breaking news
girls photos
-
మార్ఫింగ్ ఫోటోలతో యువతులకు వేధింపులు
శ్రీనగర్, నొయిడా: తమ మాట వినటం లేదనే ఆగ్రహంతో మార్ఫింగ్ చేసిన ఫొటోలతో యువతులను వేధించటం మొదలుపెట్టారు. వాటిని భరించలేక బాధిత యువతులు పోలీసులను ఆశ్రయించారు. శ్రీనగర్, నొయిడాలో తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ ఘటన వివరాలివీ.. జమ్మూకశ్మీర్‌లో అనంతనాగ్ జిల్లా హిత్మూరా పట్టణానికి చెందిన అబ్రార్ అహ్మద్ స్థానిక యువతిని ప్రేమించాడు. వేరే కారణాలతో కొంతకాలం క్రితం వారిద్దరూ విడిపోయారు. అయితే, ఇది ఇష్టంలేని యువకుడు అహ్మద్ ఫేస్బుక్, వాట్సప్‌లలో ఉంచిన బాధితురాలి ఫొటోలను సేకరించాడు. ఫొటోషాప్ ద్వారా మార్ఫింగ్ చేసి యువతి చేతుల్లో మద్యం బాటిల్‌తోపాటు పిస్టల్‌ను ఉంచి యువతి మిత్రులకు పంపాడు. ఈ విషయం తెలిసిన బాధితురాలు ఈనెల 7వ తేదీన పోలీసులకు ఫిర్యాదు చేసింది. దర్యాప్తు చేపట్టిన పోలీసులు అహ్మద్‌ను అదుపులోకి తీసుకున్నారు. ఈ మేరకు అతనిపై 354-డి, 506 ఆర్పీసీ సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. మరో ఘటనలో...గ్రేటర్ నొయిడా బీటా-1 సెక్టార్‌కు చెందిన ఓ యువతి ఈమెయిల్ అకౌంట్ ఇటీవల హ్యాక్ అయింది. అందులో ఉన్న బాధితురాలి ఫొటోలను గుర్తు తెలియని వ్యక్తి కాపీ చేసుకుని, మార్ఫింగ్ చేశాడు. అశ్లీలకరంగా వాటిని మార్చివేయటంతోపాటు ఓ అసభ్యవీడియోలో కూడా ఆమె ఫొటోతో మార్ఫింగ్ చేసి ఫేస్బుక్లో అప్లోడ్ చేశాడు. విషయం తెలిసిన బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ మేరకు కేసు నమోదు చేసుకున్న సైబర్‌సెల్ పోలీసులు దర్యాప్తు చేపట్టారు. బాధితురాలికి బాగా సన్నిహితులైన వారే ఈ చర్యకు ఒడిగట్టి ఉంటారని అనుమానిస్తున్నారు. -
ప్రేమించకుంటే ఆ ఫొటోలు పోస్ట్ చేస్తా..
చెన్నై: ఫేస్బుక్లో అశ్లీల చిత్రాలతో ఆత్మహత్య చేసుకున్న సేలం జిల్లా యువతి వినుప్రియ దయనీయ ఉదంతం నుంచి తమిళనాడు ఇంకా తేరుకోకముందే మరో యువకుడు అలాంటి బెదిరింపులకే పాల్పడ్డాడు. అయితే పోలీసులు వెంటనే స్పందించడంతో కటకటాల పాలయ్యాడు. తిరునెల్వేలి జిల్లా కడైయనల్లూరు సమీపం కృష్ణాపురానికి చెందిన 23 ఏళ్ల యువతి సెల్‌ఫోన్‌కు కొన్ని నెలల క్రితం దిండుగల్లు జిల్లా సానర్పట్టికి చెందిన కాళిదాస్ (25) అనే యువకుడు మిస్డ్‌కాల్ ఇచ్చాడు. అప్పటి నుంచి స్నేహం పేరుతో తరచూ ఆమెకు ఫోన్లు చేసేవాడు. ఆ యువతి సైతం స్నేహపూర్వకంగా మాటలు కొనసాగించింది. ఈ దశలో తాను ప్రేమిస్తున్నానని గత వారం ఫోన్లో చెప్పగా ఆ యువతి నిరాకరించింది. ఆగ్రహించిన యువకుడు తన ప్రేమను అంగీకరించకుంటే ఫొటోను అశ్లీలంగా మార్ఫింగ్ చేసి ఫేస్బుక్లో పెడతానని యువతిని బెదిరించాడు. భయపడిన యువతి నల్లూరు పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసులు కాళిదాస్‌ను అరెస్ట్ చేసి, పాళయంగోట్టై సెంట్రల్ జైల్లో పెట్టారు.