టాటా సన్స్ ఛైర్మన్ ఎంపిక మరి కొద్దిసేపట్లో?
ముంబై: టాటా సన్స్ ఛైర్మన్ గా ఎవరు అనే సస్పెన్స్ కు మరి కొద్ది పేపట్లో తెరపడనుంది. సైరస్ మిస్త్రీకి ఉద్వాసన పలికిన అనంతరం నూతన చైర్మన్ ఎంపిక కసరత్తు ఈ రోజుతో ముగియనుంది. గురువారం అనుకోని బోర్డు సమావేశంలో ఐదుగురు సభ్యుల సెలక్షన్ కమిటీ దీనిపై ఒక నిర్ణయం తీసుకోనుంది. సాయంత్రం 5 గంటలకు జరుగనున్న ఈ సమావేశంలో మార్కెట్ వర్గాల్లో ప్రముఖమైన వ్యక్తినే ఈ పదవికి ఎంపిక చేసు అవకాశం ఉన్నట్టు విశ్వసనీయ వర్గాల సమాచారం. అలాగే టాటా సన్స్ బోర్డు వైస్ ఛైర్మన్ అ భ్యర్థి ఎంపికను ఈ సమావేశంలోనే ఎంపిక చేయనున్నారు.
కాగా గత ఏడాది అక్టోబర్ లో మిస్త్రీ తొలగింపు తర్వాత రతన్ టాటా మధ్యంతర ఛైర్మన్ బాధ్యతలు స్వీకరించిన సంగతి తెలిసిందే.