ముగ్గురు అమ్మాయిల అదృశ్యం
పటాన్చెరు టౌన్: వేర్వేరు ఘటనల్లో బుధవారం ముగ్గురు అమ్మాయిలు అదృశ్యమయ్యారు. వారిలో ఇద్దరు ఇంటర్ విద్యార్థినులు, ఒక సాఫ్ట్వేర్ ఉద్యోగిని ఉన్నారు. కళాశాలకు వెళుతున్నామని చెప్పి వెళ్లిన ఇద్దరు విద్యార్థినులు, ఇంట ర్వూ్యకని చెప్పిన సాఫ్ట్వేర్ ఉద్యోగిని కనిపించకుండా పోయారు. ఈ ఘటనలు సంగారెడ్డి జిల్లా పటాన్చెరు పోలీసు స్టేషన్ పరిధిలో చోటుచేసుకున్నాయి. ఎస్ఐ ప్రవీణ్ రెడ్డి కథనం ప్రకారం..పటాన్చెరు కృషి డిఫెన్స్ కాలనీకి చెందిన రాంరెడ్డి కూతురు శివాని గచ్చిబౌలిలో ఓ సాఫ్ట్వేర్ ఉద్యోగం చేస్తోంది. మంగళవారం ఉదయం 10 గంటలకు మరో ఉద్యోగానికి సంబంధించిన ఇంటర్వూ్య ఉందని ఇంట్లో చెప్పి వెళ్లింది. రాత్రి 8:45 గంటలకు తన స్నేహితుడు సాయికిరణ్ రెడ్డికి ఫోన్ చేసి తాను లింగంపల్లి వద్ద ఉన్నానని తన ఇంటి వద్ద దించాల్సిందని అడిగింది. దీంతో శివానిని లింగంపల్లి నుంచి తీసుకొచ్చి కృషి డిఫెన్స్ కాలనీ వద్ద దించినట్లు సాయి కిరణ్‌రెడ్డి తెలిపాడు. ఇంట ర్వూ్యకని చెప్పి వెళ్లిన తన కూతురు ఇంటికి రాలేదని తండ్రి రాంరెడ్డి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈ మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.
కళాశాలకని చెప్పి వెళ్లిన విద్యార్థినులు
మరో ఘటనలో పటాన్చెరు పట్టణంలోని ఎంజీ రోడ్డు లో ఉంటున్న ఆకుల వసంత, యాదగిరిల కూతురు ఆకుల ప్రశాంతి, ఆల్విన్ కాలనీకి చెందిన కృష్ణమూర్తి కూతురు చాకలి గాయత్రి ఇద్దరు కలసి మంగళవారం ఉదయం పట్టణంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలకు వెళ్తున్నామని చెప్పి ఇంటి నుంచి బయలుదేరి వెళ్లారు. రాత్రి ఎంత సేపటి కి ఇంటికి తిరిగి రాకపోవడంతో ఆకుల ప్రశాంతి, గాయత్రి ల తల్లిదండ్రులు తెలిసిన వారి ఇంటి వద్ద, బంధువుల ఇంటి వద్ద వెతికినా ఎలాంటి ఆచూకీ లభించలేదు. పోలీసు లు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.