GMR Hyderabad International Airport
-
శంషాబాద్ ఎయిర్‌పోర్ట్‌లో హైఅలర్ట్
సాక్షి, హైదరాబాద్: శంషాబాద్ రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్‌లో హైఅలర్ట్ నెలకొంది. బాంబు బెదిరింపు మెయిల్‌తో అధికారులు అప్రమత్తం అయ్యారు. దీంతో అప్రమత్తమైన సీఐఎస్ఎఫ్, బాంబు స్క్వాడ్ టీం తనిఖీలు చేపట్టాయి. అయితే కాసేపటికే ఈ వ్యవహారంలో మరో ట్విస్ట్ వెలుగు చూసింది. శంషాబాద్ ఎయిర్‌పోర్ట్‌ను ఇవాళ రాత్రి ఏడుగంటలకు పేల్చేస్తామంటూ ఎయిర్పోర్ట్ కస్టమర్ కేర్ సెంటర్‌కు ఓ మెయిల్ వచ్చింది. దీంతో సిబ్బంది ఉరుకులు, పరుగులు పెట్టాల్సి వచ్చింది. అయితే కాసేపటికే అదే మెయిల్ ఐడీ నుంచి మరో మెయిల్ వచ్చింది. తమ కుమారుడి మానసిక స్థితి బాగోలేదని.. అందుకే అలా సందేశం పంపాడని.. క్షమించాలని ఆ మెయిల్లో ఉంది. దీంతో అధికారులు ఊపిరి పీల్చుకున్నారు. అయితే ఎందుకైనా మంచిదనే ఉద్దేశంతో తనిఖీలు మాత్రం కొనసాగించి.. ఆ బెదిరింపును ఫేక్‌గా నిర్ధారించుకున్నాయి. మరోవైపు ఆ మెయిల్స్ బెంగాల్ నుంచి వచ్చినట్లు తెలుస్తోంది. ఆ మెయిల్స్ పంపిన చిరునామాను ట్రేస్ చేసే పనిలో అధికారులు ఉన్నారు. -
జీఎంఆర్ హైదరాబాద్ ఎయిర్పోర్ట్ రూ. 1,150 కోట్ల సమీకరణ
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: నాన్–కన్వర్టబుల్ డిబెంచర్ల (ఎన్సీడీ) జారీ ద్వారా జీఎంఆర్ హైదరాబాద్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ (జీహెచ్ఐఏఎల్) రూ. 1,150 కోట్లు సమీకరించింది. ఈ ఎన్సీడీలను బీఎస్ఈలో లిస్ట్ చేయ నున్నట్లు సంస్థ తెలిపింది. వీటిపై తొలి అయిదేళ్ల పాటు వార్షికంగా వడ్డీ రేటు 8.805 శాతంగా ఉంటుందని, ఆ తర్వాత మరో అయిదేళ్ల వ్యవధికి సంబంధించి మార్పులు ఉంటాయని పేర్కొంది. 2024, 2026లో మెచ్యూర్ అయ్యే కొన్ని ఈసీబీ (విదేశీ వాణిజ్య రుణాల) బాండ్లను పాక్షికంగా చెల్లించేందుకు ఈ నిధులను వినియోగించుకోనున్నట్లు సంస్థ తెలిపింది. జీహెచ్ఐఏఎల్ దేశీ డెట్ మార్కెట్లో నిర్వహించిన తొలి లిస్టెడ్ లావాదేవీకి ఇన్వెస్టర్ల నుంచి మంచి స్పందన లభించిందని జీఎంఆర్ గ్రూప్ కార్పొరేట్ చైర్మన్ గ్రంధి కిరణ్ కుమార్ తెలిపారు. తమ గ్రూప్‌పై మదుపుదారులకు ఉన్న నమ్మకానికి ఇది నిదర్శనమని ఆయన చెప్పారు. -
హైదరాబాద్ నుంచి సింగపూర్‌కు ‘వైడ్ బాడీ’ సర్వీసులు
సాక్షి, హైదరాబాద్: శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి వైడ్ బాడీ విమాన సర్వీసులను సింగపూర్ ఎయిర్‌లైన్స్ ప్రారంభించింది. సింగపూర్ ఎయిర్‌లైన్స్ అధికారులు, గెయిల్ అధికారులు కేక్‌కట్ చేసి జ్యోతి ప్రజ్వలన చేసిన అనంతరం ఏ–350–900 వైడ్ బాడీ విమాన సర్వీసు ఇక్కడి నుంచి టేకాఫ్ తీసుకుంది. హైదరాబాద్– సింగపూర్ మధ్య ఈ సర్వీసు గురు, శుక్ర, శని, ఆదివారాల్లో ఉంటుంది. వైడ్ బాడీ ఏ–350–900 విమానంలో ఎత్తైన సీలింగ్, పెద్ద కిటికీలతో పాటు ఎక్స్ట్రా వైడ్ కారణంగా సౌకర్యవంతమైన స్థలం ఇందులో ఉంటుంది. సింగపూర్ మీదుగా ఆ్రస్టేలియా.. ఆ్రస్టేలియా వెళ్లే ప్రయాణికులు సింగపూర్ మీదుగా ప్రయాణిస్తుంటారు. దాంతో ఆ్రస్టేలియా వెళ్లే ప్రయాణికులకు ఈ విమాన సరీ్వసులు అత్యధికంగా వినియోగంలోకి రానున్నాయి. సింగపూర్ మీదుగా వివిధ పర్యాటక ప్రాంతాలకు వెళ్లే ప్రయాణికులకు సైతం ఈ సరీ్వసును అత్యధికంగా వినియోగించుకునే అవకాశముంది. దక్షిణభారత దేశంలో తెలంగాణ రాష్ట్రం నుంచి ఆ్రస్టేలియాకు వెళుతున్న ప్రయాణికుల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. ఈ ఏడాది ఒక్క జూలై మాసంలోనే హైదరాబాద్ నుంచి ఆస్ట్రేలియాకు వెళ్లిన ప్రయాణికుల సంఖ్య నలభైరెండు వేలకు పైగా ఉందని ఎయిర్‌పోర్టు వర్గాలు వెల్లడించాయి. -
హైదరాబాద్ ఎయిర్‌పోర్టులో జీఎంఆర్ ప్రైమ్ సర్వీసులు
జాతీయ, అంతర్జాతీయ ప్రయాణికలు మరిన్ని సౌకర్యాలు అందుబాటులోకి తెచ్చింది జీఎంఆర్ సంస్థ. హైదరాబాద్ ఎయిర్‌పోర్టు మీదుగా రాకపోకలు సాగించే వారి కోసం అదనపు సౌకర్యాలు ప్రైమ్ సర్వీసుల పేరిట అందిస్తోంది. జీఎంఆర్ ప్రైమ్ యాప్‌ను డౌన్లోడ్ చేసుకుని దాని ద్వారా ఫోన్లో నుంచే ఈ సర్వీసులను బుక్ చేసుకోవచ్చు. ఇందులో ఎక్స్‌ప్రెస్ చెక్ ఇన్, పర్సనలైజ్డ్ ప్యాసింజర్ అసిస్టెన్స్ సర్వీస్, పోర్టల్ సర్వీస్, లాంగ్ యాక్సెస్, ఫాస్ట్ ట్రాక్ సెక్యూరిటీ క్లియరెన్స్ తదితర సేవలు ఉన్నాయి. ఎక్కడికి ప్రయాణం చేస్తున్నారు. ఏ విమానంలో ఈ క్లాసులో టిక్కెట్ బుక్ చేసుకున్నారనే అంశాలతో సంబంధం లేకుండా జీఎంఆర్ ఎయిర్పోర్ట గుండా ప్రయాణం చేసే వారు ఈ సేవలు వినియోగించుకోవచ్చు. ఇంటర్నేషనల్, డొమెస్టిక్ రెండు టెర్మినళ్లలో ఈ సేవలు అందుబాటులో ఉన్నాయి. దేశంలోనే అత్యంత వేగంగా అభివృద్ది చెందుతున్న విమానాశ్రయాల్లో హైదరాబాద్ ఒకటి. సుమారు ఆరు వేల కోట్లతో దీన్ని మరింతగా విస్తరించనున్నారు. దేశీయంగా ప్రధాన నగరాలతో పాటు అమెరికా, ఆస్ట్రేలియా, యూరప్ కంట్రీలోని నగరాలకు నేరుగా విమానాలు నడిపే దిశగా అభివృద్ధి పనులు జరుగుతున్నాయి. దీంతో అంతర్జాతీయ ప్రమాణాలకు తగ్గట్టు కస్టమర్ సర్వీసులు అందించేందుకు జీఎంఆర్ ప్రైమ్‌ని ప్రవేశపెట్టింది. చదవండి: హైదరాబాద్ ఎయిర్‌పోర్ట్‌కి ఫైన్.. కారణం ఇదే! -
హైదరాబాద్ ఎయిర్‌పోర్ట్‌లో యూడీఎఫ్ పెంచొద్దు
హైదరాబాద్: రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో యూజర్ డెవలప్మెంట్ ఫీజు (యూడీఎఫ్) పెంచేందుకు జీఎంఆర్ హైదరాబాద్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ (జీహెచ్ఐఏఎల్) చేసిన ప్రతిపాదనలపై దేశీ విమానయాన సంస్థల సమాఖ్య ఎఫ్ఐఏ అభ్యంతరం వ్యక్తం చేసింది. కోవిడ్–19పరమైన ప్రతికూల పరిణామాలతో ఎయిర్‌లైన్స్ పెను సవాళ్లు ఎదుర్కొంటున్న ప్రస్తుత తరుణంలో యూడీఎఫ్ పెంచడం సరికాదని, పెంపు ప్రతిపాదన అమలును వాయిదా వేయాలని ఎయిర్‌పోర్ట్స్ ఎకనమిక్ రెగ్యులేటరీ అథారిటీ (ఏఈఆర్ఏ)కి విజ్ఞప్తి చేసింది. థర్డ్ కంట్రోల్ పీరియడ్‌గా వ్యవహరిస్తున్న 2021 ఏప్రిల్–2026 మార్చి మధ్య కాలానికి టారిఫ్‌లను సవరించేందుకు అనుమతించాలంటూ ఏఈఆర్‌ఏకి జీహెచ్ఐఏఎల్ ప్రతిపాదనలు సమర్పించింది. దేశీయంగా ప్రయాణించే వారికి యూడీఎఫ్‌ను ప్రస్తుతమున్న రూ. 281 నుంచి ఏకంగా రూ. 608కి (116% అధికం), అంతర్జాతీయ రూట్ల ప్రయాణికులకు ప్రస్తుత రూ. 393 నుంచి రూ. 1300కి (231 శాతం) పెంపునకు అనుమతించాలని వీటిల్లో కోరింది. -
హైదరాబాద్ టు మాల్దీవులు.. వారానికి ఎన్ని రోజులు!
సాక్షి, హైదరాబాద్: పర్యాటక రంగం తిరిగి రెక్కలు విప్పుకుంటోంది. ఏడాదికి పైగా నిలిచిపోయిన రాకపోకలు క్రమంగా పెరుగుతున్నాయి. హైదరాబాద్ నుంచి షికాగోకు గత నెలలో రెగ్యులర్ విమాన సర్వీసులు అందుబాటులోకి వచ్చాయి. అలాగే గల్ఫ్‌దేశాలకు విమాన రాకపోకలు కొనసాగుతున్నాయి. తాజాగా పర్యాటకుల స్వర్గధామం మాల్దీవులకు విమాన సర్వీసులు ప్రారంభమయ్యాయి. గో ఎయిర్‌కు చెందిన ఫ్లైట్ ఏ8(1533) గురువారం ఉదయం 11.30 గంటలకు హైదరాబాద్ ఎయిర్‌పోర్టు నుంచి మాల్దీవుల్లోని మాలెకు బయలుదేరింది. మధ్యాహ్నం 1.30 గంటలకు మాల్దీవుల్లోని వెలానా అంతర్జాతీయ విమానాశ్రయానికి చేరుకుంది. తిరిగి అక్కడి నుంచి ఎ8(4033) విమాన సర్వీసు మధ్యాహ్నం 2.30 గంటలకు బయలుదేరి సాయంత్రం 5.30 గంటలకు హైదరాబాద్ చేరుకుంది. హైదరాబాద్ –మాలే మధ్య ఈ విమాన సర్వీసులు ప్రతి సోమవారం, మంగళవారం, గురువారం, శనివారం రాకపోకలు సాగిస్తాయి. పెరుగుతున్న సర్వీసులు.. కోవిడ్ అనంతరం నెలకొన్న సాధారణ పరిస్థితుల దృష్ట్యా హైదరాబాద్ నుంచి జాతీయ, అంతర్జాతీయ ప్రయాణాలు క్రమంగా పెరుగుతున్నాయి. కోవిడ్‌కు ముందు ప్రతిరోజు 10 వేల మంది అంతర్జాతీయ ప్రయాణికులు ఉండగా ఇప్పుడు 2,500 నుంచి 3,000 మంది రాకపోకలు సాగిస్తున్నాయి. ‘అంతర్జాతీయ ప్రయాణానికి ఆంక్షలు ఎత్తివేస్తే పూర్తిస్థాయిలో విమానాలు నడిపేందుకు సిద్ధంగా ఉన్నట్లు సీఈవో ప్రదీప్ పణికర్ తెలిపారు. మరోవైపు విజయవాడ, విశాఖపట్నం, నాగ్‌పూర్, భువనేశ్వర్, రాజమండ్రి, భోపాల్, తిరుపతి, బెంగళూర్ తదితర ప్రాంతాలకు దేశీయ విమాన సర్వీసులు పూర్తిగా అందుబాటులోకి వచ్చాయి. అడ్వెంచర్ టూర్స్@ మాలే మాల్దీవులు అనగానే అడ్వెంచర్ టూర్స్ గుర్తుకొస్తాయి. ప్రపంచం నలుమూలల నుంచి పర్యాటకులు ఇక్కడికి వచ్చేస్తారు. రకరకాల జలకాలాటలతో గడిపేస్తారు. అందమైన ప్రకృతి దృశ్యాలు సైతం కనువిందు చేస్తాయి. అద్భుతమైన ప్రదేశాలు పర్యాటకులను కనువిందు చేస్తాయి. వాటర్ స్పోర్ట్స్ క్రీడాకారులు, అడ్వెంచర్ స్పోర్ట్స్ ప్రేమికులే కాదు. హనీమూన్‌కు వెళ్లే జంటలకు సైతం మాల్దీవులు ఎంతో ఇష్టమైన ప్రదేశం. మాలేలోని కృత్రిమ బీచ్‌లో కయాకింగ్, వేక్బోర్డింగ్, స్కూబా డైవింగ్, కాటమరాన్ సెయిలింగ్ వంటి ఆకర్షణీయమైన జలక్రీడలను ఆస్వాదించవచ్చు. హైదరాబాద్– మాలేలను కలిపే ఈ విమాన సర్వీసు కోసం నగరవాసులు ఎంతో కాలంగా ఎదురు చూస్తున్నారు. హైదరాబాద్ నుంచి కేవలం రెండున్నర గంటల్లో మాలేకు చేరుకోవచ్చు.’ అని జీఎంఆర్ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టు సీఈవో ప్రదీప్ పణికర్ అన్నారు. గో ఎయిర్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ కౌశిక్ ఖోనా, హైదరాబాదీల కోసం గో ఎయిర్ ప్రత్యేక సర్వీసును ప్రారంభించింది’ అన్నారు. -
ఉత్తమ ఎయిర్పోర్ట్.. జీఎంఆర్ హైదరాబాద్
హైదరాబాద్: జీఎంఆర్ హైదరాబాద్ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్‌కు భారత్‌లో ఉత్తమ ఎయిర్పోర్ట్ అవార్డ్ లభించింది. ఆప్టెక్ ఏవియేషన్ అండ్ హాస్పిటాలిటి అకాడెమి అందించే ఈ అవార్డ్ 50 లక్షల-కోటిన్నర మంది ప్రయాణికుల కేటగిరిలో తమకు లభించిందని జీఎంఆర్ హైదరాబాద్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్(జీహెచ్ఐఏఎల్) ఒక ప్రకటనలో తెలిపింది. పనోరమ పేరుతో ఇటీల జరిగిన ఒక కార్యక్రమంలో ఈ అవార్డ్ స్వీకరించామని కంపెనీ చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ మనీశ్ సిన్హా పేర్కొన్నారు. కాగా మనీశ్ శర్మకు అప్‌కమింగ్ ఏవియేషన్ ప్రొఫెషనల్ అవార్డ్ కూడా లభించింది. విమాన ప్రయాణికులకు సముచితమైన స్థాయిలో సేవలందించడానికి తాము చేస్తున్న ప్రయాత్నాలకు ఈ అవార్డు ఒక గుర్తింపని కంపనీ సీఈఓ ఎస్జీకే కిశోర్ వెల్లడించారు.