breaking news
Geo TV
-
భారత్ దాడి చేస్తే.. సౌదీ మాకు అండగా వస్తుంది
న్యూఢిల్లీ: సౌదీ అరేబియాతో చేసుకున్న రక్షణ ఒప్పందం ఫలితంగా భారత్ తమపై దాడి చేసిన పక్షంలో ఆ దేశం రంగంలోకి దిగుతుందని పాక్ రక్షణ మంత్రి ఖవాజా ఆసిఫ్ తెలిపారు. ఈ విషయంలో ఎలాంటి అనుమానాలకు తావులేదని స్పష్టం చేశారు. ‘ఈ ఒప్పందం ఏ ఒక్క దేశాన్నో లక్ష్యంగా చేసుకున్నది కాదు. ఉమ్మడి రక్షణకు కుదిరిన అంగీకారం. దురాక్రమణ కోసం దీనిని వాడుకోబోం’అని ఆయన జియో టీవీకిచ్చిన ఇంటర్వ్యూలో తెలిపారు. ‘మా అణు విధానం ప్రత్యేకంగా భారత్నుద్దేశించిందే అయినప్పటికీ సౌదీ అరేబియా అత్యవసరమైన పక్షంలో మా అణు పాటవం సహా సైనిక సామర్థ్యాలను అన్నింటినీ వాడుకునేందుకు ఈ సమగ్ర ఒప్పందంలో ఏర్పాట్లున్నాయి’అని ఆయన వివరించారు. రెండు దేశాల్లో ఏ ఒక్క దేశంపై దురాక్రమణ జరిగినా దానిని ఉమ్మడి దురాక్రమణగా పరిగణించేందుకు ఈ ఒప్పందంలో నిబంధనలున్నాయన్నారు. ఇలా ఉండగా, పాక్ ఆర్మీతో మరో దఫా తలపడాల్సి వస్తే భారత్ ఇప్పుడు సౌదీ అరేబియాను సైతం ఎదుర్కోవాల్సి ఉంటుందని భౌగోళిక రాజకీయ విశ్లేషకుడు ఇయాన్ బ్రెమ్మర్ చెబుతున్నారు. -
వీణామాలిక్కు 26 ఏళ్ల జైలుశిక్ష
ఇస్లామాబాద్: దైవ దూషణతో కూడిన కార్యక్రమాన్ని ప్రసారం చేసినందుకు పాక్ మీడియా గ్రూప్ జియో టీవీ అధిపతి మీర్ షకీల్-ఉర్-రె హ్మాన్, నటి వీణామాలిక్, ఆమె భర్త బషీర్, టీవీ యాంకర్ షయి ష్టా వాహిదిలకు 26ఏళ్ల పాటు జైలు శిక్ష విధిస్తూ యాంటీ టైజమ్ కోర్టు తీర్పు చెప్పింది. జైలుశిక్షతో పాటు రూ.13 లక్షల జరిమానా చెల్లించాలని కోర్టు తన తీర్పులో పేర్కొంది.