Girls safety
-
వేధింపులు భరించలేకపోతున్నాం!
శ్రీకాకుళం , సోంపేట: మండలంలోని పలాసపురంలో ‘మిరియం బాలికల రక్షిత గృహం’ నిర్వాహకులు పిల్లలను వేధింపులకు గురిచేస్తున్నట్లు గుర్తిం చామని జిల్లా బాలల సంక్షేమ సమితి చైర్మన్ గరుగుబిల్లి నర్సింహమూర్తి తెలిపారు. శనివారం తమకు వచ్చిన వీడియో మెసేజ్ ఆధారంగా ఆదివారం రక్షిత గృహాన్ని ఆకస్మికంగా సందర్శించగా పలు విషయాలు వెలుగు చూశాయని స్థానిక విలేకరులకు వెల్లడించారు. నిర్వాహకుల దుస్తులు ఉతికించడం, వారు వినియోగించే మరుగుదొడ్లు కడిగించడం, నిర్వాహకుల పిల్లలకు స్నానాలు చేయించడం, మలమూత్ర విసర్జన చేసినప్పుడు కడగటం వంటి పనుల్ని చెబుతున్నారని బాలికలు వాపోయారని పేర్కొన్నారు. ఈ విషయాలను బయటకు చెబితే భోజనం పెట్టకుండా బెదిరించేవారని, బానిసలుగా చూస్తూ శారీరకంగా, మానసికంగా వేధించారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో నిర్వాహకులపై కఠిన చర్యలు తీసుకునేందుకు ముందుగా స్థానిక పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేస్తామన్నారు. పూర్తి నివేదికను నాలుగు రోజుల్లో జిల్లా బాలల సంక్షేమ సమితికి అందజేయాల్సిందిగా ఇచ్ఛాపురం చైల్డ్‌లైన్ బృందాన్ని ఆదేశించారు. తదుపరి చర్యలు తీసుకునేవరకు పిల్లలను ఏవిధమైన హింసకు గురిచేయవద్దని నిర్వాహకులను హెచ్చరించారు. జువైనల్ జస్టిస్ చట్టప్రకారం బాలల హక్కులను ఉల్లంఘించిన యాజ మాన్యంపై చట్టపరమైన చర్యలు తీసుకొని రక్షిత గృహం గుర్తింపును రద్దుచేసేందుకు చర్యలు తీసుకొంటామని చెప్పారు. కార్యక్రమంలో బాలల సం క్షేమ సమితి సభ్యులు బగాది శశిభూషణ్‌చౌదరి, రౌతు జ్యోతికుమారి, బద్దాల సురేష్,బాలల రక్షణ అ«ధికారి మెట్ట మల్లేశ్వరరావు, ఇచ్ఛాపురం చైల్డ్‌లై న్ పీసీ సుధీర్, ఆర్.ఝాన్సీ, పలాస చైల్డ్‌లైన్ ప్రాజె క్టు కో–ఆర్డినేటర్ క్రాంతికుమార్ పాల్గొన్నారు. -
అమ్మాయిలూ... వలలో పడకండి
బ్రిటన్ రాకుమారుడు ప్రిన్స్ విలియమ్స్‌కి అమ్మాయిల భద్రత గురించి బెంగ పట్టుకుంది. ‘‘గర్ల్స్.. ఎందుకలా మీరు సోషల్ మీడియాలో అస్తమానం రకరకాల పోజుల్లో కనిపిస్తారు? గుట్టుగా ఉండండి. లోకం ఎంత బూటకంగా ఉందో తెలుసా? మీరు ఏదో ఒక గొడవలో చిక్కుకుపోతారు. జాగ్రత్తగా ఉండండి’’ అని గురువారం లండన్‌లోని బర్లింగ్టన్ డేన్స్ అకాడమీలో మాట్లాడుతూ.. ఆడపిల్లల్ని హెచ్చరించారు ప్రిన్స్. ‘సైబర్ బుల్లీయింగ్’ గురించి ప్రసంగించేందుకు అకాడమీవాళ్లు ప్రిన్స్‌ని ప్రత్యేకంగా ఆహ్వానించిన సందర్భం అది. స్మార్ట్‌ఫోన్‌లో చిక్కుకుపోతే ఎవరికైనా సమస్యలు తప్పవు. అయితే అమ్మాయిలు మరింత అప్రమత్తంగా ఉండాలని ప్రిన్స్ ఉద్దేశం. ‘అవసరానికి మించి ఆన్లైన్లో ఉండకండి. బుల్లీయింగ్‌కి (టీజింగ్‌కి) గురికాకండి’ అని ప్రిన్స్ చెబుతున్నప్పుడు మీడియా ఆ పాయింట్‌కి ఎంతో ప్రాముఖ్యం ఇచ్చింది. సభలో ఉన్న మిగతా ప్రముఖులు ప్రిన్స్ ఎంతో అమూల్యమైన సూచన చేశారని అభినందించారు. నిజానికి రాజప్రసాదం కూడా సోషల్ మీడియాకు మొదట్నుంచీ దూరంగానే ఉంటుంది. ప్రిన్స్ విలియమ్స్ తమ్ముడు ప్రిన్స్ హ్యారీతో పెళ్లి ఫిక్స్ కాగానే మేఘన్ మార్కెల్.. సోషల్ మీడియాలోని తన అన్ని అకౌంట్లనూ ఇటీవలే క్లోజ్ చేసేశారు. అమ్మాయిలూ విన్నారు కదా! ఆచరించే వారు చెబితే ఎవరు మాత్రం వినకుండా ఉంటారు? -
ఇక గట్టి నిఘా
