ఉత్తమ ఎయిర్‌పోర్ట్.. జీఎంఆర్ హైదరాబాద్ | Best Airport .. GMR Hyderabad | Sakshi
Sakshi News home page

ఉత్తమ ఎయిర్‌పోర్ట్.. జీఎంఆర్ హైదరాబాద్

Published Tue, Dec 22 2015 1:17 AM | Last Updated on Sun, Sep 3 2017 2:21 PM

ఉత్తమ ఎయిర్‌పోర్ట్.. జీఎంఆర్ హైదరాబాద్

ఉత్తమ ఎయిర్‌పోర్ట్.. జీఎంఆర్ హైదరాబాద్

హైదరాబాద్: జీఎంఆర్ హైదరాబాద్ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్‌కు భారత్‌లో ఉత్తమ ఎయిర్‌పోర్ట్ అవార్డ్ లభించింది. ఆప్‌టెక్ ఏవియేషన్ అండ్ హాస్పిటాలిటి అకాడెమి అందించే ఈ అవార్డ్ 50 లక్షల-కోటిన్నర మంది ప్రయాణికుల కేటగిరిలో తమకు లభించిందని జీఎంఆర్ హైదరాబాద్ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్(జీహెచ్‌ఐఏఎల్) ఒక ప్రకటనలో తెలిపింది. పనోరమ పేరుతో ఇటీల జరిగిన ఒక కార్యక్రమంలో ఈ అవార్డ్ స్వీకరించామని కంపెనీ చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ మనీశ్ సిన్హా పేర్కొన్నారు.

కాగా మనీశ్ శర్మకు అప్‌కమింగ్ ఏవియేషన్ ప్రొఫెషనల్ అవార్డ్ కూడా లభించింది. విమాన ప్రయాణికులకు సముచితమైన స్థాయిలో సేవలందించడానికి తాము చేస్తున్న ప్రయాత్నాలకు ఈ అవార్డు ఒక గుర్తింపని కంపనీ సీఈఓ ఎస్‌జీకే కిశోర్ వెల్లడించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement