Girl Students missing
-
కేజీబీవీలో ఇద్దరు విద్యార్థినుల అదృశ్యం
కొత్తగూడెం/చర్ల: కస్తూర్బా విద్యాలయం నుంచి ఇద్దరు విద్యార్థినులు అదృశ్యమైన ఘటన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్ల మండల కేంద్రంలోని లక్ష్మీకాలనీలో సోమవారం చోటుచేసుకుంది. ఆదివారం రాత్రి భోజనం అనంతరం స్టడీ అవర్లో కూడా కూర్చున్న వీరిద్దరూ నిద్రకు ఉపక్రమించి.. తెల్లవారే సరికి కనిపించకపోవడంతో విద్యాలయ అధికారులు, సిబ్బంది ఆందోళన చెందుతున్నారు. మండలంలోని కొయ్యూరు, సాయినగర్కాలనీలకు చెందిన గోటి గౌరి, బండారు సౌజన్య చర్లలోని కేజీబీవీలో పదో తరగతి చదువుతున్నారు. ఆదివారం రాత్రి భోజనం చేసి 10.30 గంటలకు పడుకున్నారు. సోమవారం తెల్లవారుజామున 4.30 గంటలకు విద్యార్థులను చదివించేందుకు సిబ్బంది నిద్ర లేపుతుండగా వీరిరువురూ కనిపించలేదు. ఈ విషయాన్ని సిబ్బంది విద్యాలయం ప్రత్యేకాధికారిణికి సమాచారం అందించారు. సిబ్బంది అంతటా వెదికినా ఆచూకీ తెలియకపోవడంతో విద్యార్థినుల తల్లిదండ్రులకు తెలిపారు. విద్యాలయానికి మూడు వైపులా ప్రహరీ గోడ, గేట్లకు తాళాలు వేసి ఉండగా వెనుకవైపున ఉన్న ప్రహరీగోడ కూలిపోయింది. అక్కడి నుంచే విద్యార్థినులు వెళ్లిపోయి ఉంటారని అంతా అనుమానిస్తున్నారు. విద్యాలయంలో ముందు భాగం, హాలులో మాత్రమే సీసీ కెమెరాలు ఉండగా విద్యార్థులు వెళ్లిన పుటేజీలు అందులో రికార్డు కాలేదు. ఎంఈఓ జుంకీలాల్, తహశీల్దార్ సురేష్కుమార్, ఎంపీపీ కోందరామయ్య, జడ్పీటీసీ సభ్యురాలు తోటమళ్ల హరిత విద్యాలయాన్ని సందర్శించి వివరాలను అడిగి తెలుసుకున్నారు. అధికారుల సూచనల మేరకు విద్యాలయం ప్రత్యేకాధికారిణి చర్ల పోలీస్టేషన్ పిర్యాదు చేశారు. దీంతో పోలీసులు విచారణ ప్రారంబించారు. విద్యార్థినుల అదృశ్యానికి చదువుల ఒత్తిళ్లు కారణమా... సిబ్బంది మందలించారా... లేక మరేమైనా కారణాలున్నాయా అనే కోణాల్లో పోలీసులు విచారణ చేపట్టారు. -
గుర్మీత్ స్కూళ్లలో ఏం జరుగుతోంది?
