స్పృహ తప్పిపడిపోయిన విద్యార్ధినిలు
కడప: యోగివేమన యూనివర్శిటీ బాలికల హాస్టల్లో 10 మంది విద్యార్ధినిలు కరెంట్ షాక్ కు గుయ్యారు. విద్యుదాఘాతానికి వీరు స్పృహ తప్పిపడిపోయారు. వీటిని వెంటనే రిమ్స్ ఆస్పత్రికి తరలించారు. వీరికి ప్రాణాపాయం లేదని వైద్యులు చెప్పినట్టు తెలుస్తోంది.
యూనివర్శిటీ సిబ్బంది నిర్లక్ష్యం కారణంగానే ఈ ప్రమాదం జరిగినట్టు విద్యార్థినులు ఆరోపిస్తున్నారు. భవిష్యత్ లో ఇటువంటి ప్రమాదాలు జరగకుండా చర్యలు తీసుకోవాలని వారు కోరుతున్నారు.