* బాలికల వసతిగృహాలలో భద్రత పెంపు * మొదటి దశగా గిరిజన హాస్టళ్లలో సీసీ కెమెరాలు * త్వరలోనే బీసీ, ఎస్సీ వసతి గృహాలలో అమలు * నివేదిక తయారు చేస్తున్న అధికారులు * త్వరలో బయోమెట్రిక్ మిషన్లు కూడా ఏర్పాటు * సిబ్బంది విధి నిర్వహణపైనా దృష్టి ఇందూరు : సంక్షేమ వసతి గృహాలలో బాలికల భద్రత కోసం పటిష్ట చర్యలు తీసుకోనున్నారు. ఇందుకోసం సీసీ కెమెరాలను ఏర్పాటు చేయాలని ప్రభుత్వం సంకల్పించింది. బాలికలుండే వసతిగృహాలలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా ఉండాలనేది దీని ఉద్దేశం. అనుమతి లేకుండా ఎవరైనా లోనికి చొరబడితే సీసీ కెమెరాలు ఇట్టే పట్టేస్తాయి. వార్డెన్, వర్కర్ల పనితీరు, బాలికల హాజరు శాతాన్ని పరిశీలిస్తారు. మొదటి దశలో గిరిజన బాలికల వసతి గృహాలలో సీసీ కెమెరాలను ఏర్పాటు చేస్తున్నారు. ఈ మేరకు జిల్లాలో ఎన్ని గిరిజన వసతి గృహాలున్నాయి.. అందులో బాలికల హాస్టళ్లు ఎక్కడెక్కడ ఉన్నాయి.. వసతి గృహాలలో ఉంటున్న బాలికల సంఖ్య త దితర వివరాలు తెలుపాలని జిల్లా అధికారులకు సంబంధిత శాఖ కమిషరేట్ నుంచి ఆదేశాలు జారీ అయ్యాయి. దీంతో అధికారులు నివేదికను సిద్ధం చేస్తున్నారు. తనిఖీలు ఇక తేలిక జిల్లాలో మొత్తం 17 గిరిజన సంక్షేమ వసతి గృహా లున్నాయి. ఇందులో నాలుగు బాలికల వసతి గృహాలు, కస్తూర్బా గాంధీ బాలికల పాఠశాల వసతి గృహాలు ఐదు ఉ న్నాయి. వీటిలో బాలికలకు భద్రత కరువైందని, ఆగంతకులు చొరబడటంతో అనుకోని ఘటనలు చోటు చేసుకుంటున్నాయని ప్రభుత్వం దృష్టికి వచ్చింది. వార్డెన్లు సక్రమంగా విధులకు వస్తున్నారా.. వర్కర్లు, బాలికలు ఏం చేస్తున్నారు.. ఎంత మంది ఉంటున్నారనే విషయాలను ఉన్నతాధికారులు తనిఖీలకు వెళ్లకుండా కార్యాలయం లోనే కూర్చుని పరిశీలించే అవకాశం ఉంటుంది. జిల్లాలో ఉన్న తొమ్మిది బాలికల వసతిగృహాలలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి జిల్లా అధికారుల కార్యాలయానికి అను సంధానం చేస్తా రు. ఈ నిఘా వ్యవస్థ ద్వారా బాలికలకు భద్రత పెరుగుతుంది. కొన్ని బాలికల వసతిగృహాలకు ప్రహరీలు నిర్మించకపోవడం మూలంగా రాత్రుల లో ఆ కతాయిల బెడద ఉంటుందని, దీంతో బాలి కలు భయం భయంగానే గడపాల్సి వస్తోందని పలువురు పేర్కొంటున్నారు. గిరిజన బాలికల వసతిగృహాల తర్వాత రెండో దశలో బీసీ, ఎస్సీ బాలికల వసతిగృహాలలోనూ సీసీ కెమెరాలు ఏర్పా టు చేసిన ఏర్పాటు చేయాలని ప్రభుత్వం యోచి స్తోంది. బయోమెట్రిక్ మెషిన్లు ఇదిలా ఉండగా, జిల్లాలోని 67 ఎస్సీ, 60 బీసీ వసతి గృహాలలో విద్యార్థుల మెస్ బిల్లుల అక్రమాలను అరికట్టేందుకు బయోమెట్రిక్ మిషన్లు అందజేయనున్నట్లు రెం డు నెలల క్రితం ప్రభుత్వం ప్రకటించింది. ఈ విధానాన్ని జిల్లాలోని 17 గిరిజన సంక్షేమ వసతిగృహాలలో కూడా అమలు చేసేం దుకు ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. విద్యార్థులు రాకున్నప్పటికీ హాజరు శాతం చూపించి వార్డెన్లు మెస్ బిల్లులను అక్రమంగా డ్రా చేసుకుంటున్నారనే అరోపణలు ముందునుంచి ఉన్నాయి. చాలా మం ది వార్డెన్లు దొరికిపోయారు కూడా. ఇలాంటి అక్రమాలకు చెక్ పెట్టేందుకు బయోమెట్రిక్ మెషిన్లు ఏర్పాటు చేయడానికి చర్యలు చేపడుతున్నారు. విద్యార్థులు హాస్టల్‌కు వెళ్లగానే ముందుగా మెషిన్ ద్వారా వేలి ముద్రలు ఇవ్వాలి, సాయంత్రం మరోసారి వేలి ముద్రలు ఇవ్వాలి. బయోమెట్రిక్ మెషిన్లో నమోదైన విద్యార్థుల సంఖ్య ఆధారంగానే సరుకులను వార్డెన్లు వాడాల్సి ఉంటుంది. బిల్లులు అదేవిధంగా విడుదల అవుతాయి.