సాక్షి, ఛండీగఢ్: గుర్మీత్ రామ్ రహీమ్ సింగ్ అత్యాచార కేసులో జైలు పాలయ్యాక డేరా సచ్ఛా సౌదా వ్యవహరాలన్నీ కుంటుపడిపోయాయి. వారసురాలిగా భావించిన హనీప్రీత్ పరారీలో ఉండటం, డేరా చైర్ పర్సన్ విపస్సన ఇన్సాన్ క్రియాశీలకంగా వ్యవహరించకపోతుండటంతో డేరా కార్యకలాపాలాకు అంతరాయం కలుగుతున్నాయి. దీనికి తోడు సిస్రా పూర్తిగా భద్రతా దళాల అదుపులో ఉండటం కూడా మరో కారణంగా మారింది. అయితే గుర్మీత్ అరెస్ట్ అయిన తర్వాత అల్లర్ల కారణంగా సిస్రాలో కర్ఫ్యూ విధించిన విషయం విదితమే. ఈ 10 రోజుల నుంచి డేరా స్కూళ్లన్నీ మూతపడిపోయాయి. ఒక్క సిస్రా డేరాలోనే కాదు.. చుట్టు పక్కల నెజియాకేరా, బెజెకన్, బెగూ గ్రామాల్లో కూడా డేరా స్కూళ్లు ఉన్నాయి. ఉద్రిక్త పరిస్థితులు ఇంకా సర్దుమణగకపోవటంతో వాటిని ఇంకా తెరవలేదు. దీంతో తమ పిల్లల భవిష్యత్తు ఏమౌతుందోనని విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు స్కూళ్ల రీ ఓపెన్ గురించి టీచర్లకు కూడా స్పష్టమైన సమాచారం లేదని చెబుతుండటంతో వాటిని మూసేశారా? అన్న అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఇప్పటికే తరగతులు ఆలస్యం అయ్యాయని, పరిస్థితి ఇలాగే కొన్ని రోజులు కొనసాగితే విద్యాసంవత్సరం నష్టపోయే అవకాశం ఉందని స్కూళ్ల ప్రిన్స్ పాల్ అసోషియేషన్ చెబుతోంది. దీంతో విద్యార్థులు, ఉపాధ్యాయులు బృందంగా మారి జిల్లా విద్యాధికారి మునిష్ నాగ్ పాల్ ను కలిసి విజ్ఞప్తి చేశారు. పరిస్థితులు సర్దుకుంటాయి... మరో 10 రోజులు వేచి చూడక తప్పదని మునిష్ వారిని కోరినట్లు తెలుస్తోంది. "పరిస్థితులు సర్దుకుంటాయనే నమ్మకం ఉంది. ఈ విషయన్ని ఇప్పటికే ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లా. విద్యార్థులకు తరగతులు ఏర్పాటు చేయమని కోరా'' అని మునిష్ చెబుతున్నారు. మొత్తం మూడు స్కూళ్లతోపాటు, రెండు జూనియర్ కళాశాలలు, ఓ బీఈడీ కాలేజీ కూడా డేరాలో ఉన్నాయి. వీటితోపాటు చుట్టుపక్కల ఉన్న మరికొన్ని స్కూళ్లతో కలిపి సుమారు 8000 మంది విద్యార్థులు డేరా స్కూళ్లల్లో విద్యనభ్యసిస్తున్నారు. అమ్మాయిల మిస్సింగ్ పై రియాక్షన్ డేరాలో చదువుతున్న స్థానికేతర విద్యార్థినిలను బాహ్యా ప్రపంచంతో సంబంధం లేకుండా చేయటంపై పలు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. తన కజిన్ ను కలవనీయకుండా అడ్డుకుంటున్నారంటూ పరిమిందర్ సింగ్ అనే వ్యక్తి ఇచ్చిన ఫిర్యాదు నేపథ్యంలో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. 20 ఏళ్ల యువతి రెండేళ్ల క్రితం బీఏ చదివేందుకు డేరా కాలేజీకి వెళ్లింది. అప్పటి నుంచి కుటుంబ సభ్యులతో ఆమెను కలవనీయకుండా అడ్డుకుంటున్నారు నిర్వాహకులు. కోర్సు పూర్తయిన తర్వాతే పంపిస్తామని తేల్చేశారు. మరోవైపు ఢిల్లీకి చెందిన ఓ వ్యక్తి కూడా తన కూతురి విషయంలో కూడా ఇలాగే వ్యవహరిస్తున్నారంటూ పోలీసులను ఆశ్రయించాడు కూడా. అయితే అమ్మాయిల తరపు నుంచి ఫిర్యాదు అందితేనే తాము స్పందిస్తామని అధికారులు చెబుతున్నారు. డేరాలో అమ్మాయిలపై గుర్మీత్ చేసిన అఘాయిత్యాల నేపథ్యంలో వారి నుంచి ఎలాంటి సమాచారం బయటికి పొక్కకుండా బంధీలను చేస్తున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. -
స్కూల్కు వెళ్లిన విద్యార్థినిలు అదృశ్యం
ఏలూరు: పశ్చిమగోదావరి జిల్లా బుట్టాయిగూడెంలోని స్థానిక ఉన్నత పాఠశాలకు చెందిన నలుగురు విద్యార్థినులు మంగళవారం అదృశ్యమైయ్యారు. దాంతో ఆ విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళన చెందుతూ... పోలీసులను ఆశ్రయించారు. నిన్న ఉదయం స్కూల్కు వెళ్లిన విద్యార్థులు సాయంత్రానికి ఇంటికి చేరలేదని ఆ విద్యార్థుల తల్లిదండ్రులు కన్నీరుమున్నీరు అవుతు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దాంతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. అందులోభాగంగా పోలీసులు విచారణ చేపట్టారు.