వాటి కోసం ఫేస్‌బుక్‌ను ప్రిఫర్ చేస్తున్నారు
న్యూయార్క్: అమెరికా సిటిజెన్లు వార్తలు, సమాచారం తెలుసుకునేందుకు సోషల్ మీడియాను ఎక్కువగా వాడుకుంటున్నారు. ఆ దేశంలో 62 శాతమంది నెటిజెన్లు ఫేస్బుక్, ట్విట్టర్, రెడిట్ వంటి సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్స్ ద్వారా ఎప్పటికప్పుడు అప్డేట్ సమాచారం తెలుసుకుంటున్నారు. అయితే అత్యధికమంది నెటిజెన్లు ఫేస్‌బుక్‌ను వాడుతున్నారు.
సోషల్ మీడియా ద్వారా వార్తలను చదువుతున్న వారిలో 67 శాతం మంది ఫేస్‌బుక్‌ను ఆశ్రయిస్తున్నట్టు ఓ సర్వేలో తేలింది. ఇక ఫేస్బుక్ యూజర్లలో మూడింట రెండొంతుల మంది వార్తాసమాచారం తెలుసుకునేందుకు ఆసక్తి చూపుతున్నారు. అమెరికా నెటిజన్లలో యూ ట్యూబ్ చూసే వారి సంఖ్య కూడా ఎక్కువే. 48 శాతం మంది యూ ట్యూబ్ చూస్తున్నారు.
ప్రతి సైట్ నుంచి ఫేస్బుక్, ట్విట్టర్, రెడిట్‌లలో వార్తలు వస్తున్నాయి. ఈ మూడింటితో పాటు ఇన్స్టాగ్రామ్, యూ ట్యూబ్ ద్వారా వార్తలు అందిస్తున్నారు. ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో వార్తలను పోస్ట్ చేస్తున్నారు. దీంతో సోషల్ మీడియాలో వార్తలు చదివే వారి సంఖ్య క్రమేణా పెరుగుతోంది.