వాషింగ్టన్: మానవుని గుండె, మెదడు లాంటి అవయవ కణాలను సృష్టించడం సాధ్యమేనని శాస్త్రవేత్తలు నిరూపించారు. రసాయనాల మిశ్రమం వినియోగించి చర్మం కణాలతో గుండె, మెదడు సంబంధిత కణాలను తయారు చేయవచ్చని గ్లాడ్‌స్టోన్ ఇన్‌స్టిట్యూట్ పరిశోధకుల ప్రయోగాల్లో తేలింది. ఈ ప్రతిసృష్టి సాలమండర్(బల్లిజాతి) జీవిలో మాదిరే ఉంటుందని పరిశోధకులు చెప్పారు.