gla
-
మెర్సిడెస్.. మూడు లిమిటెడ్ ఎడిషన్లు
* ఏ-క్లాస్, జీఎల్ఏ, సీఎల్ఏ మోడళ్లలో * ధర రూ.25.95 లక్షల నుంచి రూ.35.26 లక్షల వరకూ న్యూఢిల్లీ: జర్మీన లగ్జరీ కార్ల కంపెనీ మెర్సిడెస్-బెంజ్ మూడు మోడళ్లలో స్పెషల్ లిమిటెడ్ ఎడిషన్ స్పోర్ట్స్ వేరియంట్లను మార్కెట్లోకి తెచ్చింది. ఏ-క్లాస్, జీఎల్ఏ, సీఎల్ఏ మోడళ్లలో స్పెషల్ ఎడిషన్ వేరియంట్లను అందుబాటులోకి తెచ్చామని మెర్సిడెస్ బెంజ్ ఇండియా ఎండీ, సీఈఓ రోలాండ్ ఫోలర్ చెప్పారు. ఇటీవల ప్రారంభమైన ప్రపంచ కప్ ఫుట్‌బాట్ పోటీల సందర్భంగా ఈ ప్రత్యేక స్పోర్ట్స్ వేరియంట్లను అందిస్తున్నామని పేర్కొన్నారు. వీటి ధరలు రూ.25.95 లక్షల నుంచి రూ. 35.26 లక్షల రేంజ్(అన్ని ధరలు ఎక్స్ షోరూమ్, ముంబై)లో ఉన్నాయని తెలిపారు. స్పోర్ట్స్ ఎడిషన్ బ్యాడ్జ్, స్పోర్ట్స్ పెడల్స్‌తో రూపొందిన ఈ వేరియంట్లు.. వచ్చే నెల 10 వరకే విక్రయాలకు అందుబాటులో ఉంటాయన్నారు. -
మెర్సిడెస్ బెంజ్ ‘లోకల్’ జీఎల్ఏ ఎస్యూవీ
♦ ధర 2 లక్షల వరకూ తగ్గుతుంది ♦ మూడో అసెంబ్లింగ్ లైన్ ఆరంభం పుణే: జర్మనీకి చెందిన లగ్జరీ కార్ల కంపెనీ మెర్సిడెస్ బెంజ్ గురువారం జీఎల్ఏ ఎస్యూవీను మార్కెట్లోకి తెచ్చింది. 60 శాతం స్థానికంగా తయారైన విడిభాగాలతోనే ఈ కారును తయారు చేశామని మెర్సిడెస్ బెంజ్ కంపెనీ తెలిపింది. భారత్‌లోనే అసెంబుల్ చేసిన తమ ఆరవ మోడల్ ఇదని మెర్సిడెస్-బెంజ్ ఇండియా ఎండీ, చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఇబెర్‌హర్డ్ కెర్న్ చెప్పారు. ఇక్కడకు సమీపంలోని చకన్ ప్లాంట్‌లో మూడవ అసెంబ్లీ లైన్‌ను లాంఛనంగా ప్రారంభించామని పేర్కొన్నారు. దిగుమతి చేసుకున్న జీఎల్ఏ ఎస్‌యూవీల ధర రూ.31.31-34.25 లక్షల రేంజ్లో ఉంటాయని, ఇక ఇప్పుడు వీటిని స్థానికంగానే అసెంబుల్ చేస్తున్నందున వీటి ధరలు రూ.1.5 లక్షల నుంచి రూ.2.5 లక్షల వరకూ తగ్గుతాయని వివరించారు. భారత్‌లో తమ వార్షిక అసెంబ్లింగ్ సామర్థ్యం 10 వేల కార్లని, రూ.150 కోట్ల పెట్టుబడులతో ఏర్పాటు చేసిన ఈ మూడో అసెంబ్లీ లైన్‌తో ఈ సంఖ్య రెట్టింపై 20,000కు చేరుతుందని పేర్కొన్నారు. ఇంత ఎక్కువ స్థాయి స్థాపిత ఉత్పాదక సామర్థ్యమున్న ఏకైక లగ్జరీ కంపెనీ తమదేనని పేర్కొన్నారు. భారత్‌లో 1994 నుంచి కార్యకలాపాలు నిర్వహిస్తున్నామని, ఇప్పటిదాకా రూ.1,000 కోట్లు పెట్టుబడులు పెట్టామని వివరించారు. భారత్‌లో ఇంత ఎక్కువగా పెట్టుబడులు పెట్టిన ఏకైక లగ్జరీ కార్ల కంపెనీ కూడా తమదేనని పేర్కొన్నారు.