్రంలో 31 లక్షల మందికి ఇళ్ల పట్టాలు ఇవ్వడం ఒక చరిత్ర అని చెప్పారు. 4బీ అప్లికేషన్ జియో ట్యాగ్ విషయంలో చర్యలు తీసుకుంటామన్నారు. ఇళ్ల స్థలాల పంపిణీకి చంద్రబాబు అడ్డంకులు సృష్టిస్తున్నారని, చివరికి కోర్టులో కేసులు కూడా వేయించారని తెలిపారు. భూములను కొని మరీ పేదవారికి ఇళ్లు ఇస్తున్నామని రెవెన్యూ శాఖ మంత్రి ధర్మాన ప్రసాదరావు చెప్పారు. జగనన్న కాలనీల్లో అత్యాధునిక సౌకర్యాలు కల్పించడం గొప్ప విషయమని ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్‌రెడ్డి అన్నారు. ఏ పార్టీ వారైనా ఇళ్లు లేని ప్రతి ఒక్కరికీ సీఎం జగన్ ఇళ్లు కట్టించి ఇస్తున్నారని ఎమ్మెల్యే జక్కంపూడి రాజా తెలిపారు. వేలాది ఎకరాల భూమి కొనుగోలు చేసి సంతృప్తస్థాయిలో పేదలందరికీ ఇళ్లు ఇవ్వడం ఓ చరిత్ర అని ఎమ్మెల్యే విశ్వసరాయి కళావతి కొనియాడారు. కొన్నిచోట్ల పట్టా కేటాయించిన తర్వాత రద్దవడంపై పరిశీలన జరపాలని ఎమ్మెల్యే టీజేఆర్ సుధాకర్‌బాబు కోరారు. గత ప్రభుత్వంలో జన్మభూమి కమిటీలు ఇళ్లను అమ్ముకునేవని ఎమ్మెల్యే దుద్దుకుంట శ్రీధర్‌రెడ్డి అన్నారు. సాంకేతిక సమస్యలతో ఇళ్లు లభించని వారికి వేరే చోట పట్టాలివ్వాలని ఎమ్మెల్యే వసంత వెంకట కృష్ణప్రసాద్ కోరారు. సీఎం జగన్ చేపడుతున్న కార్యక్రమాలు అద్భుతమని ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్‌రెడ్డి చెప్పారు. శ్రీకృష్ణదేవరాయలు తరం, వైఎస్ జగన్మోహన్రెడ్డి తరం అని చరిత్ర చెప్పుకుంటుందని అన్నారు. టీడీపీ హయాంలో అనారోగ్యశ్రీగా మార్చారు - మంత్రి రజిని టీడీపీ హయాంలో ఆరోగ్యశ్రీని అనారోగ్యశ్రీగా మార్చారని వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి విడదల రజిని మండిపడ్డారు. ప్రశ్నోత్తరాల సమయంలో ఆమె మాట్లాడుతూ... టీడీపీ హయాంలో 107 ప్రొసీజర్లు పెంచితే, ఆరోగ్యశ్రీలో 3,138 ప్రొసీజర్లు పెంచిన ఘనత సీఎం వైఎస్ జగన్‌కు దక్కుతుందని చెప్పారు. ఆయుష్మాన్ భారత్ పథకానికి ఆరోగ్యశ్రీ స్ఫూర్తిగా నిలిచిందని మంత్రి తెలిపారు. మత్స్యకారులకు అండగా ఉంటాం- మంత్రి సీదిరి అప్పలరాజు వేట నిషేధ సమయంలో ప్రతి మత్స్యకారునికి మత్స్యకార భరోసా అందిస్తున్నామని పశు సంవర్ధక శాఖ మంత్రి సీదిరి అప్పలరాజు తెలిపారు. ప్రమాదంలో మరణించిన మత్స్యకారుడు కుటుంబ పెద్ద కాకపోయినప్పటికీ పరిహారం అందిస్తున్నామని చెప్పారు. భీమిలి, చింతపల్లి, రాజయ్యపేట వద్ద ఎఫ్‌ఎల్‌సీలకు టెండర్ల ప్రక్రియ త్వరలో ప్రారంభిస్తామన్నారు. అవసరమైతే సబ్సిడీ మొత్తాన్ని పెంచుతామన్నారు. మత్స్యకార భరోసా కుటుంబంలో అందిరికీ వర్తింపజేయాలని ఎమ్మెల్యే పొన్నాడ వెంకట సతీష్‌కుమార్ కోరారు. 