Gmail inbox
-
Gmail: మెమెరీ ఫుల్ కాకుండా ఉండాలంటే.. ఇలా చేస్తే సరి
Gmail Storagefull Issue: ఇబ్బడిముబ్బడిగా వచ్చే ఈ మెయిల్స్, అవసరం తీరిపోయినా ఇన్‌బాక్స్‌లో అలాగే ఉండి పోయే ఈ మెయిల్స్‌తో జీమెయిల్ ప్రీ మెమెరీ స్పేస్ త్వరగా పూర్తయిపోయి ఇబ్బందులు పడుతున్నారా? అనవసరపు ఈ మెయిల్స్ ఆటోమేటిక్‌గా డిలిల్ అయితే బాగుండు అనుకుంటున్నారా? అయితే జీ మెయిల్ ఆప్షన్స్‌లోకి వెళ్లి ఈ కమాండ్స్ ఇవ్వండి.. మీ సమస్యకు పరిష్కారం లభిస్తుంది. ఇన్‌బాక్స్ క్లీనింగ్ అవసరం ఉన్న ఇమెయిల్స్ సంగతి సరే, అక్కరలేనివి కూడా తరచుగా వస్తుంటాయి. వాటిని ఎప్పటికప్పుడు డిలిట్ చేయాలనుకుంటాంగానీ మరిచిపోతుంటాం. దీని వల్ల వృథా స్థలంతో ఇన్‌బాక్స్ భారమైపోతుంది. ఇన్‌బాక్స్ క్లీన్ చేయడానికి, అక్కరలేని ఇమెయిల్స్ వాటికవే డిలిట్ కావడానికి ఈ స్టెప్స్ ఫాలో అవండి - జీమెయిల్ ఓపెన్ చేయండి. - సెర్చ్బార్లో కనిపించే ఫిల్టర్స్ ఐకాన్‌ను నొక్కండి - టాప్‌లో కనిపించే ‘ఫ్రమ్’లో మీకు ముఖ్యం కాని పేరు లేదా ఇమెయిల్ అడ్రస్‌ను టైప్ చేయండి - క్రియేట్ ఫిల్టర్‌ను క్లిక్ చేసి ‘డిలిట్ ఇట్’ను సెలెక్ట్ చేయండి - మరోసారి అక్కడి పేజీలో క్రియేట్ ఫిల్టర్‌ను క్లిక్ చేయండి చదవండి: జీమెయిల్ సరికొత్త రికార్డు..! ప్రపంచజనాభా కంటే ఎక్కువగా..! -
జీ మెయిల్: స్పామ్ మెసేజ్ రాకుండా..
జీ మెయిల్ గురించి తెలియని వారుండరు. ప్రపంచ వ్యాప్తంగా ఎంతో మంది నెటిజన్లు జీ మెయిల్ వినియోగదారులే. అయితే ఇప్పుడు జీ మెయిల్లో ఓ సమస్య అందరికి తలనొప్పిగా మారింది. అదే స్పామ్. మన ప్రమేయం లేకుండానే మన అకౌంట్లోకి కుప్పులు తెప్పలుగా మెయిల్స్ వస్తూనే ఉంటాయి. జీ మెయిల్ ఇప్పటికే అనవసర మెయిల్స్‌ను విభజించి వాటిని స్పామ్ ఫోల్డర్‌కు పంపుతుంది. అవి 30 రోజుల తర్వాత డిలీట్ అవుతాయి. అయితే అన్ని అనవసర మెయిల్స్‌ను స్పామ్ ఫోల్డర్‌కు పంపడం సాధ్యం కాదు. కొన్నిసార్లు స్పామ్ మెయిల్స్ డైరెక్ట్ ఇన్‌బాక్స్‌లోకే వచ్చేస్తుంటాయి. గత వారం నుంచి ఈ సమస్య మరింత తీవ్రతరం అవడంతో గూగుల్ ఆ సమస్యకు పరిష్కారం కనుగొంది. వీటిని మనం రాకుండా ఉండేందుకు కొన్ని రకాల టిప్స్ ఇక్కడున్నాయి. (జీమెయిల్ ద్వారా కూడా వీడియో కాల్స్) 1. రిపోర్టు, బ్లాక్ .