గీతం విద్యార్థులకు టీసీఎస్ అవార్డులు
సాగర్‌నగర్, న్యూస్‌లైన్ : ఇంజినీరింగ్ విద్యలో అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన గీతం విద్యార్థులకు టాటా కన్సల్టెన్స్ సర్వీసెస్(టీసీఎస్) అవార్డులను ప్రకటించింది. అవార్డుల్లో భాగంగా ఒక్కొక్కరికి రూ.10 వేలు నగదుతోపాటు ప్రశంసా పత్రాన్ని సోమవారం టీసీఎస్ ఉపాధ్యక్షుడు వి.రాజన్న విద్యార్థులకు అంద జేశారు. కంప్యూటర్ సైన్స్ ఇంజినీరింగ్ విద్యార్థి కె.దివ్యతేజస్వికి(ఉత్తమ విద్యార్థి) టీసీఎస్ బంగారు పతకంతో పాటు రూ.10 వేలు నగదు అందజేశారు. బెస్ట్ స్టూడెంట్ ప్రొజెక్టు అవార్డును కౌసల్ కుమార్‌కు అందజేశారు. అవార్డులు పొందిన విద్యార్థులను గీతం అధ్యాపకులు, టీసీఎస్ ప్రతినిధులు అభినందించారు.
ఇన్ఫోటెక్ పోటీల విజేత అవినాష్ గుప్తా
హైదరాబాద్‌లో ఇటీవల జరిగిన ఇండియన్ ఏవియేషన్-2014 ఉత్సవాల్లో ఇన్ఫోటెక్ సంస్థ నిర్వహించిన ఇన్ఫోటెక్ ఓపెన్ ఇన్నోవేషన్ చాలెంజ్ పోటీల్లో గీతం ఏరోనాటికల్ ఇంజినీరింగ్ విద్యార్థి అవినాష్ గుప్తా విజేతగా నిలిచాడు.
గీతం విద్యార్థికి ఐఎన్‌ఓఐ గోల్డ్ మెడల్
గీతం వర్సిటీ ఇనుస్ట్రుమెంటేషన్ ఇం జినీరింగ్ ఆఖరి సంవత్సరం విద్యార్థి జి.మణికంఠ అరవింద్‌కు ప్రతిష్టాత్మకమైన ఇండియన్ ఇనుస్ట్రుమెంటేషన్ సొసైటీ ఆఫ్ ఇండియా వార్షిక అవార్డు లభించింది. బీటెక్‌లో అన్ని సబ్జెక్టుల లోనూ ఒకే ప్రయత్రంలో ఉత్తీర్ణులై రా ష్ట్రంలో అధిక మార్కులు సాధించిన వి ద్యార్థులకు ఏటా ఈ అవార్డులు అందజేస్తారు. ఈ అవార్డులను డి.వి.ఎస్ రాజు ఎండోమెంట్ మెడల్, సి.సీతారాజు ఎండోమెంట్ అవార్డు పేరిట ఈ సొసైటీ అవార్డులు అందజేస్తుందని గీతం అధ్యాపకులు తెలిపారు.