15 రోజుల శిక్షణతో అర్చకత్వం హిందూ ధర్మ ప్రచారం, రక్షణకు చర్యలు తీసుకుంటున్నామని దేవదాయశాఖ మంత్రి కొట్టు సత్యనారాయణ చెప్పారు. ప్రశ్నోత్తరాల సమయంలో సభ్యుల ప్రశ్నలకు మంత్రి సమాధానం ఇచ్చారు. ఈ ఏడాది 2,900 దేవాలయాలు నిర్మిస్తున్నామని, ధూపదీప నైవేద్యాల కింద రూ.27.47 కోట్లు ఖర్చు చేస్తున్నామని తెలిపారు. ధూపదీప నైవేద్యాల పెండింగ్ బిల్లులు పది రోజుల్లో క్లియర్ చేస్తామన్నారు. దేవాలయానికి సంబంధం ఉన్న ప్రతి కమిటీకి ఏటా రూ.15 కోట్లు ఇస్తున్నామని వెల్లడించారు. దేవాలయాల్లో పని చేసేందుకు ఆసక్తితో ఉన్న వారికి 15 రోజులు శిక్షణ ఇచ్చి అర్చకత్వంలో నియమిస్తామని చెప్పారు. 16 ఏళ్లు నిండిన తరువాత వంశపారంపర్య అర్చకులుగా నియమిస్తామన్నారు. హిందూధర్మ పరిరక్షణకు జగన్ ప్రభుత్వం అనేక కార్యక్రమాలను అమలు చేసిందని ఎమ్మెల్యే మల్లాది విష్ణు చెప్పారు. చంద్రబాబు కూల్చేసిన ఆలయాలను సీఎం జగన్ పునర్మిస్తున్నారని తెలిపారు. -
'ఏపీలో పీడీఎస్ కమాండ్ కంట్రోల్ రూమ్ వ్యవస్థపై కేంద్రం ప్రశంసలు'
సాక్షి, న్యూఢిల్లీ: ఏపీలో పీడీఎస్ కమాండ్ కంట్రోల్ రూమ్ వ్యవస్థను కేంద్రం ప్రశంసించిందని రాష్ట్ర పౌరసరఫరాలశాఖ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు తెలిపారు. జియో ట్యాగ్ సిస్టం ద్వారా ఎలాంటి అక్రమాలకు తావు లేకుండా చేసినట్లు పేర్కొన్నారు. స్మార్ట్ పీడీఎస్ విధానం అమలు చేస్తున్నట్లు తెలిపారు. 'రైస్ మిల్లులలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి, బియ్యం రీసైకిల్ కాకుండా చేస్తున్నాం. ధాన్యం కొనుగోలు డబ్బులు మూడు రోజులలో రైతుల ఖాతాలలో వేస్తున్నాం. రూ.1,702 కోట్ల పాత బకాయిలు చెల్లింపునకు కేంద్రం అంగీకారం తెలిపింది. కేరళ కోసం జయ బొండం బాయిల్డ్ రైస్‌కు కేంద్రం 5 లక్షల మెట్రిక్ టన్నులు ఆర్డర్ ఇచ్చింది. ఒక లక్ష అంత్యోదయ కార్డుల మంజూరుకు కేంద్రం ఒప్పుకుంది. రైతులకు ధాన్యం డబ్బులు ఎప్పటికప్పడు ఇస్తున్నాం. కేంద్రం సకాలంలో చెల్లింపులు చేస్తోంది. రేషన్ కార్డుపై రెండు కిలోల గోధుమ పిండి కూడా ఇస్తున్నాం. వచ్చే రెండు నెలల్లో జొన్నలు, రాగులు కూడా పీడీఎస్ కింద సరఫరా చేస్తాం. పీడీఎస్ బియ్యం రీసైక్లింగ్ జరగకుండా దాడులు చేస్తున్నాం. రేషన్ కార్డులు తొలగించం. పార్టీలు, కులాలు చూడకుండా పథకాలు ఇస్తున్నాం.' అని కారుమూరి పేర్కొన్నారు. చదవండి: ఏపీ గ్లోబల్ ఇన్వెస్టర్ సమ్మిట్‌పై కేటీఆర్ ట్వీట్ -
ప్రకాశం: చీమకుర్తిలో పావురానికి రబ్బర్ ట్యాగ్
-
పావురం కలకలం.. కాలికి జియోట్యాగ్.. గూఢచర్యం కోసమేనా?
