UP Global Investors Summit 2023 యూపీపై అంబానీ వరాల జల్లు, వేల కోట్ల పెట్టుబడులు
లక్నో: యూపీ గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్ 2023 సందర్భంగా పారిశ్రామిక వేత్త, రిలయన్స్ అధినేత ముఖేశ్ అంబానీ ఉత్తరప్రదేశ్‌పై వరాల జల్లు కురిపించారు. రానున్న నాలుగేళ్లలో రాష్ట్రంలో లక్ష ఉద్యోగాలను సృష్టించేందుకు, అదనంగా రూ.75,000 కోట్లు పెట్టుబడి పెట్టాలని యోచిస్తున్నట్టు తెలిపారు. జియో, రీటైల్, రెన్యూవల్, రంగంలో ఈ ఉద్యోగాలు లభిస్తాయని అంబానీ ప్రకటించారు.
రానున్న పది నెలల్లో (డిసెంబరు,2023 నాటికి యూపీలోని మూలమూలకు జియో 5జీ సేవలను అందుబాటులోకి తీసుకొస్తామని ముఖేశ్ అంబానీ చెప్పారు. అంతేకాదు ఉత్తరప్రదేశ్ దేశంలోని 'ఉత్తమ్' ప్రదేశ్‌గా అభివృద్ధి చెందుతోందంటూ కితాబిచ్చారు. ఉద్యోగ, సహయోగ్ కలబోతగా అభివృద్ధి బాటలో యూపీ పయనిస్తోందిన్నారు.
రిలయన్స్ రిటైల్ ద్వారా ఉత్తర ప్రదేశ్ వ్యవసాయ, వ్యవసాయేతర కొనుగోళ్లను పెంచుతాంమనీ, కొత్త బయో ఎనర్జీ వ్యాపారాన్ని ప్రారంభించనున్నామని కూడా ప్రకటించారు.ఈ సందర్భంగా యూనియన్ బడ్జెట్ 2023-24 ఇండియా అభివృద్ధి చెందిన దేశంగా ఆవిర్భవించడానికి పునాది వేసిందని అంబానీ ప్రశంసించారు.
కాగా శుక్రవారం ఫిబ్రవరి 10నుంచి మూడు రోజుల పాటు 2023న లక్నోలో జరగనున్న ఉత్తరప్రదేశ్ గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్ 2023కు ముఖ్య అతిధి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ హాజరయ్యారు. ఈ సందర్బంగా ఏర్పాటు చేసిన ఎగ్జిబిషన్‌ను ప్రధాని ప్రారంభించారు ఈ కార్యక్రమంలో రక్షణమంత్రి రాజ్‌నాథ్ సింగ్, యూపీ గవర్నర్ ఆనందీబెన్ పటేల్, ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్, ప్రముఖ వ్యాపారవేత్తలు, పెట్టుబడిదారులు తదితరులు పాల్గొన్నారు