నిర్భయ తరహాలో మరో దారుణం
లక్నో: ఉత్తర ప్రదేశ్ లో నిర్భయ తరహాలో మరో దారుణం జరిగింది. యూపీలోని బరేలీలో దళిత బాలికపై అత్యాచారం చేసి, అనంతరం హత్య చేసిన ఘటన కలకలం రేపింది. పోలీసులు అందించిన వివరాల ప్రకారం గుర్తు తెలియని దుండగులు 12 ఏళ్ల బాలికపై అమానుషానికి పాల్పడి హతమార్చారు. దారుణంగా హింసించి, ఢిల్లీ నిర్భయ తరహాలో అఘాయిత్యానికి పాల్పడిన ఆనవాళ్లు ఉన్నాయని తెలిపారు. నిందితులు పరారీలో ఉన్నారని, దర్యాప్తు కొనసాగుతుందన్నారు. కేసు నమోదు చేసిన పోలీసులు మృతదేహాన్ని పోస్ట్ మార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు.