Gladstone Institute
-
పరి పరిశోధన
కొత్త కాంక్రీట్‌తో జల సంరక్షణ సులువు! వాన చినుకులన్నీ నేలలోకి ఇంకితే భూగర్భ జలం వృద్ధి చెందుతుంది. అందరికీ మేలు జరుగుతుంది. కానీ.. నగరాల్లో అంగుళం ఖాళీ లేకుండా వేసే కాంక్రీట్ రోడ్ల కారణంగా నీరంతా కొట్టుకుపోతోంది. అయితే వాషింగ్టన్ స్టేట్ యూనివర్శిటీ శాస్త్రవేత్తల పరిశోధనల కారణంగా ఈ చిక్కు సమస్య త్వరలోనే పరిష్కారం కానుంది. దృఢమైన కాంక్రీట్ ద్వారా కూడా నీళ్లు సులువుగా జారిపోయేలా వీరు ఓ కొత్త టెక్నాలజీని అభివృద్ధి చేయడం దీనికి కారణం. ఏటికేడాదీ పెరిగిపోతున్న కార్బన్ ఫైబర్ వ్యర్థాలతోనే ఈ ఘనతను సాధించడం విశేషం. కాంక్రీట్ ద్వారా నీరు కొద్దిమోతాదులో ఇంకేందుకు అవకాశమున్నప్పటికీ ఇది కాస్తా కాంక్రీట్ దృఢత్వంపై ప్రభావం చూపుతుంది. కొద్దికాలానికే కాంక్రీట్ కొట్టుకుపోతుంది. ఈ నేపథ్యంలో కార్ల్ ఇంగ్లండ్, సొమాయా నాసిరీలు కార్బన్ ఫైబర్ వ్యర్థాలతో కొత్త రకం కాంక్రీట్‌ను తయారు చేశారు. ఇది దృఢంగా ఉండటమే కాకుండా సాధారణ కాంక్రీట్ కంటే ఎక్కువ మోతాదులో నీరు భూమిలోకి ఇంకేలా రంధ్రాలు కలిగి ఉన్నట్లు శాస్త్రవేత్తలు గుర్తించారు. పరిశోధన శాలలో ఈ కొత్త కాంక్రీట్ బాగా పనిచేసినప్పటికీ.. సాధారణ పరిస్థితుల్లో ఎలా వ్యవహరిస్తుందో పరీక్షించాల్సి ఉందని.. ఆ తరువాత విస్తృత స్థాయి వాడకానికి సిద్ధం చేయవచ్చునని నాసిరీ అంటున్నారు. దెబ్బతిన్న గుండెను సరిచేసేందుకు కొత్త పద్ధతి తోక తెగిపోతే మళ్లీ పెంచుకోగల శక్తి బల్లులకు సొంతం. అలాగే కొన్ని రకాల చేపలు తమ గుండె కణజాలాన్ని మళ్లీ అభివృద్ధి చేసుకోగలవు. మనిషికీ ఇలాంటి శక్తి ఉంటే.. అనేక గుండెజబ్బులకు మెరుగైన, సులువైన చికిత్స సాధ్యమవుతుంది. ఇప్పుడు ఈ పనిలోనే ఉన్నారు గ్లాడ్స్టోన్స్ ఇన్స్టిట్యూట్కు చెందిన వివేక్ శ్రీవాస్తవ. మన శరీరంలో కార్డియోమయోసైట్స్ అనే కణాలు కొన్ని ఉంటాయి. పిండ దశలో గుండె ఏర్పడేందుకు గణనీయంగా విభజితమయ్యే ఈ కణాలు.. ఆ తరువాత మాత్రం విభజనకు గురికావు. కార్డియోమయోసైట్స్కు మళ్లీ ఆ శక్తిని అందించేందుకు శాస్త్రవేత్తలు దశాబ్దాలుగా ప్రయత్నాలు చేస్తున్నారు. తాజాగా వివేక్ శ్రీవాస్తవ ఇందులో విజయం సాధించారు. జంతువులపై చేసిన ప్రయోగాల్లో కార్డియోమయోసైట్స్ విభజితమవడమే కాకుండా దెబ్బతిన్న గుండె కణజాలాన్ని మరమ్మతు కూడా చేసినట్లు శ్రీవాస్తవ ప్రకటించారు. కార్డియోమయోసైట్స్ విభజనకు సంబంధించి మొత్తం నాలుగు జన్యువులు పనిచేస్తున్నట్లు గుర్తించిన ఈయన వాటిని పూర్తిస్థాయిలో పనిచేసేలా చేయడం ద్వారా కణాలు వేగంగా విభజితమయ్యేలా చేయగలిగారు. కార్డియోమయోసైట్స్ విభజనను కచ్చితంగా నియంత్రించడం ఎలాగో అర్థం చేసుకోవడం ద్వారా ఈ పద్ధతిని మనుషుల్లోనూ ఉపయోగించవచ్చునని, తద్వారా గుండె పనిచేయని స్థితికి చేరుకున్న వారికీ సాంత్వన చేకూర్చడం వీలవుతుందని శ్రీవాస్తవ అంటున్నారు. వెలుగులు ఒడిసి పడతాయి... సూర్యుడి నుంచి వెలువడే వెలుగును వంద శాతం విద్యుత్తుగా మారిస్తే.. ఈ భూమ్మీద పెట్రోలు, డీజిల్ వంటివి అస్సలు అవసరం ఉండదు. కాకపోతే ఎంతటి గొప్ప సోలార్ ప్యానెలైనా కేవలం 25 శాతాన్ని మాత్రమే విద్యుత్తుగా మార్చగలవు. ఈ నేపథ్యంలో జర్మనీలోని బ్రాన్ష్వెగ్ విశ్వవిద్యాలయ శాస్త్రవేత్తలు ఓ వినూత్నమైన ఆవిష్కరణ చేశారు. అన్ని దిక్కుల నుంచి వెలుతురును తీసుకుని అతితక్కువ ప్రదేశంలోకి కేంద్రీకరించగలిగే సరికొత్త పరికరాన్ని అభివృద్ధి చేశారు. వీటిని వరుసగా పేర్చడం ద్వారా సూర్యకిరణాల్లోని అన్నిరకాల కాంతిని విద్యుత్తుగా మార్చవచ్చు. ఈ పరికరం మొక్కల్లో వెలుతురును ఒడిసిపట్టే కణాల మాదిరిగా పనిచేస్తుందని ఫోటాన్లను శోషించుకుని ఇతర కణాలకు చేరవేస్తాయని ఈ పరిశోధనల్లో పాలుపంచుకున్న శాస్త్రవేత్త పీటర్ జోమో వల్లా తెలిపారు. దాదాపు 80 శాతం కాంతిని చిన్న ప్రదేశంలోకి కేంద్రీకరించగల ఈ పరికరాలతో భవిష్యత్తులో అతితక్కువ ఖర్చుతో ఎక్కువ విద్యుత్తును ఉత్పత్తి చేయగల సోలార్ కాన్సెంట్రేటర్స్ను తయారు చేయవచ్చునని ఆయన వివరించారు. ప్రస్తుతం తాము నీలిరంగు కాంతిని శోషించుకుని మళ్లించగలిగేలా చేయగలిగామని.. ఇతర రంగులకు కూడా ఈ పద్ధతిని విస్తరించేందుకు ప్రయత్నాలు చేస్తున్నామని అన్నారు. -
గుండెపోటులో చచ్చుబడే కండరానికీ పునరుజ్జీవం!
హెల్త్ ల్యాబ్ గుండెపోటు వచ్చినప్పుడు గుండె కండరానికి రక్తం అందక అది క్రమంగా చచ్చుబడిపోతుందన్నది తెలిసిందే. ఇప్పటివరకూ అలా చచ్చుబడిపోయిన కండరాన్ని మళ్లీ పునరుద్ధరించే మందులేమీ లేవు. కానీ అలా జరిగిన సందర్భాల్లో పనిచేసే రెండు సరికొత్త రసాయనాలను సైంటిస్టులు కనుగొన్నారు. ఇది నిజంగా శుభవార్తే. శాన్ఫ్రాన్సిస్కోలోని గ్లాడ్‌స్టోన్ ఇన్స్టిట్యూట్కు చెందిన సైంటిస్టులు 5,500 రకాల రసాయనాలను పరిశీలించి ఈ విషయాన్ని తెలుసుకున్నారు. గుండెపోటు వచ్చిన రోగుల్లో గుండె కండరానికి రక్తప్రసరణ నిలిచిపోవడంతో ఆ కండరంలోని కొంతభాగం చచ్చుబడిపోతుంది. అలా చచ్చుబడ్డ కండరాలు గుండెపై ఒక గాయం (స్కార్)లా ఏర్పడతాయి. ఆ స్కార్ ఉన్నచోట కణాలు నిర్జీవమైనట్లుగా మారతాయి. దాంతో గుండెవైఫల్యం (హార్ట్ ఫెయిల్యూర్) కూడా వస్తుంది. కానీ ఇలా జరిగిన కండర ప్రాంతంలో కణాలను పునరుజ్జీవించేలా చేయవచ్చునని గ్లాడ్‌స్టోన్ పరిశోధన సంస్థ నిపుణులు పేర్కొంటున్నారు. ఇప్పటికే ఎలుకల మీద జరిగిన ఈ పరిశోధనలు విజయవంతమయ్యాయని పేర్కొన్నారు. ఇలా గుండె కండరాలు చచ్చుబడిపోయిన కొన్ని ఎలుకలకు ఈ రసాయనాలు ఇచ్చి చూశారు. దాంతో ఆ కండరాలు మళ్లీ పునరుత్తేజితం అయ్యాయి. గ్లాడ్‌స్టోన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ కార్డియోవాస్క్యులార్ డిసీజెస్ డెరైక్టర్ డాక్టర్ దీపక్ శ్రీవాత్సవ ఈ పరిశోధన వివరాలను వెల్లడిస్తూ ‘‘ఇది ప్రస్తుతం అందుబాటులో ఉన్న చికిత్స కంటే మరింత సమర్థంగా పనిచేస్తుందని ఆశిస్తున్నాం’’ అని పేర్కొన్నారు. ప్రోస్టేట్ క్యాన్సర్ చికిత్స కోసం సరికొత్త ఇంజెక్షన్! ప్రస్తుతం ప్రోస్టేట్ క్యాన్సర్ చికిత్సకు సర్జరీతో పాటు రేడియోథెరపీ, కీమోథెరపీ చేస్తున్నారు. ఇందులో కీమో, రేడియోథెరపీలకు చాలా రకాల చికిత్సల్లో చాలా దుష్ర్పభావాలు కనిపిస్తుంటాయి. కానీ బ్రిటిష్ సైంటిస్టులు కొత్త రకం ఇంజెక్షన్‌ను రూపొందించే పనిలో ఉన్నారు. దీనివల్ల చాలా రకాల సైడ్‌ఎఫెక్ట్‌లు, అనర్థాలను నివారించవచ్చని అంటున్నారు బ్రిటన్ శాస్త్రవేత్తలు. యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ లండన్‌కు చెందిన కొందరు పరిశోధకులు ఈ ఇంజెక్షన్‌ను రూపొందించే పనిలో ఉన్నారు. ఇద విజయవంతం అయ్యే అవకాశాలు చాలా ఎక్కువగా కనిపిస్తున్నట్లుగా వారు పేర్కొంటున్నారు. ఈ ఇంజెక్షన్ వల్ల ఒంట్లోకి చేరే రసాయనాలు కేవలం క్యాన్సర్ కణజాలాన్ని మాత్రమే టార్గెట్ చేస్తాయట. పక్కనున్న ఆరోగ్యకరమైన కణాల జోలికి అస్సలు వెళ్లవు అంటున్నారా పరిశోధకులు. అయితే ఈ కొత్త రకం ఇంజెక్షన్లు అందుబాటులోకి రావడానికి కొంతకాలం పడుతుందంటున్నారు. ఈ పరిశోధన ఫలితాలను ఇటీవల లివర్‌పూల్‌లోని నేషనల్ క్యాన్సర్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ (ఎన్సీఆర్ఐ)లో జరిగిన ఒక కాన్ఫరెన్స్‌లో నివేదించారు. ఇక లండన్‌లోని క్వీన్ మేరీ యూనివర్సిటీ పరిశోధకులు మరో రకం పరిశోధనలనూ చేస్తున్నారు. మరింత తేలిగ్గా ప్రోస్టేట్ క్యాన్సర్‌ను కనుగొనే రక్తపరీక్ష విధానాన్ని వారు కొద్ది రోజుల క్రితమే అభివృద్ధి చేస్తున్నట్లు పేర్కొన్నారు. మలబద్ధకం వల్ల కొత్త అనర్థం! మీకు మలబద్ధకం ఉందా? తగ్గించుకోడానికి కాస్త ఎక్కువగా ప్రయత్నించండి. ఎందుకంటే ఇప్పుడు మలబద్ధకం వల్ల మరో అనర్థం రాబోతోందని కొత్తగా తెలిసింది. మలబద్ధకం ఉన్నవాళ్లలో 10 శాతం మందికి మూత్రపిండాల వైఫల్యం (కిడ్నీ ఫెయిల్యూర్) వచ్చే అవకాశాలు ఉన్నాయంటున్నారు నిపుణులు. మరో 13 శాతం మందిలో క్రానిక్ కిడ్నీ డిసీజ్ (సీకేడీ) వచ్చే అవకాశం ఉందని హెచ్చరిస్తున్నారు. మరీ ఎక్కువగా ముక్కడం వల్ల మూత్రపిండాలపై దుష్ర్పభావం చూపుతుందని వారు పేర్కొంటున్నారు. మెంఫిస్ ఏవీ మెడికల్ సెంటర్లోని నెఫ్రాలజీ విభాగం చీఫ్ అయిన డాక్టర్ స్కాబా కోవెస్డీ ఈ విషయాన్ని పేర్కొన్నారు. ఈ పరిశోధన బృందానికి నేతృత్వం వహిస్తున్న డాక్టర్ స్కాబా ఈ అంశాన్ని వెల్లడిస్తూ... ‘‘ఇదేమీ ఆశ్చర్యకరమైన విషయం కాదు. గతంలో మలబద్ధకం గుండెజబ్బులతో సహా కొన్ని ఇతర అనర్థాలను తెచ్చిపెడుతుందని ఊహించాం. అయితే అది కలగజేసే అనర్థాల్లో ఇదీ ఒకటి అని తెలిసింది’’ అని పేర్కొన్నారు డాక్టర్ స్కాబా కోవెస్డీ. అయితే ఆహారంలో పీచుపదార్థాలు పుష్కలంగా తీసుకోవడం వల్ల మలబద్ధ్దకాన్ని నివారించడం ద్వారా మరెన్నో వ్యాధులనూ నివారించవచ్చని నిర్ద్వంద్వంగా తెలిసిందని పరిశోధకులు పేర్కొంటున్నారు. అలాగే సాఫీగా విరేచనం కావడానికి మందుల కంటే ఒంటికి మేలు చేసే స్వాభావికమైన ఆహారాలు (పుష్కలంగా ఆకుకూరల వంటివి) ఎక్కువగా తీసుకోవాలని కూడా వారు చెబుతున్నారు. దాంతో మూత్రపిండాల జబ్బునూ నివారించవచ్చని వారి సూచన. -
గుండె, మెదడు కణాల ప్రతిసృష్టి
వాషింగ్టన్: మానవుని గుండె, మెదడు లాంటి అవయవ కణాలను సృష్టించడం సాధ్యమేనని శాస్త్రవేత్తలు నిరూపించారు. రసాయనాల మిశ్రమం వినియోగించి చర్మం కణాలతో గుండె, మెదడు సంబంధిత కణాలను తయారు చేయవచ్చని గ్లాడ్‌స్టోన్ ఇన్స్టిట్యూట్ పరిశోధకుల ప్రయోగాల్లో తేలింది. ఈ ప్రతిసృష్టి సాలమండర్(బల్లిజాతి) జీవిలో మాదిరే ఉంటుందని పరిశోధకులు చెప్పారు.