మ్యాజిక్ రిపీట్ చేసిన విశాల్..
ముంబై: ప్రముఖ సాఫ్ట్ వేర్ దిగ్గజం ఇన్ఫోసిస్ టెక్నాలజీస్ సీఈవో విశాల్ సిక్కా తన మ్యాజిక్ ను కంటిన్యూ చేశారు. పగ్గాలు చేపట్టినప్పటి నుంచీ వరుస లాభాలతో సంస్థను పరుగులు పెట్టిస్తున్నారు. ఈ నేపథ్యంలో శుక్రవారం విడుదల చేసిన 2016 త్రైమాసికంలో రూ 3,597 కోట్లు లాభంతో మరోసారి తన సత్తాను చాటుకున్నారు. దీంతోపాటుగా భారీ డివిడెండును ప్రకటించి ఇన్వెస్టర్లలో సరికొత్త ఉత్సాహాన్ని నింపారు.
2016 ఆర్థిక సంవత్సరానికి గాను ఈక్విటీ షేరుకు రూ 14.25 ఫైనల్ డివిడెండ్ ను , రూ .5 ముఖ విలువ గల షేరుకుగాను షేర్ హోల్డర్స్ కు 285 శాతం తుది డివిడెండ్ చెల్లించనుంది. జూన్ 20 తేదీకల్లా దీన్ని చెల్లించనున్నారు. దీనికి ముందు, గత ఏడాది అక్టోబర్ లో రూ .10 మధ్యంతర డివిడెండ్ ను ఇచ్చింది. ఈ తాజా ఫలితాల నేపథ్యంలో ఈ షేర్ కు భవిష్యత్తులో మరింత డిమాండ్ పెరిగే అవకాశం ఉందని మార్కెట్ ఎనలిస్టులు భావిస్తున్నారు.