సాక్షి, ప్రకాశం: చీమకుర్తి మండలంలోని నెహ్రూనగర్‌లో రబ్బరు ట్యాగ్‌తో కూడిన పావురం కలకలం రేపింది. స్థానికంగా ఉన్నఅపార్ట్‌మెంట్‌లో నాగరాజు అనే యువకుడు పావురాన్ని గమనించాడు. దాని పాదానికి చైనా అక్షరాలతో రబ్బర్‌ట్యాగ్‌ను గుర్తించాడు. దానికి అడ్డంగా 2019, నిలువుగా 2207 కోడ్స్ ఉన్నాయి. అయితే, అతని ఇంట్లో తరచుగా పావురాలు వస్తుంటాయి. ఈ క్రమంలో.. నాగరాజు ఒక పావురం కాలికి కొత్తగా ఏదో ట్యాగ్ ఉండటాన్ని గమనించాడు. వెంటనే స్థానిక వీఆర్వో, పోలీసులకు సమాచారం అందించాడు. వీఆర్వో సంఘటన స్థలానికి చేరుకుని పావురాన్ని పరిశీలించారు. కాగా, గతంలో కూడా ఒడిస్సా రాష్ట్రంలో ఇలాంటి సంఘటనలు జరిగిన విషయం తెలిసిందే. కేంద్రపడ జిల్లా మార్ సగై పీఎస్ పరిధిలో దశరథ్‌పుర్, పూరి జిల్లా హరికృష్ణాపూర్‌లోకూడా ఇదే తరహా పావురాలు పట్టుబడ్డాయి. ఇక్కడ పట్టుబడ్డ పావురాల కాలికి వీహెచ్ ఎఫ్ వైజాగ్ 19742021 ముద్రించి ఉన్నాయి. గత సోమవారం పూరి జిల్లాలో లభించిన పావురం. ఒక పాదానికి చైనా అక్షరాలతో కూడిన అల్యూమినియం, మరో కాలికి 37 కోడ్ అంకెలతో కూడిన ట్యాగ్ ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. ప్రస్తుతం ఈ సంఘటన స్థానికంగా కలకలంగా మారింది. చదవండి: గుట్టుగా వ్యభిచారం.. ఇల్లు అద్దెకు తీసుకుని.. -
దొంగ–పోలీస్.. ఓ గూగుల్ మ్యాప్!
సాక్షి, హైదరాబాద్: పదే పదే దొంగతనాలు చేసే నేరస్తుల సర్వేతో పాటు నివాస గృహాలకు గూగుల్ మ్యాప్ ద్వారా జియో ట్యాగ్ చేయాలని పోలీస్ శాఖ నిర్ణయించింది. రాష్ట్రంలో ప్రాపర్టీ నేరగాళ్లు ఎంతమంది? వారి నివాసాలెక్కడ? అసలు మొత్తం దొంగలెంత మంది అన్న విషయాలు ఇప్పటి వరకు పోలీస్ శాఖ వద్ద స్పష్టంగా లేవు. దీని వల్ల నేరస్తులు, వారి కదలికలపై దృష్టి సారించడం కష్టసాధ్యంగా మారింది. ప్రధానంగా దొంగతనాలు చేసే నేరస్తులపై ఉక్కుపాదం మోపేందుకు పోలీస్ శాఖ వినూత్న కార్యక్రమం చేపట్టబోతోంది. పదే పదే దొంగతనాలు, దోపిడీలకు పాల్పడే నేరస్తులను గుర్తించడం, వారి రికార్డులను అందుబాటులో పెట్టుకోవడంతో పాటు వారి పూర్తి వివరాలను సమగ్ర సర్వే ద్వారా డాటా బేస్‌లోకి తేబోతున్నారు. ఈ మేరకు ఈ నెల 18 నుంచి కార్యాచరణ చేపట్టాలని డీజీపీ మహేందర్‌రెడ్డి జిల్లాల ఎస్పీలు, కమిషనర్లను ఆదేశించారు. సర్వే చేసిన వివరాలన్నీ ప్రతీ పోలీస్ స్టేషన్ నుంచి జిల్లా హెడ్‌క్వార్టర్ వరకు అందరి డేటా బేస్‌లో అందుబాటులో ఉండాలని