శాశ్వత కోమాలో షుమాకర్
ఫార్ములా వన్ రేసర్‌గా చరిత్ర సృష్టించి స్కీయింగ్‌లో గాయపడిన మైఖేల్ షుమాకర్ శాశ్వత కోమాలోకి వెళ్లే అవకాశాలు ఉన్నాయా అంటే ఉన్నాయనే అంటున్నాయి మీడియా కథనాలు. షుమాకర్ ఇప్పుడప్పుడే కోలుకునే అవకాశాలు కనిపించడం లేదంటూ బ్రిటన్, జర్మనీ దేశాలకు చెందిన మీడియాలో కథనాలు వెల్లువెత్తాయి.
దాంతో ఆయన శాశ్వతంగా కోమాలోకి జారుకునే అవకాశాలు అధికంగా ఉన్నాయని అవి పేర్కొంటున్నాయి. ఈ నేపథ్యంలో ఆయన అభిమానులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. ఫ్రాన్స్‌లోని ఆల్ఫ్ పర్వత ప్రాంతంలో గత 19 రోజుల క్రితం స్కీయింగ్ చేస్తూ పడి పోయారు. దాంతో షుమాకర్ తలకు తీవ్ర గాయమై కోమాలోకి వెళ్లిరు. నాటి నుంచి షుమాకర్ ఆసుపత్రిలో కోమాలో ఉన్న సంగతి తెలిసిందే.