మనకు కొన్ని అకౌంట్ల నుంచి ఎక్కువగా స్పామ్ మెయిల్స్ వస్తుంటాయి. వాటని రిపోర్ట్ లేదా బ్లాక్ చేయడం ద్వారా మళ్లీ ఆ మెయిల్స్ రాకుండా ఉంచవచ్చు. ఇందుకు సంబంధిత మెయిల్‌ను ఓపెన్ చేసి కుడి వైపు పైన కనిపించే మూడు చుక్కల బటన్‌ను నొక్కి అక్కడ ఉండే స్పామ్ రిపోర్టును నొక్కితే చాలు. అలాగే పంపించిన వారిని బ్లాక్ చేసినా సరిపోతుంది. (గూగుల్ సెర్చ్ హెడ్‌గా ప్రభాకర్ రాఘవన్) 2. మెసేజ్‌లను ఫిల్టర్ చేయడం మెయిల్‌ను స్పామ్‌గా రిపోర్ట్ చేయకూడదనుకుంటే, లేదా పంపినవారిని బ్లాక్ చేయకపోతే అలాంటి మెసేజ్‌లను ఫిల్టర్ చేయవచ్చు. దీని ద్వారా భవిష్యత్తులో మీ ఇన్‌బాక్స్‌లోకి ఇలాంటి మెసేజ్‌లు రాకుండా ఉండేందుకు సహాయపడుతుంది. దీనికి కూడా ముందుగా చెప్పినట్లు కుడి వైపు కనిపించే మూడు చుక్కల బటన్‌ను నొక్కి ఫిల్టర్ మెసేజెస్ లైక్ దిస్ అనే ఆప్షన్ క్లిక్ చేయాలి. కాగా ఫిల్టర్ కోసం కొన్ని పదాలు, సైజ్, అటాచ్మెంట్స్ వంటి మరిన్ని వివరాలను కూడా మెయిల్స్‌కు జోడించవచ్చు. ఆ తర్వాత ఈ ఫిల్టర్ చేసిన మెయిల్స్‌ను ఆర్కైవ్ చేయడం, డిలీట్ చేయడం , పొటెన్షియల్ స్పామ్‌గా లేబుల్ చేయడం చేయవచ్చు. -
జీమెయిల్ ఇన్‌బాక్స్ ఫీచర్లు భలే!
ఈ కాలంలో ఈ మెయిల్ లేకుండా పని అస్సలు నడవదు. కానీ పని పెరిగిన కొద్దీ మెయిల్ ఇన్‌బాక్స్ కూడా గందరగోళమైపోతుంది. అవసరమైన మెయిల్ సమయానికి చిక్కదు. ఏది ఉంచుకోవాలో, ఏది తొలగించుకోవాలో తెలియని స్థితిలో అన్ని మెయిళ్లూ పేరుకుపోయి చికాకు పెడుతూంటాయి. ఈ ఇబ్బందుల నుంచి కొంతైనా ఉపశమనం పొందాలనుకుంటున్నారా? అయితే వెంటనే జీమెయిల్ ఇన్‌బాక్స్‌ను వాడటం మొదలుపెట్టండి. ఇటీవలే ప్రవేశపెట్టిన ఈ సరికొత్త మెయిల్లోని ఫీచర్లు భలేగా ఉన్నాయి. అవేమిటో మీరూ చూసేయండి మరి... ‘పిన్’లతో మతిమరుపునకు చెక్!: ముఖ్యమైన మెయిళ్లకు రిప్లై ఇవ్వడం మరచిపోతున్నారా? అయితే పిన్ ఫీచర్ గురించి మీకు తెలియదన్నమాట. ఇన్‌బాక్స్‌లో ఉన్న ఈ ఫీచర్‌ను