Giribabu (actor)
-
కళాతపస్వికి జీవిత సాఫల్య పురస్కారం
వీబీ ఎంటర్టైన్మెంట్స్ ఆధ్వర్యంలో ఆ సంస్థ అధినేత విష్ణు బొప్పన మూడేళ్లుగా బుల్లితెర అవార్డులు అందిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సంస్థ ఆధ్వర్యంలో తొలిసారి వెండితెర అవార్డులు అందించారు. హైదరాబాద్‌లోని శిల్పకళా వేదికలో ఘనంగా ఈ వేడుక జరిగింది. సీనియర్ దర్శకులు ‘కళాతపస్వి’ కె.విశ్వనాథ్‌కు జీవిత సాఫల్య పురస్కారం ప్రదానం చేశారు. ఈ అవార్డు తనకెంతో సంతృప్తి ఇచ్చిందని విశ్వనాథ్ అన్నారు. సీనియర్ నటులు కోట శ్రీనివాసరావుకు లెజెండ్రీ అవార్డును, మరో సీనియర్ నటుడు గిరిబాబుకు ఆల్‌రౌండర్ పురస్కారం అందించారు. వివిధ విభాగాల్లో ఉత్తమ ప్రతిభ కనబరచిన వారికి అవార్డులు ఇచ్చారు. బాల తారల్లో అవార్డు అందుకున్నవారిలో ‘మహానటి’లో చిన్నప్పటి సావిత్రిగా నటించిన రాజేంద్రప్రసాద్ మనవరాలు సాయి తేజస్విని, ‘అప్పూ’ ఫేమ్ డి. సాయి శ్రీవంత్ తదితరులు ఉన్నారు. ఈ వేదికపై పేద కళాకారులకు ఆర్థికసాయం చేశారు. ‘‘ఈ వేడుక విజయవంతం కావడానికి స్పాన్లర్లే కీలకం.. వారందరికీ థ్యాంక్స్’’ అన్నారు విష్ణు బొప్పన. తమిళనాడు మాజీ గవర్నర్ కొణిజేటి రోశయ్య, ఐజీ మాగంటి కాంతారావు, ఐఏఎస్ మాగంటి ఉషారాణి ముఖ్య అతిథులుగా హాజరవగా, నటి జయప్రద సెంటర్ ఆఫ్ అట్రాక్షన్‌గా నిలిచారు. ‘మా’ అధ్యక్షుడు శివాజీరాజా, నటీనటులు సుమన్, భానుచందర్, సత్యప్రకాష్, ఏడిద శ్రీరామ్, కవిత, ప్రియదర్శి తదితరులు పాల్గొన్నారు. -
ఈరోజు మీతో పాటు పుట్టినరోజు జరుపుకుంటున్న ప్రముఖులు
ఈరోజు మీతో పాటు పుట్టినరోజు జరుపుకుంటున్న ప్రముఖులు: గిరిబాబు (నటుడు), శిల్పాశెట్టి (నటి) ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్న వారి వ్యక్తిగత సంవత్సర సంఖ్య 4. వీరు ఈ సంవత్సరం స్థిరాస్తులు కొంటారు. వారసత్వంగా రావలసిన ఆస్తిపాస్తులు చేతికి అందుతాయి. ఉద్యోగం కోసం చేస్తున్న ప్రయత్నాలు ఫలిస్తాయి. ప్రమోషన్ల కోసం ఎంతోకాలంగా ఎదురు చూస్తున్న వారి ఆశలు నెరవేరతాయి. కోర్టుకేసుల నుండి విముక్తి లభించడంతోపాటు వివాదాలలో చిక్కుకున్న ఆస్తులను గెలుచుకుంటారు. అయితే రాహుగ్రహ ప్రభావం వల్ల ఈ సంవత్సరం న్యాయసంబంధమైన, చట్టసంబంధమైన వివాదాలలో ఇరుక్కుంటే వాటినుంచి బయట పడటం అంత సులభం కాదు కాబట్టి గోటితో పోయేదానికి గొడ్డలి దాకా వెళ్లకుండా రాజీ ధోరణితో వ్యవహరించడం మంచిది. మేనేజ్మెంట్ రంగంలోని వారికి, చార్టెర్డ్ ఎకౌంటెంట్లకు, ఫైనాన్స్ రంగ ంలోని వారికి బాగా కలిసి వస్తుంది. పారిశ్రామికవేత్తలు, రియల్ ఎస్టేట్ వ్యాపారులు తమ తమ రంగాలలో బాగా పుంజుకుంటారు. లక్కీ నంబర్లు: 4,5,6,8; లక్కీ కలర్స్: పర్పుల్, బ్లూ, వయోలెట్, గ్రీన్; లక్కీ డేస్: శుక్ర, శని, ఆది, సోమ వారాలు. సూచనలు: కోపాన్ని, నోటి దురుసుతనాన్ని తగ్గించుకోవడం, సర్పసూక్త సహిత మహన్యాసపూర్వక రుద్రాభిషేకం చేయించుకోవడం, వృద్ధులకు, అనాథలకు, వితంతువులకు సహాయం చేయడం. - డా. మహమ్మద్ దావూద్, జ్యోతిష, సంఖ్యాశాస్త్ర నిపుణులు