ఆయన ఆదేశించారు. అలాగే నేరస్తుల గృహాలకు గూగుల్ మ్యాప్ ద్వారా జియో ట్యాగింగ్ చేసి పెట్రోలింగ్, బ్లూకోట్స్ వాహనాలు, సిబ్బంది వద్దనున్న ట్యాబుల్లో నిక్షిప్తం చేయనున్నారు. దీని వల్ల దొంగతనాలు జరిగిన సందర్భాల్లో కదలికలు కనిపెట్టడం సులభంగా ఉంటుందని ఉన్నతాధికారులు భావిస్తున్నారు. ఇప్పటికే 2015లో హైదరాబాద్‌లో ఆరువేల మంది, సైబరాబాద్‌లో మూడువేల మంది, రాచకొండలో రెండువేల మంది నేరస్తుల గృహాలను జియో ట్యాగ్ చేశారు. ఇప్పుడు కూడా రాష్ట్ర వ్యాప్తంగా అన్ని పోలీస్స్టేషన్లలో దొంగతనాల కేసుల్లో ఉన్న వారి వివరాలు, వారి గృహాలను గుర్తించి జియో ట్యాగ్ చేయనున్నారు. -
ప్రతి ఇంటికి జియోట్యాగ్
మున్సిపల్ కమిషనర్ ప్రసాదరావు మెదక్‌మున్సిపాలిటీ: ఆస్తిపన్ను మదింపునకు సంబంధించి ప్రతి ఇంటికి(అసెస్మెంట్) జియోట్యాగ్ చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం భువన్ యాప్‌ను ప్రవేశపెట్టిందని మున్సిపల్ కమిషనర్ ప్రసాదరావు తెలిపారు. బుధవారం మెదక్ పట్టణంలోని ఫతేనగర్ వీధిలో జియోట్యాగింగ్ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రసాదరావు విలేకరులతో మాట్లాడుతూ.. రెండు రోజులుగా మెదక్ పట్టణంలో జియోట్యాగ్ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామన్నారు. ఇంటి పన్నులు వసూలు చేసే బిల్ కలెక్టర్లు ముందుగా ఫోన్లో భువన్ యాప్‌ను డౌన్లోడ్ చేసుకోవడంతో పాటు రిజిస్టర్ కావాలన్నారు. దీంతో అతని పరిధిలో గల అసిస్‌మెంట్‌కు సంబంధించిన పూర్తి వివరాలు ఫోన్లోకి చేరతాయన్నారు. అనంతరం బిల్ కలెక్టర్ ప్రతి అసిస్మెంట్ను పరిశీలించి, భవనాల ఫొటో తీసుకొని వాటిని జియోట్యాగ్ చేయాల్సి ఉంటుందని తెలిపారు. ఆర్ఐ ఆయా వివరాల్లో తప్పులు సరిచేయడంతో పాటు వాటిని కంప్యూర్‌లో నిక్షిప్తం చేస్తారన్నారు. గతంలో జీఐఎస్ సర్వే ద్వారా ప్రతి ఇంటికి కొలతలు తీసుకున్నామని, జియోట్యాగింగ్ ద్వారా అందులో ఏమైనా అనుమానాలుంటే సరిచేసుకోవచ్చన్నారు. మెదక్ పట్టణంలో 9,470 అసిస్మెంట్లు ఉన్నాయని మున్సిపల్ కమిషనర్ తెలిపారు. అందులో ఇప్పటి వరకు 450 అసిస్మెంట్లకు జియోట్యాగ్ పూర్తిచేశామన్నారు. జూలై 15వ తేదీలోగా జియోట్యాగ్ కార్యక్రమాన్ని పూర్తి చేస్తామని చెప్పారు. భువన్‌యాప్‌లో సేకరించిన సమాచారాన్ని ప్రజలు ఆన్లైన్లో చూసుకునే అవకాశం ఉంటుందన్నారు. ఆయన వెంట మున్సిపల్ ఆర్ఐ రమేశ్, బిల్ కలెక్టర్ శివ తదితరులు ఉన్నారు.