వాడుకుంటే మీ మతిమరుపునకు అది ఎప్పటికప్పుడు చెక్ పెడుతుంది. మీరు గుర్తుంచుకోవాలని అనుకుంటున్న మెయిల్‌పై కర్సర్‌ను కదిలిస్తే పిన్ కనిపిస్తుంది. దాన్ని ఒక్కసారి మెయిల్‌పై నొక్కితే చాలు.. అ తరువాత ఆ మెయిల్ ఇన్‌బాక్స్ మొదట్లో, మధ్యలో ప్రత్యేకంగా వేలాడుతూ కనిపిస్తుంటుంది. మీ దృష్టిని ఆకర్షిస్తుంది. పిన్ తొలగించేంతవరకూ అలాగే ఉంటుంది. దీంతో మీరు కచ్చితంగా ఈ మెయిల్‌కు స్పందించకమానరు. స్వీప్ చేసేస్తుంది మెయిళ్లన్నింటినీ ఒక్కసారిగా బండిల్ చేసి ఆర్కైవ్స్‌లో పడేసేందుకు పనికొచ్చే ఫీచర్ ఇది. సోషల్ నెట్వర్కింగ్ సైట్ల నుంచి వచ్చే ఇన్విటేషన్లుగానీ ఇతర సమాచారాన్ని గానీ గంపగుత్తగా ఇన్‌బాక్స్ నుంచి వేరు చేసుకునేందుకు ఉపయోగపడుతుంది. ఒక్కో మెయిల్‌ను చూసి భద్రపరచుకోవాలా? వద్దా? అన్నది నిర్ణయించుకునే అవసరం తప్పుతుందన్నమాట. ఒకవేళ మీరు పొరబాటున ముఖ్యమైన మెయిళ్లతో (పిన్ చేసినవి) కలిపి స్వీప్ చేసినా... ఆ మెయిళ్లు మినహా మిగిలినవి మాత్రమే బండిల్ అవడం విశేషం. కట్టకట్టేసి ఇన్‌బాక్స్‌లో ఉన్న మరో మంచి ఫీచర్ బండిల్! పేరులో ఉన్నట్లే ఈ ఫీచర్ మన మెయిళ్లన్నింటినీ ప్రైమరీ, సోషల్, ప్రమోషన్స్ అన్న మూడు వర్గాలుగా విభజించి చూపుతుంది. ఫేస్బుక్, ట్విట్టర్ వంటి సోషల్ నెట్వర్కింగ్ సైట్ల సమాచారం, పోస్ట్‌లు అన్నీ సోషల్ ట్యాబ్ కింద, కంపెనీలు పంపే వ్యాపార మెయిళ్లన్నీ ప్రమోషన్‌లోనూ పడిపోతాయి. ఇవేకాకుండా ట్రావెల్, ఫైనాన్స్, పర్చేజెస్, అప్డేట్స్ అన్న ఇతర కేటగిరీలుగానూ విభజించుకునే వెసులుబాటు ఉంది. జాబితాలోనే మెయిల్ లింక్‌లు అందిన ప్రతిమెయిల్ను తెరవడం.. అందులో ఇతర పేజీలకు లింక్లేవైనా ఉంటే వాటిని క్లిక్ చేసి చూడటం... ఇది మనం మామూలుగా చేసే పని. జీమెయిల్ ఇన్‌బాక్స్ వ్యవహారం కొంచెం వేరు. ఇందులోని ప్రీవ్యూ ఫీచర్ ద్వారా మెయిల్ జాబితాలోలోనే కొంచెం పక్కగా ఆ మెయిల్లో ఉండే లింక్‌లు కనిపిస్తూంటాయి. మెయిల్ సబ్జెక్ట్, లింక్ ఏమిటన్నది చూసుకుని అవసరమైతే నేరుగా లింక్‌నే ఓపెన్ చేసుకోవచ్చు. లేదనుకుంటే అక్కడికక్కడే తొలగించుకోనూ వచ్చు.